అఫ్గానిస్తాన్: అమ్మాయిలు, మహిళా టీచర్లు లేకుండా ప్రారంభమైన హైస్కూళ్లు - BBC Newsreel

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

అఫ్గానిస్తాన్‌లో సెకండరీ పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ అమ్మాయిలకు మాత్రం ప్రవేశం లేదు.

సెకండరీ పాఠశాలలను తెరుస్తున్నామంటూ తాలిబాన్లు ఇచ్చిన ఆదేశాల్లో అమ్మాయిల ప్రస్తావన లేదు.

అబ్బాయిలు, పురుష టీచర్లు మాత్రమే స్కూళ్లకు రావాలని తాలిబాన్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

13 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు సెకండరీ స్కూళ్లకు హాజరవుతుంటారు.

ఈ ఆదేశాల పట్ల అఫ్గాన్ అమ్మాయిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

"అంతా చీకటిమయంగా కనిపిస్తోంది" అని ఒక అఫ్గాన్ స్కూల్ విద్యార్థిని బీబీసీతో అన్నారు.

షరియా చట్టానికనుగుణంగా స్త్రీల హక్కులను పరిరక్షిస్తామని తాలిబాన్లు అధికారం చేపట్టిన కొత్తలో ప్రకటించారు.

స్కూళ్లలో కో-ఎడ్యుకేషన్‌ను తాలిబాన్లు ఇప్పటికే రద్దు చేశారు. దీంతో అమ్మాయిల పాఠశాలలను సులభంగా మూసివేయడం సాధ్యమవుతుంది.

ఇక్కడ తమ భవిష్యత్తు నిరాశజనకంగా ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంటున్నారు.

"అంతా చీకటిగా కనిపిస్తోంది. నేనింకా ఎందుకు బతికి ఉన్నానని ప్రతీరోజూ అనుకుంటూ ఉంటాను. నేను ఇంట్లోనే ఉండిపోయి, ఎవరో ఒకరు తలుపు కొట్టి వారు పెళ్లి చేసుకోమని అడిగేవరకు ఎదురు చూస్తూ ఉండాలా? ఇదేనా మహిళ జీవిత పరమార్ధం?" అని ఒక స్కూల్ విద్యార్థిని ప్రశ్నించారు. ఆమె న్యాయవాది కావాలని అనుకున్నారు.

"మా అమ్మ చదువుకోలేదు. దాంతో మా నాన్న ఎప్పుడూ ఆమెను అని తిడుతూ ఉండేవారు. నా కూతురుకు అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను" అని ఆ బాలిక తండ్రి బీబీసీతో అన్నారు.

సెకండరీ స్కూల్ నుంచే అమ్మాయిలు చదువుకోవడం ఆపేస్తే, వారికిక పై చదువులు చదివే అవకాశం ఉండదు.

2001లో తాలిబాన్లను అధికారం నుంచి తొలగించిన తర్వాత, అఫ్గానిస్తాన్‌లో ముఖ్యంగా బాలికలు, స్త్రీల అక్షరాస్యత శాతంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది.

ప్రాథమిక విద్యను అభ్యసించే పిల్లల సంఖ్య 0 నుంచి 2. 5 మిలియన్‌కు పెరిగింది. ఒక దశాబ్ద కాలంలోనే బాలికల అక్షరాస్యత శాతం 30 శాతానికి పెరిగింది. ఎక్కువగా నగరాల్లో ఈ మార్పు కనిపించింది.

"తాలిబాన్ల నిర్ణయం అఫ్ఘాన్ మహిళలు, బాలికల విద్యకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది" అని విద్యా శాఖ మాజీ ప్రతినిధి నూరాయ నిఝత్ అన్నారు.

సోనూసూద్‌: 'నటుడి వద్ద లెక్కల్లో చూపని ఆదాయం.. రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టారు' - సీబీడీటీ

నటుడు సోనూసూద్ నివాసం, కార్యాలయాల్లో గత కొద్ది రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే, ఈ ప్రకటనలో సోనూసూద్ పేరును ప్రస్తావించకుండా.. ఒక నటుడు అని మాత్రమే పేర్కొంది.

ఏఎన్ఐ వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం.. ముంబైలోని నటుడి నివాసం, లక్నో కేంద్రంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో పనిచేసే ఒక పారిశ్రామిక సంస్థ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపింది.

ముంబై, లక్నోలతో పాటు కాన్పూర్, జైపూర్, దిల్లీ, గురుగ్రామ్‌ల్లో కూడా ఈ సోదాలు నిర్వహించినట్లు సీబీడీటీ తెలిపింది.

నటుడు, అతని సిబ్బంది ఆదాయపు పన్ను ఎగవేసినట్లు నేరాన్ని నిరూపించగల సాక్ష్యాలు ఈ దాడుల సందర్భంగా లభించాయని వెల్లడించింది.

లెక్కల్లో చూపని తన ఆదాయాన్ని పలు బోగస్ కంపెనీల నుంచి అసురక్షిత మార్గాల్లో అప్పుల రూపంలో తీసుకున్నట్లుగా చిత్రీకరించడమే నటుడి ప్రణాళిక అని పేర్కొంది.

ఇప్పటి వరకూ తమకు అందిన ఆధారాల ప్రకారం రూ.20 కోట్లకు పైగా ఆదాయపు పన్నును ఎగవేసినట్లు తేలిందని సీబీడీటీ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)