కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేవరకూ నిర్లక్ష్యం వద్దు: ప్రజలకు ప్రధాని మోదీ సూచన - Newsreel

ఫొటో సోర్స్, ANI
దేశంలో లాక్‌డౌన్ మాత్రమే వెళ్లిపోయిందని, కరోనా వైరస్ ఇంకా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోదీ.. అతి త్వరలోనే భారతదేశంలో వ్యాక్సిన్ వస్తుందని, అంత వరకు వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు.
దేశంలో పండగల సీజన్ మొదలైందని, ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. గడచిన ఏడెనిమిది నెలలుగా ఒక యజ్జంలా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడామని, అది దేశం నుంచి పూర్తిగా పోయే వరకు ఈ పోరాటం కొనసాగాలని ప్రధాని ప్రజలను కోరారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
కొంతమంది మాస్కులు పెట్టుకోకుండా వీధుల్లో తిరుగుతున్నట్లు వీడియోలు, ఫోటోలలో కనిపిస్తోందంటూ.. ''అలా చేయడం మీకు, మీసాటి వారికి కూడా ప్రమాదకరమన్న విషయం గుర్తుపెట్టుకోవాలి'' అని ప్రధాని సూచించారు.
చాలా ప్రపంచ దేశాలలో ఇప్పుడు సెకండ్ వేవ్ నడుస్తోందని.. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలంతా ఆరోగ్య నియమాలను కచ్చితంగా పాటించాలని ఉద్ఘాటించారు.

అవిభక్తలుగా వెళ్లి.. విడివిడిగా తిరిగి వచ్చిన చిన్నారులు
ఏడాదిన్నర కిందట అవిభక్త కవలలుగా లండన్ వెళ్లిన సఫా, మర్వాలు అనే ఇద్దరు చిన్నారులు క్షేమంగా ఇల్లు చేరుకున్నారు.
పాకిస్తాన్‌కు చెందిన ఈ అవిభక్త కవలలకు గత ఏడాది ఫిబ్రవరిలో ఆపరేషన్ జరిగింది. అయితే ఆపరేషన్ అనంతర చికిత్స కోసం వారిని అక్కడే ఉంచాల్సి వచ్చింది.
మూడున్నరేళ్ల వయసున్నఈ చిన్నారులకు లండన్‌లో గ్రేట్ ఓర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ చేశారు. మూడు ప్రధానమైన ఆపరేషన్‌లకు దాదాపు 50గంటల సమయం పట్టింది. చివరకు డాక్టర్లు విజయవంతంగా వారిని విడదీయగలిగారు.
పిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారని, కాకపోతే కాస్త ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సి వస్తోందని ఆ చిన్నారుల తల్లి చెప్పారు. ఏడాదిన్నరకు పైగా కొనసాగిన వీరి చికిత్సలో గ్రేట్ ఓర్మాండ్ స్ట్రీట్ ఆసుపత్రికి చెందిన దాదాపు 100మంది సిబ్బంది సహాయం అందించారు.

ఈ ఆపరేషన్‌కు, తర్వాతి చికిత్సకు దాదాపు 10 లక్షల యూరోలు (రూ. 8.68 కోట్లు) ఖర్చు కాగా పాకిస్తాన్‌కు చెందిన వ్యాపారి ముర్తజా లఖానీ ఈ ఖర్చును భరించారు.
అయితే ఈ చిన్నారులలో ఒకరి ఆరోగ్యం సరిగా లేదని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న డాక్టర్ ఒవాసీ జిలానీ అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన చిన్నారి సఫా జీవితాంతం నడవలేక పోవచ్చని డాక్టర్ జిలానీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- 'మా నాన్నను చంపిన వ్యక్తిని నేను నా గుండెలకు హత్తుకున్నాను'
- ‘కలకత్తా’లో వేశ్యలకు బలవంతంగా జననేంద్రియ పరీక్షలు
- ‘వందల సిజేరియన్లు చేసిన నేనే ఆమె పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాను.. గర్భాశయం పగిలిపోవడంతో అనుమానం వచ్చింది’
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























