You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ అన్‌లాక్-3: జిమ్‌లు, యోగా సెంటర్లకు ఓకే, స్కూళ్లు, థియేటర్లు, బార్లు ఆగస్ట్ తర్వాతే...
భారత హోం మంత్రిత్వ శాఖ అన్‌లాక్ 3 మార్గదర్శకాలు విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం కోవిడ్-19 కంటైన్‌మెంట్ జోన్ బయట చాలా సడలింపులు ఇచ్చారు. కంటైన్‌మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకూ కఠిన లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.
అన్ లాక్ 3.0 ముఖ్యాంశాలు:
భారత్‌లో మొత్తం కరోనాపాజిటివ్ కేసులు 15 లక్షలకు చేరిన సమయంలో మోదీ ప్రభుత్వం అన్‌లాక్-3 మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో ఇప్పటికీ రోజుకు దాదాపు 50 వేలకు దగ్గరగాకేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, అట్ హోం కార్యక్రమాలు అన్నిటినీ సామాజిక దూరం, మిగతా హెల్త్ ప్రొటోకాల్స్ పాటిస్తూ అనుమతిస్తున్నట్లు తెలిపారు.
- లాక్‌డౌన్-3 మార్గదర్శకాలలో నైట్ కర్ఫ్యూను తొలగించారు.
- జిమ్‌లు, యోగా సంస్థలు తెరవాలని నిర్ణయించారు.
- మెట్రో రైళ్లు ఇకమీదట కూడా నడవవు. జనం భారీ సంఖ్యలో ఒకేచోట గుమిగూడడంపై కూడా నిషేధం కొనసాగుతుంది.
- స్కూళ్లు, కాలేజీలు, మిగతా విద్యా సంస్థలు ఆగస్టు తర్వాత తెరవాలని కేంద్రం నిర్ణయించింది.
- సినిమా హాళ్లు, స్విమింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలను ఆగస్టు 31 వరకూ మూసిఉంచనున్నారు.
- అంతర్జాతీయ విమాన సేవలను పరిమిత స్థాయిలో అనుమతించారు.
- రాజకీయ, సామాజిక, స్పోర్ట్స్, వినోద, అకడమిక్, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలపై ఆగస్టు 31 వరకూ నిషేధం కొనసాగుతుంది.
- 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు అత్యవసరమైతే తప్ప, ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- గృహ హింస: ‘లాక్‌డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- ట్విటర్: డోనల్డ్ ట్రంప్ ట్వీట్‌కు ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిక.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)