You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
1.వడదెబ్బ ఇంట్లో ఉన్నా ఎలా తగులుతుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. హీట్‌వేవ్ పరిస్థితుల వలన చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు.
ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహారం విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
హీట్ వేవ్ అంటే ఏమిటి?
ఏప్రిల్, మే, జూన్ నెలలలో హీట్ వేవ్ ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఈ పరిస్థితులను ప్రజలు చవిచూస్తున్నారని తెలిపారు.
సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉండే హీట్ వేవ్ జూలై నెలలో కూడా కొనసాగే అవకాశముందని తెలిపారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
2.ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు?
ఆవు పాలు, గేదె పాలు.. సాధారణంగా ఎక్కువ మంది వినియోగించేది ఈ రెండు రకాలే. చిన్నారులైతే తల్లి పాలు తాగుతారు.
నేరుగా ఆవులు, గేదెల నుంచి పితికి తెచ్చి విక్రయించే వారి దగ్గర కొంటే ఎక్కువగా ఆప్షన్లు ఉండవు కానీ ప్యాకెట్ పాలు అయితే టోన్డ్, డబుల్ టోన్డ్, ఫుల్ క్రీమ్ ఇలా రకరకాల ఆప్షన్లు ఉంటాయి.
ఎన్ని ఆప్షన్లు ఉన్నా విరివిగా దొరికే పాలలో ప్రధాన రకాలు ఆవు పాలు, గేదె పాలే.
కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. గాడిద, ఒంటె, మేక పాలు కూడా ఈ రెండింటి సరసన చేరుతున్నాయి.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
3.నిండుగా ఉన్న బంగారమే...ఆ దేశానికి శాపంగా మారిందా?
తూర్పు ఆఫ్రికా దేశం సూడాన్‌లో హింస చెలరేగుతోంది. విధ్వంసకర ఘర్షణల్లో ఇక్కడ180 మందికిపైగా మరణించారు. 1800 మందికిపైగా గాయపడ్డారు.
పారా మిలిటరీ దళం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) సభ్యులు, సైన్యానికి మధ్య దేశ రాజధాని ఖార్టూమ్‌తోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్నాయి.
ఏప్రిల్ 2019లో ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత మొదలైన రాజకీయ పోరాటాలు, ఉద్రిక్తతలు, సంక్షోభాలు నానాటికీ తీవ్రమై నేడు ఘర్షణలుగా మారాయి.
కౌన్సిల్ ఆఫ్ జనరల్స్ పాలనలో ఉన్న సూడాన్‌లో ఇద్దరు మిలిటరీ నాయకుల మధ్య ఎలాంటి చర్చలూ లేకపోవడమూ ఈ సంక్షోభానికి ఒక కారణం.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
4.హీమోఫిలియా-బీ: రక్తం గడ్డకట్టని జన్యుపరమైన వ్యాధి.. ఒక్కో ఇంజెక్షన్ రూ.28 కోట్లు
చేతి వేలు కోసుకుపోయినప్పుడు లేదా కాలికి ఏదైనా గాయమైనప్పుడు రక్తం కారడం మనం చూస్తుంటాం.
సాధారణంగా అలా కొద్దిసేపు రక్తం కారిన తర్వాత దానంతటదే ఆగిపోతుంది. కానీ, కొందరికి మాత్రం రక్తం గడ్డకట్టకుండా కారుతూనే ఉంటుంది.
హీమోఫిలియా వ్యాధి ఉన్న వారికి రక్తం గడ్డకట్టదు. బ్లీడ్ అవుతూనే ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం.
దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 17న హీమోఫిలియా అవేర్‌నెస్ డే నిర్వహిస్తున్నారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
5.జనాభాలో చైనాను దాటేస్తున్న భారత్... ఇవీ 5 ముఖ్యాంశాలు
భారత్ సుమారు 142.8 కోట్ల జనాభాతో చైనాను దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారనుందని ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
ఇది యూరప్ జనాభా (74.4 కోట్లు), అమెరికా జనాభా (104 కోట్లు) కంటే చాలా ఎక్కువ. చైనా 142.57 కోట్ల జానాభాతో రెండవ స్థానంలో నిలుస్తుంది.
భారత్‌లో 1960, 1980 మధ్య జనాభా వేగంగా పెరిగింది. 70 సంవత్సరాల కాలంలో 100 కోట్లకు పైగా పెరిగింది.
1980ల తరువాత కూడా జానాభా పెరిగినప్పటికీ, వృద్ధి రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. కాబట్టి భవిష్యత్తులో భారత జనాభా తగ్గుతుంది అనుకోవచ్చా?
స్వతంత్రం వచ్చిన తరువాత భారత జనాభా పెరుగుదల, వృద్ధి రేటు, భవిష్యత్తు అంచనాలు అయిదు చార్టులలో తెలుసుకుందాం.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- కొకైన్- ఏకంగా జలాంతర్గాములనే తయారు చేసి రవాణా చేస్తున్నారు, ఎక్కడంటే..-
- ది పోప్స్ ఎక్సార్సిస్ట్- 1.6 లక్షలమందికి భూత వైద్యం చేసిన ఫాదర్ అమోర్త్ గాబ్రియెల్ కథ
- నిమిషాల్లో సరకులను డెలివరీ చేసే బ్లింకిట్-లో సమ్మె ఎందుకు-
- స్పేస్-ఎక్స్-- నింగిలోకి వెళ్లిన కొద్దిసేపటికే పేలిన 'స్టార్-షిప్-'.. ఎలాన్ మస్క్ ఏమన్నారు-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)