INDvsNZ: రెండో టీ20లో న్యూజీలాండ్‌పై భారత్ విజయం

ప్రచురణ

న్యూజీలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. 133 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి ఛేదించింది.

మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

టిమ్ సీఫెర్ట్ 26 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీయగా.. శార్థూల్ ఠాకూర్, బుమ్రా, శివం దూబేలు తలా ఒక వికెట్ తీశారు.

133 పరుగుల విజయ లక్ష్యంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. 6 బంతుల్లో 8 పరుగులు చేసిన ఓపెనర్ రోహిత్ శర్మ సూథీ బౌలింగ్‌లో టేలర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

విరాట్ కోహ్లీ కూడా త్వరగానే పెవీలియన్ బాట పట్టాడు. 12 బంతుల్లో 11 పరుగులు చేసి సూథీ బౌలింగ్‌లో సైఫెర్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తరువాత కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడారు. మూడో వికెట్‌కు ఇద్దరూ కలిసి 86 పరుగులను జోడించారు. విజయానికి 8 పరుగుల దూరంలో శ్రేయస్ ఓటయ్యాడు. సోదీ బౌలింగ్‌లో ఒక బంతికి సిక్స్ కొట్టిన శ్రేయస్, మరో బంతికి కూడా సిక్స్‌కు ప్రయత్నించి సూథీకి క్యాచ్ ఇచ్చి 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.

తరువాత బ్యాటిగ్‌కు దిగిన దూబే ఒక సిక్స్‌తో సహా నాలుగు బంతుల్లో 8 పరుగులు చేసి భారత్‌కు విజయాన్నందించాడు. మొత్తం 17.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి భారత్ లక్ష్యాన్ని పూర్తి చేసింది.

భారత బ్యాటింగ్

రోహిత్ శర్మ - 6 బంతుల్లో 8 పరుగులు ( సూథీ బౌలింగ్‌లో టేలర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు)

కేఎల్ రాహుల్ - 50 బంతుల్లో 57 పరుగులు - నాటౌట్

విరాట్ కోహ్లి - 12 బంతుల్లో 11 పరుగులు - (సూథీ బౌలింగ్‌లో సైఫెర్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు)

శ్రేయస్ అయ్యర్ - 33 బంతుల్లో 44 పరుగులు - (సోదీ బౌలింగ్‌లో సూథీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు)

దూబే - 8 పరుగులు - నాటౌట్

న్యూజిలాండ్ వికెట్ల పతనం:

5.6 ఓవర్లకు తొలి వికెట్ పడింది. ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ 33 పరుగులు చేసి (20 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో) ఠాకూర్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

8.4 ఓవర్లకు రెండో వికెట్ పడింది. మరో ఓపెనర్ మన్రో 26 పరుగులు చేసి (25 బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో) దూబే బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

10.2 ఓవర్లకు మూడో వికెట్ పడింది. గ్రాండ్‌హొమ్మె ఐదు బంతుల్లో 3 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

12.3 ఓవర్లకు నాలుగో వికెట్ పడింది. కేన్ విలియమ్సన్ 20 బంతుల్లో 14 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

19.4 ఓవర్లకు ఐదో వికెట్ పడింది. రాస్ టేలర్ 24 బంతుల్లో 18 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)