ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

బరువు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

1.సెమాగ్లుటైడ్: ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?

సెమాగ్లుటైడ్.. బరువు తగ్గడానికి వాడే ఇంజెక్షన్ ఇది.

దీన్ని వాడుతున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ ధృవీకరించారు. ఈ డ్రగ్ వాడకం

హాలీవుడ్‌లో దీనిని వాడుతున్నారని అమెరికా మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.

అమెరికాలో పెరుగుతున్న జనాదరణ కారణంగా ఫార్మసీల వద్ద ఈ ఇంజెక్షన్ కొరతకు దారితీస్తోంది.

సెమాగ్లుటైడ్ అని పిలిచే ఈ ఔషధాన్ని వెగోవి, ఓజెంపిక్, రైబెల్సస్ అనే వాణిజ్య పేర్లతో విక్రయిస్తున్నారు. దీనిని టైప్ 2 మధుమేహం చికిత్సకు, స్థూలకాయం తగ్గించే మెడిసిన్‌గా ఉపయోగిస్తున్నారు.

ఇప్పుడు బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్)లో ఉపయోగించడానికి ఈ మెడిసిన్‌కు ఆమోదం లభించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ క్లిక్ చేయండి.

టీటీడీ

ఫొటో సోర్స్, BBC/TULASI PRASAD REDDY

2.టీటీడీకి కేంద్రం రూ.3 కోట్ల జరిమానా ఎందుకు విధించింది?

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద పొందిన లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్‌ చేసుకోకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్ల జరిమానా విధించింది.

ఈ లైసెన్సు రెన్యువల్‌ చేసుకోకపోవడంతో విదేశీ భక్తులు హుండీలో వేసిన దాదాపు రూ.30 కోట్ల విలువ చేసే విదేశీ కరెన్సీ టీటీడీ ఖాతాలో డిపాజిట్‌ కాకుండా ఎస్‌బీఐ దగ్గరే ఉండిపోయింది.

లైసెన్స్‌ రెన్యువల్‌ కాకపోవడంతో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఆ నగదును టీటీడీ అకౌంట్‌లోకి బదిలీ చేయడానికి అంగీకరించలేదు.

టీటీడీ ఈ అంశంపై వివరణ ఇచ్చినా, టీటీడీ సకాలంలో ఎందుకు రెన్యువల్‌ చేయలేదనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ప్రియాంక

ఫొటో సోర్స్, FACEBOOK

3.ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమానా లేక తమిళ సినిమానా? ఇప్పుడు సందేహాలు ఎందుకు?

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్ ఒక ఇంటర్వ్యూలో 'ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ సినిమా కాదు, తమిళ సినిమా' అన్నారు. దీనిపై ట్విట్టర్‌లో విమర్శలు, జోకులు వెల్లువెత్తుతున్నాయి.

సోమవారం ప్రియాంక చోప్రా అమెరికాకు చెందిన ఒక పాడ్‌క్యాస్ట్ కార్యక్రమం 'ఆర్మ్‌చైర్ ఎక్స్‌పర్ట్ విత్ డాక్స్ షెపర్డ్'లో మాట్లాడారు. బాలీవుడ్‌లో తన అనుభవాలు, సింగర్‌గా ఎదుగుదల, హాలీవుడ్‌లో ప్రవేశం, నిక్ జోనస్‌తో ప్రేమ, వివాహం మొదలైన విషయాలపై తన ఆలోచనలు, భావాలను పంచుకున్నారు.

ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న డాక్స్ బాలీవుడ్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ ఆర్ఆర్ఆర్ పేరు తీసుకొచ్చారు. వెంటనే ప్రియాంక ఆయన్ను సరి చేస్తూ 'ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ సినిమా కాదు, తమిళ సినిమా' అన్నారు.

గతంలో బాలీవుడ్ కొందరి చేతిలోనే ఉండేదని, ఆ పెద్ద మనుషులే సినిమాలు తీసేవారని, వారి చిత్రాలే ఆడేవని చెబుతూ, ఇప్పుడు పరిస్థితి మారిందని, చాలామందికి అవకాశాలు వస్తున్నాయని, ప్రయోగాలు చేస్తున్నారని ప్రియాంక ఆ ఇంటర్వ్యూలో అన్నారు.

ఆ సందర్భంలో, 'ఉదాహరణకు ఆర్ఆర్ఆర్' అంటూ డాక్స్ మధ్యలో మాట్లాడారు. వెంటనే ప్రియాంక సవరిస్తూ, 'అది తమిళ సినిమా.. భారీ, మెగా బ్లాక్ బస్టర్ తమిళ సినిమా" అని అభివర్ణించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

అంగోలా ఊచకోత

ఫొటో సోర్స్, VAN DUNEM FAMILY

4.90 వేల మంది ఊచకోత: 45 ఏళ్ల తరువాత అస్థికల అప్పగింత

అంగోలాలో 1977లో జరిగిన ఊచకోత అనంతరం ఆ భయం, నిశ్శబ్ధం దశాబ్దాల పాటు కొనసాగింది. అంగోలాకు చెందిన 90 వేల మంది ప్రజలు అప్పుడు సామూహిక హత్యలకు గురయ్యారు.

ఈ భయానక ఘటనలో కనిపించకుండా పోయిన వ్యక్తులకు చెందిన కుటుంబాలు, తమ వారి గురించి గొంతెత్తడం ప్రారంభించాయి.

తమ ప్రశ్నలకు బదులు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం మొదలెట్టాయి.

ప్రజలతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. అయితే, రాజీ కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొందరి పట్ల దారుణంగా బెడిసికొట్టాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

క్యాండిడా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

5.క్యాండిడా ఆరిస్ : అమెరికాను వణికిస్తున్న ఈ సూపర్‌బగ్ ఏమిటి?

ఔషధాలకు లొంగని మొండి ఫంగస్ క్యాండిడా ఆరిస్ (సి. ఆరిస్)ను 15 ఏళ్ల క్రితమే తొలిసారిగా వైద్యులు గుర్తించారు. కానీ, నేడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆసుపత్రులను ఇది భయపెడుతోంది.

ఒకసారి ఇది శరీరంలోకి ప్రవేశిస్తే, ఈస్ట్ తరహాలో పనిచేసే ఈ ఫంగస్ రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థలు, అంతర్గత అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రమాదకర ఇన్ఫెక్షన్ సోకినవారిలో మరణాల రేటు 30 నుంచి 53 శాతం వరకు ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేస్తోంది.

ఇక్కడ ఆందోళనకర అంశం ఏమిటంటే.. ప్రస్తుతం అందుబాటులోనున్న సాధారణ యాంటీఫంగల్ ఔషధాలను తట్టుకొని ఈ ఫంగస్ నిలబడుతోంది. ఈ ఫంగస్‌లో కొన్ని రకాలపై ఏ ఔషధాలూ పనిచేయడంలేదని వైద్యులు చెబుతున్నట్లు బీబీసీ హెల్త్ కరస్పాండెంట్ జేమ్స్ గల్లఘెర్ వివరించారు.

30కిపైగా దేశాల్లో ఈ ఫంగస్ వ్యాపిస్తోందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంచనా వేస్తోంది. 2009 నుంచి 2019 మధ్య ఈ ఫంగస్ కేసులు 4,750 ప్రపంచ వ్యాప్తంగా నమోదైనట్లు 2020లో నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)