కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మృతి

ఎం.సత్యనారాయణరావు

ఫొటో సోర్స్, Twitter/Manickam Tagore .B

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

పీసీసీ మాజీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌గా సుపరిచితులైన ఎం. సత్యనారాయణరావు (87) ఏప్రిల్ 26 అర్ధరాత్రి 2.45 గంటలకు మృతిచెందారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఎమ్మెస్సార్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్యం టాగూర్.బి తన ట్విటర్ హ్యాండిల్లో ఎంఎస్ఆర్ మరణించినట్లు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఎమ్మెస్సార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

తెలంగాణ వాదిగా, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెస్సార్ ప్రత్యేక శైలి కనబరిచారని, రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గుర్తు చేసుకున్నారని,వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారని సీఎంఓ ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఎమ్మెస్సార్ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో జరుగనున్నాయి.

పలు పార్టీల నేతలు, ప్రముఖులు ఆయన మృతి పట్ల సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ లో ఆయన క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడని, ఆయన మరణం కాంగ్రెస్‌కు తీరని లోటు అని అన్నారు.

ఎమ్మెస్సార్ అంత్యక్రియలను అధికారిక లాంచనలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు.

వీడియో క్యాప్షన్, కాంగ్రెస్ సీనియర్ నెత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మృతి

ముక్కుసూటి వ్యక్తిత్వం

ఎమ్మెస్సార్ కరీంనగర్ జిల్లాలోని వెధిర గ్రామంలో 1934 జనవరి 14న జన్మించారు. ఆరుగురు సంతానంలో ఆయన మూడోవారు.

ఎమ్మెస్సార్ మొదటి పేరు చీటి సీతారామారావు. ఆయనను మేనేని హనుంతరావు దంపతులు దత్తత తీసుకున్నారు. దాంతో, ఆయన పేరు మేనేని సత్యనారాయణరావుగా మారింది.

ఎమ్మెస్సార్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

స్వగ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత ఆయన కరీంనగర్‌లో హైస్కూల్‌కు వెళ్లారు. హైదరాబాద్‌లో ఇంటర్ చదివిన ఎమ్మెస్సార్, ఉస్మానియా యూనివర్సిటీలో లా చేశారు.

లా కాలేజీలో ఆయన యూత్ మ్యాగజైన్ ఎడిటర్‌గా పని చేశారు. నాదెండ్ల భాస్కర్‌రావు, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, పాల్వాయి గోవర్ధనరెడ్డితో కలిసి ఉండేవారు.

జవహర్ లాల్ నెహ్రూతో ఎమ్మెస్సార్

ఫొటో సోర్స్, Telangana PCC

ఫొటో క్యాప్షన్, జవహర్ లాల్ నెహ్రూతో ఎమ్మెస్సార్(కుడి వైపు)

లా చదివాక కొన్నేళ్లు లాయర్‌గా ఉన్న ఎమ్మెస్సార్, యూత్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లారు.

ఎమ్మెస్సార్ 1954లో తన రాజకీయ జీవితాన్ని ఉస్మానియాలో ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడుగా ప్రారంభించారు. తరువాత కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు.

1969 నుంచి 1971 వరకూ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎమ్మెస్సార్, ఆ సందర్భంగా జైలుకు వెళ్లారు.

ఆయన 1971లో కరీంనగర్ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1977-1983 మధ్యలో లోక్ సభ ప్యానెల్ స్పీకరుగా కూడా పనిచేశారు.

ఇందిరాగాంధీతో ఎమ్మెస్సార్

ఫొటో సోర్స్, Telangana PCC

ఫొటో క్యాప్షన్, ఇందిరాగాంధీతో ఎమ్మెస్సార్

ఆయన ఇందిరాగాంధీ హయాంలో 1980 నుంచి 1983 వరకూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా కూడా పనిచేసిన ఎమ్మెస్సార్ 1990 నుంచి 1994 వరకూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఎమ్మెస్సార్ రాష్ట్ర దేవాదాయ, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి పదవులు చేపట్టారు.

ఉప్పునూతల పురుషోత్తమరెడ్డితో కలిసి ఆయన 'చివరకు మిగిలేది ఏది' అనే సినిమా కూడా నిర్మించారు. 'సత్యమేవ జయతే' అనే సినిమాలో ఒక పాత్ర కూడా పోషించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)