సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ కోవిడ్‌తో మృతి

ఫొటో సోర్స్, facebook
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి గురువారం ఉదయం మృతి చెందారు.
తన కుమారుడు కోవిడ్‌కు చికిత్స పొందుతూ చనిపోయారని సీతారాం ఏచూరి ట్వీటర్ ద్వారా తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కరోనా నుంచి తన కుమారుడు కోలుకునేలా చివరి వరకు ప్రయత్నించిన డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
జూన్ 9కి ఆశిష్‌కు 35 ఏళ్లు నిండుతాయని పీటీఐ వార్తా సంస్థ చెప్పింది.
ఆశిష్ ఏచూరికి గుర్‌గ్రామ్‌లోని మెదాంతా ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. కానీ, గురువారం ఉదయం 5.30కు ఆయన చనిపోయారని ఆశిష్ కుటుంబ సభ్యులు చెప్పారు.
ఆశిష్ మృతిపై సీపీఎం ఒక ప్రకటన విడుదల చేసింది.
"సీతారాం ఏచూరి - ఇంద్రాణీ మజుందార్‌ల కుమారుడు ఆశిష్ ఏచూరి మరణం మమ్మల్ని విషాదంలో ముంచేసింది. సీతారాం, ఇంద్రాణీ, ఆశిష్ భార్య స్వాతి, ఆయన చెల్లెలు అఖిలకు పోలిట్ బ్యూరో అండగా నిలుస్తుంది" అని అందులో తెలిపింది.
ఆశిష్ ఏచూరి అకాల మరణానికి సీతారాం ఏచూరి, ఆయన కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సీతారాం ఏచూరి కుమారుడి అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఏచూరి కుటుంబానికి మమత సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్వీట్‌లో ఆశిష్ మృతిపై సంతాపం తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"ఈ వార్త చాలా కదిలించింది. తల్లిదండ్రులకు ఇంతకంటే పెద్ద విషాదం ఏముంటుంది. ఈ బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు మీకు ప్రసాదించాలి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)