You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రపంచ కప్ 2019: బంగ్లాదేశ్ 8 పరుగులు చేయగానే పాక్ సెమీస్ ఆశలు గల్లంతు..
ప్రపంచ కప్ సెమీఫైనల్లో తలపడబోయే నాలుగు జట్లూ ఖరారయ్యాయి.
అభిమానులు ఆశించినట్లు సెమీస్ చేరుకునేందుకు పాక్ ఎలాంటి అద్భుతాలూ చేయలేకపోయింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.
ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ సెంచరీ, బాబర్ అజామ్ 96 పరుగులు చేసినా తర్వాత వచ్చిన వారిలో ఇమాద్ వసీమ్(43) మినహా మిగతా ఎవరూ క్రీజులో నిలదొక్కుకోకపోవడంతో భారీ స్కోరు చేయాలన్న పాక్ ఆశలు ఆవిరయ్యాయి.
పాకిస్తాన్ ఆటగాళ్లు చెలరేగిపోతారని సెమీస్ చేరాలన్న కసితో భారీగా పరుగులు రాబడతారని ఆశించిన ఆ దేశ అభిమానులు స్కోరు 350 కూడా చేరకపోవడంతో డీలా పడ్డారు.
315 పరుగులు చేసిన పాకిస్తాన్ న్యూజీలాండ్ కంటే మెరుగైన రన్‌రేట్ సాధించి సెమీస్‌కు చేరాలంటే బంగ్లాదేశ్‌పై 308 పరుగుల తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది.
అంటే తర్వాత బ్యాటింగ్ చేసే బంగ్లాదేశ్ జట్టును పాకిస్తాన్ 7 పరుగుల లోపే ఆలౌట్ చేయాలి.
316 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 1.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేయగానే పాకిస్తాన్ అధికారికంగా సెమీస్‌కు దూరమైంది.
పాకిస్తాన్ పరువు కోసం మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో పడిపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ 5 వికెట్లు పడగొట్టగా, మహమ్మద్ సైఫుద్దీన్‌కు 3, మెహిదీ హసన్‌కు 1 వికెట్ లభించింది.
పాకిస్తాన్ అధికారికంగా సెమీస్ రేసు నుంచి తప్పుకోవడంతో ముందే ఊహించినట్లు న్యూజీలాండ్ చివరి ప్లేసులో ఫిక్స్ అయిపోయింది.
రేపు భారత్-శ్రీలంక, ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ల ఫలితాల తర్వాత పట్టికలో టాప్‌లో నిలిచేవారితో తలపడేందుకు న్యూజీలాండ్ సిద్ధమవుతోంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు, 500 పరుగులు చేసి, బంగ్లాదేశ్‌ను 50 పరుగుల లోపే ఆలౌట్ చేయడానికి ప్రయత్నిస్తామన్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ కామెంట్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలాయి.
'బీబీసీ న్యూస్ తెలుగు' ఇదే విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన కోరినపుడు చాలా మంది సరదాగా స్పందించారు. మొత్తం 400కు పైగా పోస్టులు పెట్టారు.
కొందరు ఆశ్చర్యపోతున్నట్టు, నవ్వుతున్నట్టు రకరకాల మీమ్‌లు పెట్టగా.. కొందరు ఫన్నీ కామెంట్స్ పోస్ట్ చేశారు.
కొందరు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ సర్ఫరాజ్ ఆవులింతలు గుర్తు చేశారు.
కొందరు పాకిస్తాన్-బంగ్లాదేశ్ స్కోరు కార్డునే ఫొటోషాప్‌లో మార్చి పోస్ట్ చేశారు.
చాలా మంది హాస్యనటులు, కార్టూన్ కారెక్టర్లు నవ్వుతున్నట్లున్న మీమ్‌లు పెట్టారు.
ఇవి కూడా చదవండి:
- సెమీఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరు?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారో చూశారా
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- నాయకుడెవరూ లేకపోయినా.. యాప్స్ ద్వారా భారీ ఉద్యమం ఎలా సాధ్యమైంది?
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి
- క్రికెట్ వరల్డ్ కప్ 2019 : వన్డేల్లో అత్యుత్తమ భారత జట్టు ఇదేనా...
- క్రికెట్ వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ఇంగ్లాండ్‌నే ఎందుకు ఎంచుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)