Election Results: కేరళ, తమిళనాడు, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి.. ఎక్కడ ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే..

ప్రచురణ

పశ్చిమ బెంగాల్ ఫలితాలు:

పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా అంటే 147 సీట్లు అవసరం.

అయితే కౌంటింగ్ 292 స్థానాలకు మాత్రమే జరుగుతోంది.

ముర్షీదాబాద్‌లోని రెండు స్థానాల్లో అభ్యర్థుల కరోనాతో చనిపోవడంతో అక్కడ పోలింగ్ ఆపివేశారు.

రాష్ట్రంలో తృణమూల్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది.

తమిళనాడు ఫలితాలు:

234 స్థానాలున్న తమిళనాడులో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్‌ మార్కు 118 స్థానాల్లో విజయం సాధించాలి.

రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని అన్నాడీఎంకే కూటమి ధీమాగా ఉంటే, ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు మాత్రం డీఎంకే కూటమిదే ఈసారీ విజయం అంటున్నాయి.

కేరళ ఫలితాలు:

కేరళ అసెంబ్లీలో మొత్తం 140 సీట్లు ఉన్నాయి. అధికారం దక్కాలంటే 71 సీట్లు కావాలి.

ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ఈ జూన్ 1తో ముగుస్తుంది.

కేరళలో ఈసారీ ఎల్‌డీఎఫ్‌ విజయం అని సర్వేలు చెబుతున్నా విపక్ష యూడీఎఫ్‌ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకుంది.

అస్సాం ఫలితాలు:

అస్సాంలో మొత్తం 126 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే సగం కంటే ఎక్కువ అంటే 64 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో బీజేపీ కూటమి ముందంజలో ఉంటుందని వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో ప్రకటించాయి.

పుదుచ్చేరి ఫలితాలు:

పుదుచ్చేరి అసెంబ్లీలో 33 నియోజకవర్గాలు ఉన్నాయి.

వీటిలో మూడు స్థానాలకు ప్రముఖులను నామినేట్ చేస్తారు.

మిగతా 30 స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగాయి.

ఇక్కడ ఎన్‌.రంగస్వామి నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందనేది ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)