You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ICYMI: మీరు చదవకపోతే, ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
ఈ వారం భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన 5 కథనాలివి. మీరు ఇవి చదవకపోతే వెంటనే చదివండి.
1. కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంతూరు ఎలా ఉంది?
భారత రాష్ట్రపతిగా ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిచారు.
భారత రాష్ట్రపతి అయిన తొలి ఆదివాసీ మహిళగా ముర్ము చరిత్ర సృష్టించారు. ఆ పదవి చేపడుతున్న రెండో మహిళగా ఆమె నిలిచారు.
ఇంతకీ ఆమె ఎక్కడ చదువుకున్నారు.. ఆమె సొంతూరు ఎలా ఉంది. ఆమె ఇల్లు ఎలా ఉంది?
ఇవి కూడా చదవండి
2. రిషి సునాక్.. బ్రిటన్ ప్రధానమంత్రి అవుతారా?
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి రేసులో రిషి సునాక్ ముందున్నారు.
ఆయన భారత సంతతి వ్యక్తి. అంతేకాదు భారత వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, సుధా మూర్తిల అల్లుడు ఈయన.
బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లో చాన్సెలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ (ఆర్థిక మంత్రి)గా రిషి పనిచేశారు.
అనూహ్య పరిణామాల నడుమ జాన్సన్ రాజీనామా చేయడంతో.. కాన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ రేసులో రిషి నిలబడ్డారు.
ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే.. భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టిస్తారు.
ప్రస్తుతం ప్రధాన మంత్రి పదవి రేసులో రిషి ఎక్కడున్నారు? తర్వాత ఏం జరుగుతుంది? అసలు బ్రిటన్‌లో ప్రధాన మంత్రిని ఎలా ఎన్నుకుంటారు?
ఇవి కూడా చదవండి
3. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు కూడా దివాలా అంచున ఉన్నాయా?
ఊహించని ఆర్థిక సంక్షోభం నడుమ శ్రీలంకను హింసాత్మక నిరసనలు కుదిపేశాయి.
దేశ అధ్యక్షుడు కూడా విదేశాలకు పరారై, తన పదవికి రాజీనామా చేయాల్సిన స్థాయికి పరిస్థితి దిగజారింది.
అయితే, మరికొన్ని దేశాల్లోనూ పరిస్థితి ఇలా దిగజారే ముప్పుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్చరించారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవుల్లో ఏం జరుగుతోందో ఈ కథనంలో తెలుసుకోండి.
ఇవి కూడా చదవండి
4. చేపల వర్షం కురవడం నిజమేనా?
ఇటీవల భారీ వర్షాల సందర్భంగా తెలంగాణలోని జగిత్యాల, కాళేశ్వరం, వైరా(ఖమ్మం)లలో చేపల వాన కురిసినట్లు వార్తలు వచ్చాయి.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి.
నేలపై పాకుతున్న చేపలు ఈ వీడియోల్లో కనిపించాయి.
కొంతమంది స్థానికులు చేపలను కుప్పలుగా పోగేసి బేసిన్లు, బకెట్లలో ఇళ్లకు పట్టుకుపోయిన దృశ్యాలు ఆ వీడియోల్లో ఉన్నాయి.
ఇంతకూ చేపల వాన అనేది నిజమేనా? అలా జరుగుతుందా?
ఇవి కూడా చదవండి
5. ఫ్లయింగ్ సాసర్ల రహస్యం ఏంటి?
అది.. జోర్డాన్ పీలే కొత్త హారర్ ఫిల్మ్ నోప్ ట్రైలర్‌లో కొద్ది క్షణాల పాటే కనిపించింది. అయితే కచ్చితంగా అది దాంట్లో ఉండనే ఉంటుంది. అదే ఫ్లయింగ్ సాసర్. పీలే ఇంతకుముందు తీసిన గెట్ అవుట్, అజ్ సినిమాల్లోని ట్విస్టులు, మలుపులను గమనిస్తే ఆవి నిజమైనవా, నకిలీవా అని నిర్ణయించడం చాలా కష్టం.
అవి నేల నుంచి పైకి ఎగిరాయా, లేదంటే అంతరిక్షం నుంచి కిందికి వచ్చాయా అని చెప్పడం సాధ్యం కాదు. అయితే వాటి నుంచి వచ్చే వెండికాంతి మెరుపులు మాత్రం విభ్రాంతికి గురిచేశాయి.
ఒకప్పుడు అమెరికాను ఊపేసిన ఈ 'ఏలియన్ స్పేష్ షిప్‌లు' ఇప్పుడు ఏమయ్యాయి?
ఇవి కూడా చదవండి
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- గోల్డ్‌ఫిష్: ఈ అందమైన చైనా చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- ఇరీడియం: బంగారం, ప్లాటినం కంటే ఇది ఖరీదైంది.. ఎందుకో తెలుసా..
- ప్రపంచంలోనే అతి పెద్ద చెరువు చేప... దీని బరువు 300 కిలోలు
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- శ్రీలంకలో ‘ఆర్యులు రావటానికి ముందునుంచీ ఉన్న తొట్టతొలి ఆదివాసీ ప్రజల్లో‘ మిగిలిన చిట్టచివరి జనం
- ‘‘భార్య నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలి. భర్త భార్యతో మాత్రమే మిడ్నైట్ పార్టీలకు వెళ్లాలి’’- ఓ పెళ్లిలో వధూవరుల మధ్య అగ్రిమెంట్
- తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆకాశంలో కనిపించిన వింతకు కారణమేంటి?
- గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తే ఏమవుతుంది? స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)