You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్రెజిల్‌లో మాదక ద్రవ్యాల ముఠా, పోలీసుల మధ్య కాల్పులు.. 25 మందికిపైగా మృతి - Newsreel
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో గురువారం పోలీసులు, మాదక ద్రవ్యాల ముఠా మధ్య జరిగిన కాల్పులలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు.
రియో డి జనరీలోని జకారీ జిన్హో ప్రాంతంలో పోలీసు ఆపరేషన్ సమయంలో ఈ కాల్పులు జరిగాయి.
మాదక ద్రవ్యాల ముఠాలలో చిన్న పిల్లలను చేర్చుకుంటున్నారన్న ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆ ముఠా స్థావరానికి వెళ్లి దాడి చేశారు.
అప్పుడు జరిగిన కాల్పులలో ఇద్దరు మెట్రో రైలు ప్రయాణికులకు బుల్లెట్లు తగిలాయి. అయితే, గాయాలతో బయటపడ్డారు.
పోలీసులు దాడి చేసిన ముఠా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు హత్యలు, కిడ్నాప్‌లు కూడా చేస్తుంది.
రియో డి జనీరలో అత్యధిక ప్రాంతం నేరగాళ్ల అధీనంలోనే ఉంటుంది. ఆ నేరగాళ్లకు మాదక ద్రవ్యాల ముఠాలతో సంబంధాలుంటాయి.
సుప్రీంకోర్టు: 'మీడియాపై ఫిర్యాదులు వద్దు.. కోర్టు విచారణలు రిపోర్ట్ చేయకుండా మీడియాను అడ్డుకోం'
కోర్టులో జరిగే విచారణలను మీడియా రిపోర్ట్ చేయకుండా అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం చేసిన ఒక ఫిర్యాదుపై విచారణ సమయంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
"కోర్టులో జరిగే విచారణలు రిపోర్ట్ చేయకుండా మీడియాను అడ్డుకోడానికి మాకు ఎన్నికల సంఘం పిటిషన్‌లో అంత బలమైన కారణాలేవీ కనిపించలేదు. న్యాయవ్యవస్థ జవాబుదారీతనంతో ఉండాల్సిన అవసరం ఉంది. న్యాయ సంస్థల విచారణను రిపోర్ట్ చేయడం కూడా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పరిధిలోకే వస్తుంది" అని జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా అన్నారు.
నిజానికి, దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు ఎన్నికల అధికారులే కారణమని మద్రాస్ హైకోర్ట్ ఎలాంటి ఆధారాలూ లేకుండానే తమను విమర్శించిందని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మౌఖిక వ్యాఖ్యలు చేయకుండా మీడియాను అడ్డుకోవాలని కోరింది.
గత వారం మద్రాస్ హైకోర్ట్ చేసిన ఒక వ్యాఖ్యపై ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
"ఈసీ అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి" అని ఏప్రిల్ 26న మద్రాస్ హైకోర్ట్ వ్యాఖ్యానించింది.
కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఈసీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడంపై మద్రాసు హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆసుపత్రులకు ఆక్సిజన్ విషయంలో
దిల్లీలోని ఆస్పత్రులకు కేంద్రం ఆక్సిజన్ సరఫరా చేసే అంశంలోనూ సుప్రీంకోర్టులో విచారణలు జరిగాయి.
దిల్లీ ఆస్పత్రులకు ఆక్సిజన్ ఎలా అందిస్తున్నామో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
దిల్లీ, మిగతా రాష్ట్రాల కోసం కేంద్రం ఆక్సిజన్ ఎలా సేకరిస్తున్నామో, ఎలా సరఫరా చేస్త్తున్నామో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు గణాంకాలు సమర్పించారు.
ప్రస్తుతం దిల్లీలోని ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని జస్టిస్ డాక్టర్ ధనంజయ, వై చంద్రచూడ్ ధర్మాసనానికి తుషార్ మెహతా చెప్పారు.
రాజస్థాన్, జమ్ము-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ కూడా తమ ఆస్పత్రి డిమాండుకు తగ్గట్టు మరింత ఆక్సిజన్ కావాలని కోరుతున్నాయని ఎస్జీ చెప్పారు.
మార్కెట్లో కంటైనర్లు సరిగా దొరకడం లేదని, వాటిని కమిటీ ఒక పద్ధతి ప్రకార కేటాయిస్తోందని కేంద్ర ఆక్సిజన్ సరఫరా శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ అధికారి సుమిత్రా దావ్రా చెప్పారు.
ఆక్సిజన్ కోసం ఎలా ప్లాన్ చేసేది, సేకరణ పద్ధతులు, దానిని వివిధ రాష్ట్రాల్లో ఉనన ఆస్పత్రుల అవసరాలకు తగ్గట్టు ఎలా సరఫరా చేస్తున్నామో కేంద్రం వివరంగా ఒక ప్లాన్ సమర్పించింది.
మా సరఫరాలో లోపమో, లేదా వేరే ఏదోనో కచ్చితంగా ఉంది. అక్కడ లోపం, లేదంటే వ్యవస్థ విఫలం కావడమో జరుగుతోంది. మనం ఎవరూ ఆలోచించలేనిది ఏదో జరుగుతోంది అని ఎస్జీ కోర్టుకు చెప్పారు.
మీరు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యను చూడాల్సుంటుంది. ఆక్సిజన్ ఆడిట్ జరగాలి. సరఫరా జరిగిన తర్వాత జవాబుదారీ తనం ఏమిటి అని చంద్రచూడ్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)