You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్ వ్యాక్సీన్ వేసుకున్న వారికి ‘హెచ్ఐవీ’.. తప్పుడు ఫలితాలతో ఆస్ట్రేలియాలో వ్యాక్సీన్ ట్రయల్స్ రద్దు
వ్యాక్సీన్ ట్రయల్స్‌లో పాల్గొన్నవారికి హెచ్ఐవీ లేకపోయినా ఉన్నట్లు తప్పుడు ఫలితాలు రావడంతో ఆస్ట్రేలియాలో ఓ వ్యాక్సీన్ అభివృద్ధి కార్యక్రమాన్ని నిలిపివేశారు.
ఆస్ట్రేలియాకు చెందిన సంస్థ సీఎస్‌ఎల్, క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ(యూక్యూ)లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సీన్ 5.1 కోట్ల డోసులు కొనుగోలు చేయడానికి ఆ దేశం ఒప్పందం చేసుకుంది.
అయితే, ఈ వ్యాక్సీన్ ట్రయల్స్‌లో పాల్గొంటున్నవారికి హెచ్ఐవీ లేనప్పటికీ వారికి జరిపిన టెస్టుల్లో హెచ్ఐవీ ఉన్నట్లు రిపోర్టులు వస్తుండడంతో ట్రయల్స్ నిలిపివేశారు.
దీంతో ఇప్పుడు ఇతర సంస్థలు తయారుచేసే వ్యాక్సీన్లతో ఆ లోటు భర్తీ చేస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.
నోవావాక్స్ వ్యాక్సీన్ కోసం కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంటున్నామని.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ కోసం ఇప్పటికే ఒప్పందం చేసుకున్నామని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పింది.
కాగా హెచ్ఐవీ పాజిటివ్ అంటూ వచ్చిన రిపోర్టులు తప్పుడువని సీఎస్ఎల్, క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీలు నిర్ధరించాయి.
కాబట్టి వ్యాక్సీన్ ట్రయల్స్ వల్ల అందులో పాల్గొనేవారికి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతున్నాయి.
అసలు సీఎస్ఎల్, యూక్యూ వ్యాక్సీన్ విషయంలో ఏం జరిగింది?
నిజానికి ఈ టీకా తొలి దశ ప్రయోగాల్లో యాంటీబాడీల తయారీలో సమర్థంగా పనిచేస్తున్నట్లు రుజువైంది.
అయితే, టీకా తీసుకున్న కొందరిలో ఇది హెచ్ఐవీ యాంటీబాడీలను కూడా తయారు చేసింది.
దీనివల్ల వారిని పరీక్షించినప్పుడు హెచ్ఐవీ ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి.
టీకా ప్రభావం తగ్గిన తరువాత వారికి మళ్లీ హెచ్ఐవీ నెగటివ్ వచ్చింది.
ఈ సమస్యను పరిష్కరించడానికి ఏడాది సమయం పట్టొచ్చని, అప్పటివరకు ట్రయల్స్ ఆపేస్తున్నామని సీఎస్ఎల్, యూక్యూలు వెల్లడించాయి.
‘‘ఈ వ్యాక్సీన్ పనిచేసే అవకాశం ఉంది. కానీ, విశ్వాసానికి పోయి అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోవాలని అనుకోవడం లేదు.
ఈ తప్పుడు హెచ్ఐవీ రిపోర్టులు గందరగోళానికి దారి తీశాయి.’’ అని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి బ్రెండన్ మర్ఫీ అన్నారు.
ఆస్ట్రేలియాపై ఎలాంటి ప్రభావం పడనుంది?
ఆస్ట్రేలియాలో కోవిడ్ సామాజిక వ్యాప్తిని అడ్డుకోగలిగారు.
‘‘ప్రస్తుతం మా దేశం మంచి స్థితిలోనే ఉంది. 2021లో జనాభా అంతటికీ రెండు వ్యాక్సీన్లు వేయాలని అనుకున్నాం.
ఇప్పటికప్పుడు వ్యాక్సీన్‌ను అత్యవసరంగా ఆమోదించాలని మేమేమీ కోరుకోవడం లేదు.
వైరస్‌ను కంట్రోల్ చేయడంతో దేశంలో పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉంది’’ అని మర్ఫీ అన్నారు.
వచ్చే ఏడాది మేం చేపట్టనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్రమంగా సాగుతుందన్న నమ్మకంతో ఉన్నామని మర్ఫీ చెప్పారు.
ఇలాంటి పరిస్థితులు తలెత్తవచ్చన్న ముందుచూపుతోనే వేర్వేరు సంస్థలతో వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నామని.. అందువల్ల తమ సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు ఉండవని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ
- ఫౌజీ గేమ్ పబ్జీని మరిపించగలదా? అక్షయ్ కుమార్ మద్దతిస్తున్న ఈ ఆటలో స్పెషాలిటీ ఏంటి?
- 3 వేల మంది చైనా సంతతి ప్రజలు భారత్‌లో బందీలుగా మారినప్పుడు ఏం జరిగిందంటే..
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)