You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
1. డబ్బులు ఇస్తామన్నా పిల్లలను కనట్లేదు
ఆసియాలోని కొన్ని దేశాలను వేగంగా పడిపోతున్న జననాల రేటు ఆందోళనకు గురిచేస్తోంది. జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వాలు ఇక్కడ భారీగా ఖర్చు చేస్తున్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా?
1990లలోనే ఎక్కువ మంది పిల్లలు కనేలా జనాభాను ప్రోత్సహించేందుకు జపాన్ కొత్త విధానాలను తీసుకొచ్చింది. ఇలాంటి విధానాలనే దక్షిణ కొరియా 2000లో తీసుకొచ్చింది.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2. టైటానిక్: సముద్ర గర్భంలోని ఈ భారీ నౌక 'డీప్ సీ మ్యాపింగ్'తో ఎంత స్పష్టంగా కనిపిస్తోందో చూడండి
టైటానిక్ ఓడ మునిగిపోయిన వందేళ్ళ తరువాత దాన్ని మరింత స్పష్టంగా చూసే అవకాశం లభించింది. ఈ శతాబ్ద కాలంలో మునుపెన్నడూ టైటానిక్ శిథిలాలను ఇంత దగ్గరగా చూడడం సాధ్యం కాలేదు.
''డీప్ సీ మ్యాపింగ్'' సాంకేతికతను ఉపయోగించి అట్లాంటిక్ సముద్రంలో 3,800 మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ పడవను తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ స్కాన్ చేశారు.
ఈ డిజిటల్ స్కాన్ వల్ల పడవ మొత్తాన్ని త్రీడీలో చూడొచ్చు. అంతేకాకుండా పడవ చుట్టు పక్కల నీరు లేనట్లుగా కనబడుతుంది.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. ది కేరళ స్టోరీ: అదా శర్మకు బెదిరింపులు వస్తున్నాయా... తాజా వివాదాలపై ఆమె ఏమంటున్నారు?
''ది కేరళ స్టోరీ'' సినిమా మే 5న విడుదలైంది. ట్రైలర్ వచ్చినప్పటి నుంచీ ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
సినిమా విడుదలైన తర్వాత కూడా చాలా వివాదాలు రాజుకున్నాయి. వీటికి ప్రధాన కారణం ఈ సినిమా కథే.
కేరళకు చెందిన హిందూ మహిళలు మతమార్పిడుల అనంతరం సిరియాకు వెళ్లడం చుట్టూ అల్లిన కథే ''ది కేరళ స్టోరీ''. దీనికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు.
వాస్తవాల ఆధారంగా దీన్ని తెరకెక్కించామని సినిమా దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. తిరుపతి - వేమన ఇండ్లు: ఈ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు.. ఊళ్లోకి దళితులను రానివ్వరు
ఈ కాలంలో ఇలాంటి గ్రామాలు ఉన్నాయంటే నమ్మగలమా!
ఈ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకుని నడవరు. కలెక్టర్ వచ్చినా ఊరి బయట చెప్పులు తీసి, లోపలికి రావాలని చెబుతారు. తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలోని పాకాల మండలంలో ఉన్న ఉప్పర పల్లి పంచాయతీలోని 'వేమన ఇండ్లు'లో పరిస్థితి ఇదీ.
తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న 'ఆచార సంప్రదాయాలను' తాము గౌరవిస్తున్నామని ఊరి ప్రజలు చెబుతున్నారు.
ఈ గ్రామంలో చెప్పులేసుకుని ఎవరినీ అడుగుపెట్టనివ్వరు. అంతేకాదు, గ్రామస్థులు కూడా ఎన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్లినా చెప్పులు ధరించరు.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5. హమీదా బానో: మగ కుస్తీ యోధులు కూడా ఓడించలేని పహిల్వాన్ ఈమె, చివరకు బూందీ అమ్ముకుంటూ ఎందుకు బతికారంటే....
1950లలో భారత్‌లో మహిళలు రెజ్లింగ్ చేయడమంటే ఆషామాషీ కాదు. ఆ కాలంలోనే హమీదా బానో మగ కుస్తీ యోధులకు కూడా సవాల్ విసిరేవారు.
''కుస్తీలో నాపై పైచేయి సాధిస్తే, వారిని నేను పెళ్లి చేసుకుంటా'' అని 32 ఏళ్ల బానో చెప్పేవారు.
ఆమెతో పోరాడేందుకు 1954 ఫిబ్రవరిలో పటియాలా నుంచి ఒకరు, కోల్‌కాతా నుంచి మరొక పహిల్వాన్ వచ్చారు. అయితే, వారిద్దరినీ ఆమె చిత్తుగా ఓడించారు.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)