అమెరికా ఎన్నికలు 2020: ప్రజలను ఇంటివద్దే ఉండమని హెచ్చరిస్తూ అనుమానాస్పద రోబో కాల్స్

ఫొటో సోర్స్, EPA
అమెరికాలో దేశవ్యాప్తంగా అనేకమంది ప్రజలకు రోబో కాల్స్ వచ్చాయి. ఎన్నికల రోజు ఇంట్లోనే ఉండమని విజ్ఞప్తి చేస్తూ వస్తున్న ఈ కాల్స్ ఎక్కడినుంచి వస్తున్నాయి? ఎవరు సృష్టించారు అనే విషయాలను ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది.
లక్షలమంది ప్రజలకు "ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి" అని చెప్తున్న స్వయంచాలక (ఆటోమేటెడ్) ఫోన్ కాల్స్ వస్తున్నట్లు సమాచారం.
ఈ కాల్స్ ఎక్కడనుంచీ వస్తున్నాయన్నది స్పష్టంగా తెలియలేదు. కొన్ని ఫోన్ కాల్స్‌లో ప్రత్యేకంగా ఎన్నికల గురించి ప్రస్తావించట్లేదు.
"ఈ ఫోన్ కాల్స్ వ్యవహారం గందగోళంగా ఉందని" రోబోకిల్లర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జ్యూలియా పోర్టర్, రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. రోబోకిల్లర్ అనుమానాస్పదరీతిలో వచ్చే రోబోకాల్స్‌పై దర్యాప్తు చేసే కంపెనీ.
ఒక ఫోన్ కాల్‌లో "హెలో, ఇదొక టెస్ట్ కాల్. ఇది ఇంట్లోనే ఉండాల్సిన సమయం. సురక్షితంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి" అని తెలిపినట్లు సమాచారం.
ఈ స్పామ్ కాల్స్ గత ఏడాది కాలంగా చక్కర్లు కొడుతున్నాయని, కానీ మంగళవారం నాడు విపరీతంగా వచ్చాయని పోర్టర్ తెలిపారు.
ఎన్నికల బరిలో కీలకమైన మిషిగన్ రాష్ట్రంలో ఈ ఫోన్ కాల్స్ గురించి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
"కచ్చితంగా ఇవి ప్రజలను తప్పుదారి పట్టించడానికే చేస్తున్న కాల్స్" అని మిషిగన్ అటార్నీ జనరల్ డానా నెస్సెల్ తెలిపారు. "వీటిని నమ్మకండి" అంటూ ట్వీట్ చేశారు.
న్యూయార్క్స్‌లోని అధికారులు కూడా ఈ స్పామ్ ఫోన్ కాల్స్ గురించి ఆరా తీస్తున్నారు.
2020 అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డోనల్డ్ ట్రంప్, డెమొక్రాట్ పార్టీ తరపున జో బైడెన్ పోటీ పడుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అధ్యక్షుని ఎన్నికల్లో ఇంత గట్టి పోటీ జరగలేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























