డోనల్డ్ ట్రంప్ నుంచి కరోనావైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం లేదా? -NewsReel

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఇతరులకు కోవిడ్ వ్యాపించే ప్రమాదం ఏదీ లేదని వైట్ హౌస్ డాక్టర్లు చెప్పారు.
ట్రంప్ ఆరోగ్యం గురించి డాక్టర్ షాన్ కాన్లీ ఒక రిపోర్ట్ విడుదల చేశారు. గురువారం తర్వాత ట్రంప్ ఆరోగ్యం గురించి ఆయన సమాచారం ఇవ్వడం ఇదే మొదటిసారి.
ఆస్పత్రిలో మూడు రోజులు ఉండి వచ్చిన ట్రంప్ శనివారం మొదటిసారి వైట్ హౌస్ దగ్గర తనను ఉత్సాహపరుస్తున్న మద్దతుదారుల ముందు ప్రసంగించారు. ట్రంప్ ఆస్పత్రిలో మూడు రోజులే ఉండడంతో ఆయన నుంచి కరోనావైరస్ వ్యాపిస్తుందేమోనని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
కానీ, అధ్యక్షుడికి తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనలో వైరస్ యాక్టివ్‌గా ఉన్నట్టు ఎలాంటి ఆధారాలూ కనిపింలేదని, ఆయన శరీరంలో వైరల్ లోడ్ తగ్గుతోందని డాక్టర్లు తమ రిపోర్టులో చెప్పారు.
అయితే, డోనల్డ్ ట్రంప్‌కు కోవిడ్-19 నెగటివ్ వచ్చిందా, లేదా అనేది మాత్రం వారు ఆ రిపోర్టులో చెప్పలేదు. అధ్యక్షుడు ట్రంప్ శరీరంలో వైరస్ ఇంకా ఎంతుందో తెలుసుకోడానికి పరీక్షలు చేశాం అని డాక్టర్ కాన్లీ తన రిపోర్టులో చెప్పారు.
"అధ్యక్షుడు ట్రంప్ ఐసొలేషన్ సురక్షితంగా నిలిపివేసే ప్రమాణాలను అందుకోవడంతోపాటూ, ఈ ఉదయం వచ్చిన కోవిడ్ పీసీఆర్ శాంపిల్ ప్రస్తుత ప్రమాణాల ప్రకారం ఆయన నుంచి అది ఇతరులకు వ్యాపించే ప్రమాదం లేదని చూపిస్తోందని చెప్పడం నాకు సంతోషంగా ఉంది" ఆయన చెప్పారు.
ఫ్రెంచ్ ఓపెన్ వుమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన19 ఏళ్ల ఈగా స్వైటెక్

ఫొటో సోర్స్, REUTERS/Christian Hartmann
ఫ్రెంచ్ ఓపెన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్లో అమెరికాకు చెందిన సోఫియాను వరుస సెట్లలో ఓడించిన ఈగా స్వైటెక్ టెన్నిస్ తాజా సంచలనంగా మారింది.
19 ఏళ్ల ఈగా స్వైటెక్‌కు ఇది మొదటి గ్రాండ్ శ్లామ్. ఆమె మొత్తం టోర్నీలో ఒక్క సెట్ కూడా ఓడిపోలేదు.
పోలెండ్‌కు చెందిన ఒక టెన్నిస్ క్రీడాకారిణి ఈ టైటిల్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి.
ఈ టైటిల్ గెలిచిన ఈగా గత మూడు దశాబ్గాల్లో దీనిని సొంతం చేసుకున్న అత్యంత పిన్న వయస్కురాలుగా నిలిచారు.
ఈగా కంటే ముందు 1992లో 18 ఏళ్ల మోనికా సెలెస్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచింది.
శనివారం జరిగిన ఫైనల్‌లో ఈగా స్వైటెక్ అమెరికాకు చెందిన సోఫియా కెనిన్‌ను వరుస సెట్లలో ఓడించింది.

ఫొటో సోర్స్, EPA/YOAN VALAT
“నాకు ఎంత సంతోషంగా ఉందంటే, అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. రెండేళ్ల క్రితం నేను వింబుల్డన్ జూనియర్ గ్రాండ్ శ్లామ్ కోసం ఆడాను. ఇప్పుడు ఇక్కడున్నాను. చూస్తుంటే కాలం వేగంగా మారిపోతున్నట్టుంది” అని మ్యాచ్ తర్వాత స్వైటెక్ చెప్పింది.
సోఫియా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేత. ఆమెకు ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో సీడ్ ఇచ్చారు. ఈ టోర్నీలో ఈగా అన్ సీడెడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగినా, అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది. ఫైనల్లో వరుసగా 6-4, 6-1తో సోఫియాను ఓడించింది.
వరల్డ్ ర్యాంకింగ్‌లో ఈగా 54వ స్థానంలో ఉంది. ఇప్పటివరకూ ఈ ర్యాంకులో ఉన్న ఒక క్రీడాకారిణి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలవడం జరగలేదు. దీంతో ఈగా కొత్త రికార్డు సెట్ చేసింది.
ఈగా తండ్రి థామస్ మాజీ ఒలింపిక్ చాంపియన్. ఆయన 1988లో పురుషుల పడవ పందాల్లో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘రిపబ్లిక్ టీవీ డబ్బులు ఇచ్చి టీఆర్పీ పెంచుకుంటోంది’: ముంబయి పోలీసులు
- నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా బీజేపీ, చిరాగ్ పాశ్వాన్ తెర వెనక కథ నడిపిస్తున్నారా?
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- ఈ డ్రెస్సులే లైంగిక వేధింపులకు కారణమా?
- ‘నిర్భయ’లపై మళ్లీ మళ్లీ అత్యాచారం
- పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా అమ్మాయిలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























