You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ - Newsreel
జూనియర్ డాక్టర్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
వారితో మంత్రి ఆళ్ల నాని, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపారు.
డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీనిచ్చిందని.. సమ్మె విరమిస్తున్నామని జూనియర్ వైద్యులు ప్రకటించారు.
ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 15 శాతం మేర స్టైపండ్ పెంచాలని కోరామని, ప్రభుత్వానికి మరింత ఎక్కువే స్టైఫండ్ పెంచే ఆలోచన ఉందన్నారని చెప్పారు.
సీఎం దృష్టికి తెచ్చి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి హామీ ఇచ్చారని జూనియర్ డాక్టర్లు చెప్పారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రద్దు
తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా రెండో సంవత్సరం పరీక్షలనూ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కరోనా బారినపడే ప్రమాదం ఉందన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉత్తరప్రదేశ్: కాన్పూర్-అలహాబాద్ హైవేపై ఘోర ప్రమాదం, 17 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్-అలహాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 17 మంది చనిపోయారు.
వేగంగా వస్తున్న ఒక బస్సు సచేన్దీ ప్రాంతంలో ఒక టెంపోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని కాన్పూర్ అవుటర్ ఎస్పీ అష్టభుజ్ ప్రసాద్ సింగ్ చెప్పారు.
బస్సు బలంగా ఢీకొట్టడంతో టెంపో రోడ్డుకు అవతలివైపు పడింది, అదుపు తప్పిన బస్సు దొర్లుతూ ఒక గోతిలో పడిందని ఆయన తెలిపారు.
ఈ ఘోర ప్రమాదంలో రెండు వాహనాల్లో ఉన్న దాదాపు అందరూ గాయపడ్డారని. వారిలో చాలామంది ఘటనాస్థలంలోనే చనిపోయారని ఎస్పీ చెప్పారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు రెండు వాహనాల్లో ఇరుక్కుపోయిన వారిని బయటకు లాగారు. ఆస్పత్రులకు తరలించారు.
"చుట్టుపక్కల వారి సాయంతో వాహనాల్లో ఇరుక్కుపోయినవారిని బయటకు తీశాం. చాలా మంది ఘటనాస్థలంలోనే చనిపోయారు" అని దీపూ చౌహాన్ అనే దాభా నిర్వాహకుడు చెప్పారు.
ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే 16 మంది చనిపోగా, మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. నలుగురు చికిత్స పొందుతున్నారు.
గాయపడినవారిలో ఉన్న 15 ఏళ్ల బాలుడికి కరోనా ఉన్నట్లు ధ్రువీకరించారు.
మృతుల్లో ఎక్కువ మంది కార్మికులు
ఒక ప్రైవేటు బస్సు, టెంపోను బలంగా ఢీకొనడంతో ఈప్రమాదం జరిగిందని కాన్పూర్ స్థానిక జర్నలిస్ట్ అంకిత్ శుక్లా చెప్పారు.
మృతుల్లో ఎక్కువ మంది సచేన్దీ దగ్గర్లోని లాల్హేపూర్, ఈశ్వరీగంజ్ గ్రామాల వారని ఆయన తెలిపారు.
"మృతుల్లో ఎక్కువ మంది యువకులు. వీరంతా దగ్గరే ఉన్న ఒక బిస్కెట్ ఫ్యాక్టరీలో నైట్ షిఫ్టులో పనిచేయడానికి వెళ్తున్నారు" అని అంకిత్ చెప్పారు.
ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు, మరో కుటుంబంలోని ఇద్దరు సోదరులు ఉన్నారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదానికి కారణం ఏంటో తక్షణం దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు రెండేసి లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.
ఈ ఘటనలో 16 మంది చనిపోయారని, తీవ్రంగా గాయపడిన ఐదుగురిని లాలా లజపత్‌రాయ్ ఆస్పత్రిలో చేర్పించారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని జీఎస్‌వీఎం కాలేజీ ప్రిన్సిపల్ ఆర్‌బీ కమాల్ పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.
రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి పంపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడినవారికి 50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.
హోం మంత్రి అమిత్ షా కూడా గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చూడండి:
- డైనోసార్ శిలాజాలను కొనడంలో తప్పేముంది?
- ప్రతి నిమిషానికి 4 చెట్ల నరికివేత...గత అయిదేళ్లుగా భారత్లో జరిగిన పర్యావరణ ఘోరమిది
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- ఈ పర్వతాలను ఇక ఎవ్వరూ ఎక్కలేరు!!
- అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!
- 124 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం ఎంత కష్టమో వీరి కళ్లలోకి చూస్తే తెలుస్తుంది
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
- చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)