వైరల్ వీడియో: లైవ్‌లో పన్ను ఊడిపోయినా వార్తలు చదవటం ఆపని యాంకర్

ఫొటో సోర్స్, INSTAGRAM
లైవ్ టీవీకి ఎన్నో రకాల అవరోధాలు ఎదురవుతుంటాయి. సాంకేతిక సమస్యలు, అనుకోని అతిథులు.. అనూహ్యమైన ఇబ్బందులు చాలానే ఉంటాయి.
ఒకసారి లైవ్ (ప్రత్యక్ష ప్రసారం) మొదలయ్యాక రెండో టేక్ అనే మాటే ఉండదు. అది తెలిసీ ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కానీ మరీచ్కా పదాల్కో ఈ వారం వార్తలు చదువుతున్నపుడు అసాధారణ సమస్యను ఎదుర్కొన్నారు. ఆమె ఉక్రెయిన్‌లో ఓ టీవీ చానల్‌లో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నారు.
లైవ్ న్యూస్ చదువుతుండగా ఆమె ముందు పన్ను ఒకటి ఊడిపడిపోయింది.
కానీ.. ఆమె వార్తలు చదవటం ఆపకుండానే ఆ పన్నును చేతితో పట్టుకుని తన పని కొనసాగించారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
''నిజానికి.. ఈ విషయాన్ని ఎవరూ గమనించరని నేను అనుకున్నా'' అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
లైవ్‌లో తన పన్ను ఊడిపోయిన వీడియో కింద ఆమె స్పందిస్తూ.. ''కానీ ప్రేక్షకుల దృష్టిని మేం తక్కువ అంచనా వేశాం'' అని పేర్కొన్నారు.
దాదాపు పదేళ్ల కిందట తన కూతురు ఒక ఇనుప అలారం క్లాక్‌ను ఊపుతున్నపుడు అది తన పంటికి తగిలిందని అప్పుడు పన్నును బాగుచేయించుకోవాల్సి వచ్చిందని మరీచ్కా వివరించారు.
లైవ్‌లో పన్ను ఊడిపోయిన వీడియోను తమ టీవీ చానల్ మొదట యూట్యూబ్‌లో ప్రచురించకపోయినా.. తనకు లభించిన మద్దతు చాలా ఆనందపరిచిందని ఆమె పేర్కొన్నారు.
''ఎటువంటి పరిస్థితుల్లోనైనా చలించవద్దు. మళ్లీ రేపు ఉదయం కలుస్తా'' అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- బ్లాక్ డ్రాగన్: ఈ చేప కళ్లముందే ఉన్నా కనిపించకుండా పోగలదు.. ఎలా సాధ్యం?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- బీటిల్ మోసుకెళ్లే బుల్లి కెమెరా.. కీటకాల సాహసాలు లైవ్ స్ట్రీమింగ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























