జూహీ చావ్లా: 5జీపై పిటిషన్‌ ఉపసంహరించుకున్న జూహీచావ్లా - Newsreel

జుహీ చావ్లా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జుహీ చావ్లా
ప్రచురణ

బాలీవుడ్ నటి జూహీ చావ్లా 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్‌పై దిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ వాపస్ తీసుకున్నారు.

గత నెల ఆమె వేసిన దావాను కోర్టు కొట్టివేసింది.

పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం పిటిషన్‌పై ఎటువంటి విచారణ జరగనందువల్ల తాను వేసిన దావాను కొట్టివేయకుండా, తిరస్కరించవలసిందిగా జూహీ చావ్లా అభ్యర్థించారు.

జూహీ చావ్లా తరపు న్యాయవాదుల వాదన విన్న తరువాత పిటీషన్‌ను ఉపసంహరించుకునేందుకు జడ్జి జయంత్ నాథ్ అనుమతిచ్చారు.

దేశంలో 5జీ నెట్‌వర్క్ ఏర్పాటును వ్యతిరేకంగా జూహీ చావ్లా దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్ లిటిగేషన్) దాఖలు చేశారు. దీన్ని జూన్ 4న కోర్టు కొట్టివేసింది.

పిటిషనర్లు చట్టాన్ని దుర్వినియోగం చేశారని, పబ్లిసిటీ కోసమే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు కనిపిస్తోందని చెప్తూ చావ్లాకు కోర్టు రూ.20 లక్షల జరిమానా విధించింది.

ఈ డబ్బులు చెల్లించడానికి వారం రోజుల గడువు ఇచ్చింది కోర్టు.

ఈ తీర్పు ఆన్‌లైన్ లింకును జూహీ చావ్లా మూడుసార్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)