You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: తొలి దశలో 79.79 శాతం పోలింగ్ నమోదు
పశ్చిమ బెంగాల్‌లోని 30 అసెంబ్లీ స్థానాల్లో, అస్సాంలోని 47 స్థానాల్లో తొలి దశ పోలింగ్ ముగిసింది.
సాయంత్రం ఆరు గంటల వరకు బెంగాల్‌లో 79.79శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.
ఇక అస్సాంలో 72.14శాతం పోలింగ్ నమోదైంది.
అస్సాంలో తొలి దశలో మాజులీ, గోహపూర్, జోరహాట్, నాజిరా వంటి కీలక స్థానాల్లో పోలింగ్ జరిగింది.
మాజులీ నుంచి అస్సాం ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ పోటీ చేస్తున్నారు. జోరహాట్ నుంచి శాసన సభాపతి హితేంద్ర నాథ్ బరిలో నిలిచారు. రణజీత్ దత్తాజోనాయీ, నాబా కుమార్ తదితర మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలు కూడా తొలి దశ పోలింగ్ జరుపుకుంటున్న నియోజకవర్గాల్లో ఉన్నాయి.
నాజిరా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ విధానమండలి నేత దేవవ్రత్ సైకియా పోటీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ సమాచారం మేరకు తొలి దశలో 264 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 23 మంది మహిళలు.
పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, తొలి దశ పోలింగ్ జరిగిన జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి చోట్ల ఎన్నికల కమిషన్ భద్రత కోసం కేంద్ర భద్రత దళాలను మోహరించింది.
పురూలియాలో 9, బాంకుడాలో 4, ఝాడ్‌గ్రామ్‌లో 4, తూర్పు-పశ్చిమ మెదినాపూర్‌లోని 13 స్థానాల్లో తొలి దశ పోలింగ్ జరిగింది.
ఇవి కూడా చదవండి:
- దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)