NEET, JEE పరీక్షలను వాయిదా వేయాలి -గ్రెటా థన్‌బర్గ్ : BBC Newsreel

ఒక వైపు కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి, మరో వైపు ముంచెత్తుతున్న వరదల మధ్య ప్రజల ుఇబ్బందులు పడుతుంటే, ఈ సమయంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) నిర్వహించడం సరైంది కాదని పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్షలకు కూర్చోవాలనడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నానని ఆమె ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కరోనా లాక్‌డౌన్ సమయంలో పేదలకు సహాయం చేస్తూ వార్తల్లో నిలిచిన నటుడు సోనూ సూద్ కూడా ఈ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి సమయంలో మనం విద్యార్థుల జీవితాలను రిస్క్‌లో పెట్టవద్దని కోరుతూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Reuters
కరోనావైరస్ రీఇన్‌ఫెక్షన్.. హాంకాంగ్‌లో తొలి కేసు
హాంకాంగ్‌లో ఆరోగ్యంగా ఉన్న ఒక 30 ఏళ్ల వ్యక్తిలో నాలుగున్నర నెలల తర్వాత మళ్లీ కరోనావైరస్ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని అక్కడి శాస్త్రవేత్తలు చెప్పారు.
జీనోమ్ సీక్వెన్సింగ్‌లో వైరస్‌లోని రెండు జాతులు పూర్తిగా భిన్నంగా కనిపించాయని, దీనిని ప్రపంచంలోనే మొదటి ధ్రువీకృత రీఇన్ఫెక్షన్ కేసుగా భావించవచ్చని చెప్పారు.
కానీ, ఒక్క రోగి కేసు ఆధారంగా దీనిపై ఒక నిర్ధారణకు రాకపోవడం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
రీఇన్ఫెక్షన్ అరుదుగా ఉండవచ్చని, అది అంత ప్రమాదకరం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 30 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా నుంచి కోలుకున్న వారు తమ శరీరంలో వైరస్‌తో పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా, అది మళ్లీ రాకుండా వారిని కాపాడ్డానికి సాయ పడుతుంది.

ఫొటో సోర్స్, Reuters
‘అధ్యక్ష ఎన్నికలను ప్రత్యర్థులు దొంగిలించవచ్చు’: ట్రంప్ అనుమానాలు
నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రత్యర్థులు ‘దొంగిలించవచ్చు’ అని దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన తోటి రిపబ్లికన్లను హెచ్చరించారు.
“వారు అమెరికన్లను మోసం చేయడానికి కోవిడ్‌ను ఉపయోగిస్తున్నారు” అని నార్త్ కరోలినాలో జరిగిన పార్టీ సభలో ఆయన తమ ప్రతినిధులతో అన్నారు.
ట్రంప్ తన డెమాక్రటిక్ ప్రత్యర్థి జో బిడెన్ కంటే వెనుకబడి ఉన్నట్లు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి.
“ఎన్నికలను దొంగిలించడానికి కోవిడ్‌ను ఉపయోగిస్తున్నార”ని ఆయన ఈ సమావేశంలో చెప్పారు.
“రిగ్గింగ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఎన్నికలను వారు మన చేతుల్లోంచి లాగేసుకోగలరు. మనం గెలవబోతున్నాం” అని ట్రంప్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఫిలిప్పీన్స్‌లో జంట పేలుళ్లు.. 14 మంది మృతి
ఫిలిప్పీన్స్‌లోని దక్షిణ ప్రాంతంలో సోమవారం జరిగిన జంట పేలుళ్లలో 14 మంది చనిపోయారు. మరో 75 మంది గాయపడ్డారు.
సులు ప్రావిన్స్‌లోని జోలో పట్టణంలో గంట వ్యవధిలో రెండు బాంబులు పేలాయని అధికారులు తెలిపారు.
అబు సయ్యాఫ్ బృందానికి చెందిన తీవ్రవాదులు ఈ బాంబు దాడులు చేసినట్లు వారు అనుమానిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
రష్యా ప్రతిపక్ష నేత నావల్నీపై విషప్రయోగం జరిగింది: జర్మనీ ఆస్పత్రి
తీవ్ర అనారోగ్యానికి గురైన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీకి విష ప్రయోగం జరిగినట్లు అనిపిస్తోందని ఆయనకు చికిత్స చేస్తున్న బెర్లిన్ ఆస్పత్రి చెప్పింది.
చారిటే ఆస్పత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో “కోలిన్‌స్టెరీస్ నిరోధకాల గ్రూప్‌కు చెందిన ఒక పదార్థం ద్వారా ఆయనకు మత్తు ఇచ్చినట్లు క్లినికల్ ఆధారాల ద్వారా తెలుస్తోందని” చెప్పింది.
కానీ రష్యాలో నావల్నీకి చికిత్స చేసిన డాక్టర్లు మాత్రం ఆయన శరీరంలో అలాంటి పదార్థం ఏదీ లేదని చెప్పారు.
నావల్నీ రష్యాలో ఒక విమానంలో ప్రయాణిస్తుండగా అనారోగ్యానికి గురయ్యారు.
రష్యా అధ్యక్షుడిని తీవ్రంగా విమర్శించే నావల్నీ సైబీరియాలోని టామ్స్క్ నుంచి మాస్కోకు వెళ్లే విమానంలో ఉన్నట్టు ఒక వీడియోలో కనిపించింది.
టామ్స్క్ విమానాశ్రయంలో ఆయన తాగిన టీలో విషం కలిపి ఉంటారని ఆయన మద్దతుదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
దక్షిణ కొరియాలో దేశమంతా వ్యాపించిన కోవిడ్-19
కరోనా మహమ్మారిపై స్పందనలో ఒక మోడల్‌గా నిలిచిన దక్షిణ కొరియాలో కోవిడ్-19 ఇప్పుడు కొత్తగా దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు.
ఒక మితవాద ప్రెస్బిటేరియన్ చర్చి చుట్టూ కేంద్రీకృతమైన కరోనా కేసులు మొదటిసారి దేశవ్యాప్తంగా 17 ప్రావిన్సులకు వ్యాపించాయి.
దక్షిణ కొరియాలో కొత్త పాజిటివ్ కేసులు ప్రతిరోజూ మూడంకెల్లో నమోదవుతున్నాయి.
దీంతో దేశంలో మళ్లీ సామాజిక దూరం అమలు చేశారు. సియోల్‌లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. స్కూళ్లు, వ్యాపారాలను మళ్లీ మూసివేయడం గురించి ఆలోచిస్తున్నారు.
దేశంలో సమర్థవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టం ఉన్నప్పటికీ కొత్తగా నమోదైన కేసుల్లో 20 శాతం ఎలా వ్యాపించాయో తెలీడం లేదని కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పింది.
సియోల్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని డేగు నగరంలోని ఒక క్రైస్తవ సమూహంలో మహమ్మారి మొదటిసారి బయటపడంతో దక్షిణ కొరియా కోవిడ్-19పై పోరాటం ప్రారంభించింది. కొన్ని వారాల్లోనే వైరస్ వ్యాప్తిని నియంత్రించింది. కానీ ఈసారీ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో నల్లజాతి వ్యక్తిపై కాల్పులు... నిరసనలతో రగులుతున్న విస్కాన్సిన్ స్టేట్
- బెలారుస్ చరిత్రలో అతిపెద్ద ప్రజా నిరసన, తుపాకితో తిరుగుతున్న అధ్యక్షుడు
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























