జమ్ము ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో పేలుళ్లు తీవ్రవాదుల పనేనన్న డీజీపీ - Newsreel

ఫొటో సోర్స్, Ani
జమ్ము ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ టెక్నికల్ ఏరియాలో ఆదివారం తెల్లవారుజామున రెండు పేలుళ్లు సంభవించాయి. ఇది తీవ్రవాదుల చర్యేనని జమ్ము, కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ అన్నారు. పోలీసులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఇతర ఏజెన్సీలు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయని సింగ్ తెలిపారు.
ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోని టెక్నికల్ ప్రాంతంలో సంభవించిన ఈ పేలుళ్లలో ఒక భవనం స్వల్పంగా దెబ్బతింది. మరో పేలుడు ఖాళీ స్థలంలో చోటుచేసుకుందని భారత వైమానిక దళం వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
విమానశ్రయంలో పరికరాలకు ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు చెప్పాయి.
పేలుడు పదార్థాలను డ్రోన్ల ద్వారా జారవిడిచి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుళ్లపై జమ్ము, కశ్మీర్ పోలీసులు ఐపీసీ 307, 120బీ, యుఏపీఏ సెక్షన్ 16, 18, 23 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సహోద్యోగినికి ఆఫీసులోనే ముద్దు పెట్టి పదవి పోగొట్టుకున్న బ్రిటన్ ఆరోగ్య మంత్రి

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ ఆరోగ్య మంత్రి మేట్ హేన్‌కాక్ తన పదవికి రాజీనామా చేశారు.
తన కొలీగ్‌ను ముద్దు పెట్టుకొని కోవిడ్ సోషల్ డిస్టెన్సింగ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడంతో రాజీనామా తప్పలేదు. ఈ మేరకు ఆయన తన రాజీనామాను ప్రధాని భోరిస్ జాన్సన్‌కు పంపించారు.
కోవిడ్ నియమాలను ఉల్లంఘించినందుకు ఆయన తన రాజీనామా లేఖలో క్షమాపణలు చెప్పారు. అలాగే, తన కుటుంబానికీ క్షమాపణలు చెప్పారు.
మూడేళ్లు ఆరోగ్య మంత్రిగా పనిచేసిన హేన్‌కాక్ రాజీనామా చేయడం బాధ కలిగించిందని బోరిస్ జాన్సన్ అన్నారు. కోవిడ్ సమయంలో, అంతకుముందు కూడా ఆయన తన బాధ్యతలు చక్కగా నిర్వర్తించారని బోరిస్ అన్నారు.
కాగా మేట్ హేన్‌కాక్ స్థానంలో మాజీ చాన్సలర్ సాజిద్ జావీద్‌ను ఆరోగ్యమంత్రిగా నియమిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మేట్ హేన్‌కాక్, ఆయన కార్యాలయ ఉద్యోగిని గినా కొలడాంజెలోను ముద్దు పెట్టుకుంటున్న చిత్రాన్ని 'ది సన్' పత్రిక ప్రచురించడంతో పాటు వారిద్దరి ముద్దు వీడియోలు కూడా బయటపెట్టడంతో ఆయన రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరిగింది.
మే 6న ఆరోగ్య శాఖ కార్యాలయంలోనే వారిద్దరూ ముద్దు పెట్టుకున్నారని 'ది సన్' రాసింది.
హేన్‌కాక్, కొలడాంజెలోలు ఇద్దరూ వివాహితులే. కాగా హేన్‌కాక్ తన భార్య మార్తాతో 15 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారని అనేక పత్రికలు రాశాయి.
మరోవైపు కొలడాంజెలో కూడా ఈ ఘటన తరువాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌తో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి బయటకు దూకేసిన ప్రయాణికుడు

ఫొటో సోర్స్, Getty Images
లాస్ ఏంజలస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కదులుతున్న విమానంలోంచి ఓ ప్రయాణికుడు బయటకు దూకేశారు.
విమానం బయలుదేరి రన్‌వేలో నడుస్తుండగా ఆ ప్రయాణికుడు సీటు నుంచి లేచి కాక్‌పిట్ వైపు వెళ్లారు.
కాక్‌పిట్ తలుపులపై బాదారు. అవి తెరుచుకోకపోవడంతో ఎమర్జెన్సీ డోరు తెరిచి బయటకు దూకేశారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది.
రన్‌వేలోనే ఆయనను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఏమైనా గాయాలయ్యాయా అనేది ఇంకా తెలియలేదు.
ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం స్థానిక సమయం 19.10 గంటలకు లాస్ ఏంజలస్ నుంచి సాల్ట్ లేక్ సిటీకి బయలుదేరిన స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్ వారి యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌లో జరిగింది.
ఇటీవల అమెరికాలో ఇలాంటి విమాన ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే సుమారు 3,000 సంఘటనలు నమోదయ్యాయి.
ఈ వ్యక్తి సీటులోంచి లేవడం, కాక్‌పిట్ వైపు వెళ్లడం విమాన సిబ్బంది చూశారని ఎన్‌బీసీ న్యూస్ తెలిపింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎందుకు అలా చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో చట్టాన్ని ఉల్లంఘించిన కేసులను దర్యాప్తు చేసినట్లు ఈ నెల ప్రారంభంలో ఎఫ్ఏఏ తెలిపింది. వీటిల్లో చాలావరకు మాస్కులు వేసుకోవడానికి నిరాకరించిన కేసులే.
మే 25 నాటికి "విమాన సిబ్బంది విధుల్లో కలుగజేసుకోవడానికి ప్రయత్నించిన" కేసులు సుమారు 394 నమోదయ్యాయని ఏజెన్సీ తెలిపింది.
ఈ సంఖ్య గత ఏడాది మొత్తంలో దర్యాప్తు చేసిన 183 కేసుల కన్నా రెట్టింపు.
ఇవి కూడా చదవండి:
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్: ట్విటర్, భారత ప్రభుత్వం మధ్య వివాదం ఏమిటి
- వరుడు కావలెను: '30 ఏళ్ల మహిళకు 25-28 ఏళ్ల అందమైన, ఆస్తిపరుడైన, వంట చేయగల కుర్రాడు కావాలి'
- ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?
- సోనాగచ్చి మహిళా సెక్స్ వర్కర్లు: ‘ఈసారి మా ఓటు నోటాకే.. ఎందుకంటే..’
- ఎమర్జెన్సీ రోజుల్లో సంజయ్ గాంధీ ఎలా ఆదేశాలు ఇచ్చేవారంటే...
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























