విశాఖపట్నం: అనకాపల్లిలో కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్లు

విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.
డైట్ కాలేజీ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి పిల్లర్లు కూలి వాహనాలపై పడిపోయాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.

బ్రిడ్జి కింది నుంచి వెళుతున్న ఓ కారు, ఆయిల్ ట్యాంకర్ ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి.
బ్రిడ్జి బీమ్ మీద పడటంతో ఆయిల్ ట్యాంకర్ నుజ్జునుజ్జు అయింది.
అయితే, అది ఖాళీ ట్యాంకర్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.

ఫొటో సోర్స్, ugc
ప్రమాదం సమయంలో బ్రిడ్జి కింది నుంచి వెళ్తున్న కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు.
తమతో కారులో వచ్చిన ఇద్దరు చనిపోయారని ప్రాణాలతో బయటపడిన వాళ్లు చెప్పారు.

హైవే విస్తరణలో భాగంగా అనకాపల్లి బైపాస్ దగ్గర బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
పిల్లర్లు కూలుతున్న సమయంలో పెద్ద శబ్దాలు రావడంతో అక్కడున్న ప్రజలు పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.

ఫొటో సోర్స్, ugc
ఈ ప్రమాదంలో మరో రెండు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి.
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- సినిమాటోగ్రాఫ్ యాక్ట్: కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును సినీ ప్రముఖులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- మోషన్ సిక్నెస్: వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























