ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు: తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు - Newsreel

ఫొటో సోర్స్, CMO Andhra Pradesh/twitter
అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
విద్యా, వైద్య రంగాలతోపాటు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా పలు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మంత్రి వర్గ నిర్ణయాలు:
- తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్
- ఒంగోలు శివార్లలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఏర్పాటు
- జేఎన్టీయూ చట్టం -2008కు సవరణ ద్వారా విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజ్‌కు వర్సిటీ గుర్తింపు
- రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలు
- నవరత్నాల్లో భాగమైన 28లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచారం
- టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఆమోదం, మౌలిక సదుపాయల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణానికి హామీ
- 2021-24 ఐటీ విధానానికి ఆమోదం
- కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ, మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతి.
- రీసర్వే పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూ హక్కు చట్ట సవరణకు ఆమోదం
- విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్‌కు 81 ఎకరాల భూ కేటాయింపులకు ఆమోదం
- పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కింద నీటి సరఫరా. తొలిదశలో ఎత్తిపోతల, గ్రావిటీ ద్వారా సరఫరాకు అంగీకారం
- రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం
- విజయవాడ గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం


ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్టు
కోవిడ్-19తో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ విషయంపై జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పరిహారం ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారో ఆరు వారాల్లోగా తేల్చాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ)కు సూచించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘కోవిడ్‌తో మరణించిన కుటుంబాలకు చట్టబద్ధంగా ఎన్‌డీఎంఏ కనీస పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అలా పరిహారం ఇవ్వని పక్షంలో, తన బాధ్యతలను నిర్వర్తించడంలో సంస్థ విఫలమైనట్టే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
న్యాయవాదులు గౌరవ్ బన్సాల్, రీపక్ బన్సాల్‌లు దాఖలుచేసిన పిటిషన్లపై విచారణ సమయంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
కోవిడ్-19తో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని కోరుతూ గౌరవ్, రీపక్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు: ఒవైసీ పార్టీ ముస్లింల ఓట్లను చీలుస్తుందా? దీంతో బీజేపీకే లాభమా?
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- ‘ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసా... అది నా ప్రాణాలు తీసే బులెట్’
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























