టోక్యో ఒలింపిక్స్ - ప్రవీణ్ జాధవ్: వరల్డ్ నెంబర్ 2ను ఓడించాడు, కానీ నెంబర్ వన్ చేతిలో పరాజయం పాలయ్యాడు

ప్రవీణ్ జాధవ్

ఫొటో సోర్స్, @IndiaSports

ఫొటో క్యాప్షన్, భారత ఆర్చర్ ప్రవీణ్ జాధవ్
ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

టోక్యో ఒలింపిక్స్‌లో వరల్డ్ నంబర్ 2 ఆర్చర్‌ను మొదటి రౌండ్‌లోనే బయటకు పంపించాడు భారత విలుకాడు ప్రవీణ్ జాధవ్.

భారత ఆర్చర్ ప్రవీణ్ జాధవ్ టోక్యో ఒలింపిక్స్ పురుషుల వ్యక్తిగత పోటీల్లో వరల్డ్ నంబర్ 2 రష్యా ఆర్చర్ గాల్సన్ బజర్‌ఝపోవ్‌ను మొదటి రౌండ్‌లో ఓడించాడు.

ప్రవీణ్ గాల్సన్‌ను 6-0తో ఓడించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

తన మొదటి ఒలింపిక్స్ ఆడుతున్న 25 ఏళ్ల జాధవ్ వేగంగా వీస్తున్న గాలుల మధ్య తన పట్టు కోల్పోకుండా బాణాలు సంధించాడు. రెండో రౌండ్‌కు చేరాడు.

కానీ ఆ తర్వాత రౌండ్‌లో వరల్డ్ నెంబర్ వన్ చేతిలో జాధవ్ పరాజయం పాలయ్యాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

జట్టులో జాధవ్ సీనియర్ సహచరుడు తరుణ్‌దీప్ రాయ్ రెండో రౌండ్‌లో ఇజ్రాయెల్ ఆర్చర్ చేతిలో ఓడిపోయారు.

37 ఏళ్ల రాయ్‌కు ఇది చివరి ఒలింపిక్స్. ఆయన మొట్టమొదట 2004లో ఏథెన్స్‌లో మొదటి ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కూడా రెండో రౌండ్‌లో అవుట్ అయ్యారు.

టోక్యో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ ఆర్చరీలో భారత ఆర్చర్ తరుణ్‌దీప్ తన తొలి మ్యాచ్‌లో యుక్రెయిన్ ఆటగాడు ఒలేక్సీ హంబిన్‌ను 6-5 తేడాతో ఓడించాడు.

కానీ తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ఇటే షాన్నీ చేతిలో తరుణ్‌దీప్ 5-6 తేడాతో ఓటమి పాలయ్యాడు.

పీవీ సింధూ

ఫొటో సోర్స్, ALEXANDER NEMENOV/AFP via Getty Images

మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ గ్రూప్ దశ పోటీల్లో తెలుగు తేజం పీవీ సింధు హాంకాంగ్‌ క్రీడాకారిణిని వరుస సెట్లలో ఓడించారు.

హాంకాంగ్ క్రీడాకారిణి ఎంగాన్ యీ చెంగ్‌ను సింధు 21-9, 21-16 తేడాతో ఓడించారు.

ఈ విజయంతో పీవీ సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో స్థానం సంపాదించారు.

హాకీ

ఫొటో సోర్స్, Brendan Moran/Sportsfile via Getty Images

బ్రిటన్ చేతిలో 4-1 తేడాతో ఓడిన భారత మహిళా హాకీ టీమ్

టోక్యో ఒలింపిక్స్ మహిళల హాకీ పూల్ 'ఎ' మ్యాచ్‌లో బ్రిటన్‌తో చేతిలో భారత్ 4-1 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది.

మ్యాచ్‌ మొత్తం భారత జట్టు ఒత్తిడితో కనిపించగా, బ్రిటన్ చివరి వరకూ తమ ఆధిక్యం నిలుపుకోగలిగింది.

ఫస్ట్ హాఫ్ ప్రారంభంలోనే ఒక గోల్ చేసిన బ్రిటన్ భారత జట్టుపై మొదటి నుంచీ ఒత్తిడి పెట్టింది. ఆ తర్వాత భారత్ జట్టు ఎన్నో ప్రయత్నాలు చేసినా గోల్ చేయలేకపోయింది.

కాసేపటి తర్వాత బ్రిటన్ రెండో గోల్ కూడా చేసింది. తర్వాత పుంజుకున్న భారత్ హాఫ్ టైమకు ముందు ఒక గోల్ చేయగలిగింది. షర్మిలా దేవి పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచారు.

ఆ తర్వాత బ్రిటన్ కాస్త ఒత్తిడికి గురైంది. కానీ సెకండ్ హాఫ్‌ మొదలైన తర్వాత బ్రిటన్ మూడో గోల్ చేసి భారత్‌ను మరింత కష్టాల్లోకి నెట్టింది. చివర్లో ఆట ముగిసే ముందు మరో గోల్ చేసిన బ్రిటన్ 4-1తో భారత్‌పై విజయం సాధించింది.

Please wait...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)