పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కోవిడ్-19 - Newsreel

ఫొటో సోర్స్, Reuters
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు కోవిడ్-19 సోకిందని ఆ దేశ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. '68 ఏళ్ల ప్రధాని ఇమ్రాన్ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు' అని పాకిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఫైజల్ ఖాన్ ట్వీట్ చేశారు.
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన ఇమ్రాన్ ఖాన్ 2018 ఆగస్టులో ఆ దేశ ప్రధాని అయ్యారు. ఆయన రెండు రోజుల కిందటే వ్యాక్సీన్ కూడా తీసుకున్నారు. కోవిడ్-19కు కారణమయ్యే వైరస్‌ను ఎదుర్కోగల రోగనిరోధక శక్తిని వ్యాక్సీన్ పెంచుతుంది. అయితే, అది మనిషి శరీరం లోపల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. వ్యాక్సీన్ తీసుకున్న వెంటనే కొన్ని వారాల వరకు వైరస్ సోకే అవకాశం ఉంటుంది.
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కీలకమైన సమావేశాలలో పాల్గొంటూనే ఉన్నారు. ఇటీవల రాజధాని ఇస్లామాబాద్‌లో సెక్యూరిటీ సదస్సుకు కూడా హాజరయ్యారు. ఆ సదస్సులో చాలా మంది పాల్గొన్నారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఆ సదస్సులో ఇమ్రాన్ మాస్క్ లేకుండానే ప్రసంగించారని, ఆ తరువాత శుక్రవారం నాడు పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టు ప్రారంబోత్సవంలో పాల్గొన్నారని రాయిటర్స్ నివేదించింది.
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 6,23,135 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ మూలంగా 13,799 మంది చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు... అమరావతి భూముల సేకరణపై విచారణకు రావాలని ఆదేశం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



















