You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కశ్మీర్: రాజౌరీలో బీజేపీ నాయకుడి ఇంటిపై గ్రెనేడ్‌తో దాడి, ఒకరి మృతి -Newsreel
స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల ముందు, జమ్మూకశ్మీర్ రాజౌరీలోని బీజేపీ నాయకుడు జస్బీర్ సింగ్ ఇంటిపై దుండగులు గ్రెనేడ్‌తో దాడిచేశారు.
గురువారం రాత్రి జరిగిన ఈ దాడిలో జస్బీర్ మేనల్లుడు (3) మరణించాడు. మిగతా కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. రాత్రి 9.30 గంటలకు జస్బీర్ ఇంటిలో అందరూ వరండాలో కూర్చున్నప్పుడు ఈ దాడి జరిగింది.
ఘటన స్థలంలో గ్రెనేడ్ పిన్ను దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.
జస్బీర్, ఆయన సోదరుడు బల్బీర్, వీరి తల్లిదండ్రులతోపాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా దాడిలో గాయపడ్డారు. క్షతగాత్రులను రాజౌరీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
జస్బీర్, బల్బీర్‌లతోపాటు వీరి తండ్రి కూడా భారత సైన్యంలో పనిచేశారు.
ఖాండ్లి బ్రిడ్జికి సమీపంలోని జస్బీర్ ఇంటిపై ఈ దాడి జరిగినట్లు జమ్మూ అదనపు డీజీపీ ముఖేశ్ సింగ్ స్పష్టంచేశారు.
అయితే, క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించడంలో వైద్యులు విఫలమయ్యారని జస్బీర్ మద్దతుదారులు ఆసుపత్రి బయట నినాదాలు చేశారు. జమ్మూకశ్మీర్ ఐజీ వివేక్ గుప్తా జోక్యం చేసుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.
''జస్బీర్ కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. తను తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స అందిస్తుండగా అతడు మరణించాడు. మరోవైపు ఏడు నెలల బాలిక కూడా గాయపడింది. తనను మెడికల్ కాలేజీ ప్రధాన ఆసుపత్రికి తరలించాం''అని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మజూర్ హుస్సేన్ బీబీసీతో చెప్పారు.
బ్రిటన్‌లో సాయుధుడి కాల్పులు.. ఆరుగురు మృతి
బ్రిటన్‌లోని ప్లైమౌత్‌లో గురువారం కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. వీటిలో ఆరుగురు మరణించారని వివరించారు.
‘‘మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మృతి చెందాడు. వీరంతా బుల్లెట్ గాయాల వల్లే మరణించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఈ వివరాలు తెలియజేశాం’’అని పోలీసులు తెలిపారు.
మరణించిన వారిలో ఒకరి వయసు పదేళ్లలోపే ఉందని, మరికొంత మంతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్లైమౌత్ ఎంపీ ల్యూక్ పొలార్డ్ చెప్పారు.
‘‘మొదట ఓ ఇంటి తలుపుకొట్టిన సాయుధుడు, బయటకు వచ్చిన వారిపైకి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పరిసరాల్లోని పార్క్ దగ్గర మరికొంత మందిపై అతడు కాల్పులు జరిపాడు’’అని ప్రత్యక్ష సాక్షి షారన్ తెలిపారు.
ఘటనకు ఉగ్రవాదంతో సంబంధంలేదని ప్లైమౌత్ మూర్ ఎంపీ జానీ మెర్సెర్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ‘‘దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన వల్ల పరిసరాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొంత సేపటివరకు రహదారులపై ప్రయాణ ఆంక్షలు కొనసాగుతాయి’’అని పోలీసులు తెలిపారు.
ఘటనకు సంబంధించిన దృశ్యాలు లేదా చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని పోలీసులు అభ్యర్థించారు.
ఇవి కూడా చదవండి:
- 'నగ్నంగా ఆరుబయట స్నానం చేయమన్నారు, మొదట్లో సిగ్గుపడ్డాను కానీ అదే ఎంతో మేలు చేసింది’
- ‘పిలిచారని పార్టీకి వెళ్తే మత్తు మందిచ్చి రేప్ చేశారు’
- సరస్సు అడుగున బయటపడిన గ్రామం
- విక్రమ్ సారాభాయ్, మృణాళినిల ప్రేమ కథ ఇది
- కోవిడ్ టీకా వేసుకుంటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందా? గర్భస్రావం అవుతుందా?
- తెలంగాణలోని ఈ గ్రామానికి కోవిడ్‌ను ఎదుర్కొనే శక్తి ఎలా వచ్చింది
- ఫొటోల్లో లక్షల ఏళ్ల భారత చరిత్ర!
- ప్రజాస్వామ్యం నుంచే నిరంకుశత్వం పుడుతుందని ప్లేటో ఎందుకు అన్నారు?
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?