You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యెమెన్: ఎయిర్‌పోర్ట్‌లో పేలుడు, 22 మంది మృతి - News reel
దక్షిణ యెమెన్ నగరం ఏడెన్‌లోని విమానాశ్రయంలో విధ్వంసకర దాడి జరిగింది. భారీ పేలుడుకు ఇక్కడ 22 మంది మరణించారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
ఇటీవల కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ ప్రతినిధులు సౌదీ అరేబియా నుంచి ఇక్కడకు విమానంలో వచ్చిన సమయంలో పేలుడు చోటుచేసుకుంది.
మరణించిన వారిలో ఎక్కువ మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. తనతోపాటు తన మంత్రి బృందం క్షేమంగానే ఉందని ప్రధాన మంత్రి ప్రకటించారు.
హౌతి తిరుగుబాటుదారులే ఈ దాడి చేపట్టారని సమాచార ప్రసార శాఖ మంత్రి ఆరోపించారు.
హౌతీ తిరుబాటుదారులను అణచివేస్తూ, అధ్యక్షుడు మన్సౌర్ హాదీ ప్రభుత్వాన్ని మళ్లీ పునరుద్ధరించాలని 2015లో సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఇక్కడ వైమానిక దాడులు చేపట్టాయి. అప్పటినుంచీ రెండు వర్గాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 1,10,000 మందికిపైనే మరణించారు.
సిరియాలో బస్సుపై మిలిటెంట్ల దాడి, 28 మంది మృతి
తూర్పు సిరియాలోని ఓ బస్సుపై మిలిటెంట్లు చేసిన దాడిలో 28 మంది మరణించారు. మృతులందరూ సైనికులేనని వార్తలు వస్తున్నాయి.
కల్లోలిత దెయిర్ అల్‌జౌర్ ప్రావిన్స్‌లో ఈ దాడి జరిగింది. అయితే, దీనిలో మరణించిన వారంతా పౌరులేనని ప్రభుత్వ మీడియా బుధవారం తెలిపింది.
కానీ, దాడిలో మరణించింది సైనికులేనని పరిశీలక సంస్థలు చెబుతున్నాయి. మరణించిన వారి సంఖ్య 28 కంటే ఎక్కువే ఉండొచ్చని వివరిస్తున్నాయి.
ఈ దాడిని తామే చేపట్టామని ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదు.
అయితే, జిహాదీ సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఈ దాడి చేపట్టిందని, మృతుల సంఖ్య 37 అని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్‌వోహెచ్‌ఆర్) తెలిపింది.
మరోవైపు బస్సు దాడిలో మరణించింది సైనికులేనని రాయిటర్స్ వార్తా సంస్థ కూడా వివరించింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)