మియన్మార్ సైనిక కుట్ర: ఆంగ్ సాన్ సూచీపై మరో అభియోగం -Newsreel

ఫొటో సోర్స్, Reuters
మియన్మార్‌లో సైనిక నిర్బంధంలో ఉన్న ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్ సాన్ సూచీపై మరో క్రిమినల్ అభియోగం నమోదైంది. వీడియో లింక్ ద్వారా ఆమె కోర్టుకు హాజరైన రోజే ఆర్మీ రెండో అభియోగం మోపింది.
ఇంతకుముందు ఆమె అక్రమంగా వాకీ-టాకీ వాడుతున్నారంటూ అభియోగం నమోదవ్వగా, ఇప్పుడు దేశ ప్రకృతి విపత్తు చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆరోపణలు వచ్చాయి.
మంగళవారం నమోదైన తాజా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టంగా తెలియలేదు.
నిరసనలు కొనసాగుతున్నందున దేశంలో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని, అధికారాన్ని వదులుకుంటామని ఇంతకుముందు ఇచ్చిన హామీని మియన్మార్ ఆర్మీ మరోసారి పునరుద్ఘాటించింది.
ఫిబ్రవరి 1న సైనిక తిరుగుబాటు తరువాత ఆంగ్ సాన్ సూచీతో సహా సైనిక నిర్బంధంలో ఉన్న తమ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫైజర్ కోవిడ్ -19 వ్యాక్సీన్ డేటాను ఉత్తర కొరియా హ్యాక్ చేసిందా?
అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ నుంచి కోవిడ్ -19 వ్యాక్సీన్ సాంకేతికతను చోరీ చేసేందుకు ఉత్తర కొరియా ప్రయత్నించిందని దక్షిణ కొరియా నిఘా అధికారులు తెలిపారు.
అయితే, వ్యాక్సీన్ డేటా చోరీ అయ్యిందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియడంలేదు.
ఈ దాడి గురించి దక్షిణ కొరియాకు చెందిన జాతీయ నిఘా సంస్థ ప్రజాప్రతినిధులకు తెలియజేసిందని స్థానిక వార్తా సంస్థ యోన్హాప్ పేర్కొంది.
ఈ విషయంపై సమాచారం కోసం ఫైజర్ సంస్థను బీబీసీ సంప్రదించగా, అటువైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
ఉత్తర కొరియాలో కరోనావైరస్ కేసులు నమోదైనట్టు ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు.
కానీ, ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన వ్యాక్సీన్ కోసం ఉత్తర కొరియా ఆర్డర్ ఇచ్చింది. మరికొన్ని వారాల్లో ఈ దేశానికి 20 లక్షల డోసుల వ్యాక్సీన్ చేరనుంది.

ఫొటో సోర్స్, Reuters
చైనాలో కోవిడ్ వ్యాప్తి ప్రారంభమైన వెంటనే ఉత్తర కొరియా 2020 జనవరిలో తన సరిహద్దులను మూసివేసింది.
ఉత్తర కొరియా, రష్యాలలోని ప్రభుత్వ-మద్దతుగల సంస్థలు ఫైజర్‌తో సహా తొమ్మిది వ్యాక్సీన్ తయారీ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయని 2020 నవంబర్‌లో మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. జింక్, సీరియం పేర్లతో కూడిన ఉత్తర కొరియా గ్రూపులు, ఫ్యాన్సీ బియర్ అనే రష్యా గ్రూపు హ్యాకింగ్‌కు ప్రయత్నిస్తున్నాయని చెప్పింది.
అయితే, ఆ ఆరోపణలను రష్యా అప్పట్లో ఖండించింది.

మధ్యప్రదేశ్: కాలువలో పడిపోయిన బస్సు, 40 మంది మృతి
మధ్యప్రదేశ్‌లో బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 40 మంది మృతి చెందారు.
సిధి జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
బస్సు సిధి నుంచి సాట్నా జిల్లాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
డ్రైవర్‌తో సహా ఏడుగురు ప్రయాణికులు ఈత కొడుతూ ఒడ్డుకు చేరారని అధికారులు తెలిపారు. మిగతా ప్రయాణికుల కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి.
ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఫొటో సోర్స్, ANI
బస్పుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని, అదుపు తప్పిన బస్సు మొదట వంతెన గోడను ఢీకొట్టిందని, తర్వాత కాలువలోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఇద్దరు మంత్రులు ఘటనా స్థలానికి వెళ్తున్నారని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:
- ఆన్లైన్ సెక్స్: స్పర్శ లేని లోటును తీరుస్తుందా?
- మాన్య సింగ్: ఆటో డ్రైవర్ కూతురు మిస్ ఇండియా రన్నరప్ వరకు ఎలా ఎదిగారు?
- ‘‘బూజు పట్టిందని రూ.పది వేల కోట్ల ప్యాలెస్‌ను కూల్చి, మళ్లీ కడుతున్నారు’’
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన ఆరోపణల నుంచి విముక్తి... సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం
- నువ్వలరేవులో పెళ్లి: వధువు వరుడి మెడలో తాళి కట్టడమే కాదు, ఈ ఊరికి ఎన్నో ప్రత్యేకతలు
- కొటియా గ్రామాలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఈ 34 గ్రామాలు ఏ రాష్ట్రానివి? దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతోంది?
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- సెక్స్ సమయంలో శరీరంలో చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























