ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

హైదరాబాద్: ఎలక్ట్రిక్ కార్లు పోటీ పడే ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
ప్రచురణ

1. హైదరాబాద్: ఎలక్ట్రిక్ కార్లు పోటీ పడే ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది?

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేస్ జరగబోతోంది. ఈ శనివారం జరిగే రేసుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.

హుస్సేన్ సాగర్ తీరంలో ఝామ్మంటూ దూసుకుపోనున్నాయి రేస్ కార్లు.

ఫార్ములా వన్ రేస్ లు చాలా మందికి తెలుసు. ఈ 'ఫార్ములా ఈ' సంగతి ఏంటి? పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్: గుర్రాలపై బడికి వెళ్తున్న పిల్లలు

2. ఆంధ్రప్రదేశ్: గుర్రాలపై బడికి వెళ్తున్న పిల్లలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి పథకం బడి ముఖం ఎరుగని కొందరు ఆదివాసీ విద్యార్థులను పాఠశాలలకు పంపిస్తోంది. అయితే వీరు పాఠశాలను చేరుకునేందుకు రోజూ ఐదు కిలోమీటర్లు గుర్రాలపై ప్రయాణం చేస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా నేరేడుబంద ఆదివాసీ గ్రామం నుంచి అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని జెడ్. జోగుంపేట ప్రాథమిక పాఠశాలకు గుర్రాలపై విద్యార్థులు వస్తుంటారు. బడికి వచ్చేందుకు రెండు జిల్లాల మధ్య వీరు రోజూ సాహసయాత్ర చేస్తున్నారు. పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ద‌ళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 ల‌క్ష‌ల స్కాల‌ర్ షిప్

ఫొటో సోర్స్, Getty Images

3. ద‌ళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 ల‌క్ష‌ల స్కాల‌ర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం

గ‌గ‌న వీధుల్లో విమాన‌మెక్కి అలా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని ఆశ‌ప‌డ‌ని మ‌న‌సు ఉండ‌దు. అలాంటి విమానం న‌డిపే పైలెట్ కావాల‌ని క‌ల‌లు క‌నే కుర్ర‌కారు త‌క్కువేం కాదు.

కాకుంటే అది అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. నిరుపేద‌ల‌కు అందునా మారుమూల గ్రామాల్లో ఉండే నిరుపేద ద‌ళిత యువ‌త‌కు అది అంద‌ని క‌లే.

పేద ద‌ళిత యువ‌తీయువ‌కులు ఒక ప్రైవేటు ప్ల‌యింగ్ క్ల‌బ్‌లో చేరి ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఫీజు క‌ట్టి క‌మ‌ర్షియ‌ల్ పైలెట్‌గా శిక్ష‌ణ పొంద‌డం అంటే మాట‌లా? అసాధ్య‌మే అనుకుంటాం. కానీ సుసాధ్య‌మే అంటోంది కేంద్ర ప్ర‌భుత్వం. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ట్రాన్స్‌జెండర్ జంట: బిడ్డకు జన్మనిచ్చిన కేరళ కపుల్

ఫొటో సోర్స్, ZIYA PAVAL/INSTAGRAM

4. ట్రాన్స్‌జెండర్ జంట: బిడ్డకు జన్మనిచ్చిన కేరళ కపుల్

బిడ్డకు జన్మనిచ్చేందుకు హార్మోన్ చికిత్సను ఆపుకున్న భారతీయ ట్రాన్స్‌జెండర్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. కొన్ని కారణాల వల్ల నెల రోజుల ముందే జహాద్‌కు డెలివరీ చేయాల్సి వచ్చింది.

ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం జహాద్ బిడ్డకు జన్మనిచ్చినట్లు జియా బీబీసీకి తెలిపారు. అయితే పుట్టిన బిడ్డ లింగం, పేరు వివరాలను వారు వెల్లడించలేదు.

అంతకు ముందు వీరి ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Reuters

5.భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?

తుర్కియే, సిరియాలలో 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. ఈ దశాబ్దంలోనే అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా చెబుతున్న దీని కారణంగా ఐదు వేల మందికిపైగా మరణించారు.

విధ్వంసకర భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తుర్కియే కూడా ఒకటి. 1939 నుంచి 1999 మధ్య ఐదు భారీ భూకంపాలు ఈ ప్రాంతాన్ని కుదిపేశాయి.

1900 నుంచి నేటి వరకు ఇక్కడ 76 భూకంపాల కారణంగా 90,000 మంది మరణించారు. ఈ మరణాల్లో సగం 1939 నుంచి 1999 మధ్యే సంభవించాయి. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)