ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

1. తుర్కియే భూకంపం: 'పది రోజుల పసిగుడ్డుతో సహా శిథిలాల కింద సమాధై.. నాలుగు రోజుల పాటు ఎలా బతికానంటే..'
తుర్కియే, సిరియా దేశాల్లో సంభవించిన ఘోర భూకంపం వేలాది మందిని బలి తీసుకుంది. మృతుల సంఖ్య 35 వేలు దాటింది. గుండెలను పిండేసే విషాద గాథల మధ్య.. ఎంతో సంతోషాన్నిచ్చే కొన్ని ''అద్భుతాలు'' కూడా జరుగుతున్నాయి. ఇది అలాంటి ఒక మిరకిల్.
నెక్లా కాముజ్ వయసు 33 ఏళ్లు. ఆమె జనవరి 27వ తేదీన తన రెండో కుమారుడికి జన్మనిచ్చారు. అతనికి యాగిజ్ అని పేరు పెట్టారు. అంటే ''ధీశాలి'' అని అర్థం.
సరిగ్గా పది రోజులు గడిచాయి. అప్పుడు సమయం తెల్లవారు జామున 4:17 గంటలైంది. తమ ఇంట్లో నెక్లా తన కుమారుడికి పాలు పడుతూ మెలకువగానే ఉన్నారు. అకస్మాత్తుగా ఆ తల్లీబిడ్డల మీద ఆకాశం కూలిపడింది. వారిద్దరూ శిథిలాల గుట్టల కింద సజీవంగా సమాధయ్యారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, Getty Images
2. భారత్ పురాతన స్మార్ట్‌ఫుడ్ ఎలా సూపర్‌ఫుడ్‌గా మారుతోంది?
కర్రల పొయ్యికి ఎదురుగా చీర కట్టుకొని కూర్చున్న ఆమె సజ్జల(పెర్ల్ మిల్లెట్)తో చేసిన ఒక రొట్టెపై నెయ్యి రాసి నా చేతికి ఇచ్చారు. దీనితోపాటుగా సెనగపిండితో చేసిన రుచికరమైన కూర కూడా పెట్టారు. నేను నాగ్‌పుర్‌లోని ఒక అటవీ ప్రాంతంలో ఉన్నాను. అది మంచి శీతాకాలం. ఆ రుచికరమైన సజ్జ రొట్టి నా బొజ్జలో కాస్త వేడినింపింది.
మిల్లెట్లను నీరు తక్కువగా ఉండే ప్రాంతాల్లో లేదా అంతగా సారవంతంకాని నేలల్లో ఎక్కువగా పండిస్తుంటారు. వీటిని జావతో మొదలుపెట్టి బియ్యానికి ప్రత్యామ్నాయంగా, రొట్టెలు చేసుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు. పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, Getty Images
3. భూకంపం ఎందుకు వస్తుంది? భూమి లోపలి ఫలకాలు, వాటి మధ్య 'ఫాల్ట్ లైన్'లు ఏమిటి?
తుర్కియేలో భారీ భూకంపానికి ఇక్కడి ఫాల్ట్ లైన్ కారణమని నిపుణులు చెబుతున్నారు. అసలు ఇంతకీ ఫాల్ట్ అంటే ఏమిటి? దీని వల్ల భూకంపాలు ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్నలపై సైస్మాలజిస్టుతో బీబీసీ మాట్లాడింది.
భూమి పైపొరల్లో 16 ప్రధాన ఫలకాలు ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఎర్త్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జెస్సికా హాథార్న్ చెప్పారు. ఆమె భూకంపాలపై అధ్యయనం చేస్తున్నారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, Getty Images
4.డియోడరెంట్ పీల్చటం ప్రాణాలకు ముప్పు తెస్తుందా? జాగ్రత్తగా వాడటం ఎలా?
స్నానం చేసిన తర్వాత రెడీ అయ్యేటప్పుడు చాలామంది ఉపయోగిస్తున్నవస్తువుల్లో డియోడరెంట్ ఒకటి.
చెమటవల్ల శరీరం నుంచి చెడువాసన రాకుండా.. రోజంతా తాజాగా ఉంచుతుంది. డియోడరెంట్‌లో రసాయనాలు.. చెమటలో బాక్టీరియా వృద్ధిచెందకుండా చేస్తాయి.
రకరకాల సువాసనలతో మనసు దోచుకునే రకరకాల డియోడరెంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏరోసల్ డియోడరెంట్ అంటే స్ప్రే చేసే డియోడరెంట్. రోల్ ఆన్, స్టిక్స్.. ఇలా చాలా వెరైటీలు ఉన్నాయి. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి

ఫొటో సోర్స్, AFP
5. క్యాన్సర్ రోగులకు రూ.15 లక్షలు సాయం చేసే ఈ పథకం గురించి తెలుసా?
క్యాన్సర్ చికిత్స అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో ఖరీదుతో కూడుకున్నది. పేదవారికి ఈ క్యాన్సర్ నెత్తిన పిడుగులాంటిదే.
క్యాన్సర్ చికిత్సకయ్యే ఖర్చు భరించే స్తోమత లేక నిరుపేదలు అల్లాడిపోతుంటారు. ఎన్నో అవస్థలు పడుతుంటారు. సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం పేద క్యాన్సర్ రోగులకు వారి వైద్యానికయ్యే ఖర్చుకు రూ.15 లక్షల వరకు ఆర్థిక సాయం చేసే ఒక పథకాన్ని అమలు చేస్తోంది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన- 20 రూపాయ-ల-తో రూ. 2 లక్ష-ల ప్ర-మాద బీమా పొందడం ఎలా-?
- కేరళ: బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట
- ధీరేంద్ర బ్రహ్మచారి: ఈ యోగా గురువు ఇందిరా గాంధీ మంత్రుల్ని కూడా మార్చే స్థాయికి ఎలా ఎదిగారు?
- పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఏ దేశానికి వెళ్లాలి? టాప్ 5 దేశాలు ఇవీ...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























