సోనూ సూద్‌కు కరోనా పాజిటివ్.. మీ సమస్యలు తీర్చడానికి సమయం దొరికిందంటూ ట్వీట్

ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు

ప్రముఖ నటుడు సోనూ సూద్‌కు కరోనా సోకింది.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.

ఇవాళ ఉదయం కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని, హోం క్వారంటైన్‌లో ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

తన గురించి ఆందోళనపడవద్దని అభిమానులను కోరారు.

మీ సమస్యలు తీర్చడానికి నాకు సమయం దొరికింది. మీకు సాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను అని ఆయన ట్వీట్ చేశారు.

మరోవైపు, సాయం కోసం సోనూ సూద్‌కు కుప్పలు తెప్పలుగా విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి.

(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)