కరోనావైరస్ వ్యాక్సిన్: ఆగస్టు 15 కల్లా కోవ్యాక్సిన్ విడుదలకు తొందరపాటు వద్దు - ఐసీఎంఆర్‌కు శాస్త్రవేత్తల హెచ్చరిక

ఫొటో సోర్స్, Getty Images
ప్రజలు వినియోగించటం కోసం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను నిర్ణీత గడువులోగా తయారు చేయటం సాధ్యం కాదని భారత శాస్త్రవేత్తల బృందం ఒకటి హెచ్చరించింది.
''బలమైన శాస్త్రీయ ప్రక్రియలు, ప్రమాణాలతో రాజీ పడే పరిస్థితులను కల్పించే తొందరపాటు పరిష్కారం ఏదీ'' మంచిది కాదని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హెచ్చరించింది.
భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ నాటికి కోవిడ్ వ్యాక్సిన్‌ను విడుదల చేయాలన్నది తమ 'అభిమతమ'ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చెప్పింది.
అయితే.. తాము చెప్పిన ఆ తేదీ 'ఒక డెడ్‌లైన్ కాద'ని ఐసీఎంఆర్ ఆ తర్వాత పేర్కొంది.
'కోవాక్సిన్' పేరుతో రూపొందించిన వ్యాక్సిన్‌ను మనుషుల మీద ప్రయోగాత్మకంగా పరీక్షించటానికి ఎంపిక చేసిన 12 సంస్థలకు ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావటంతో ఈ అంశంపై వివాదం మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆగస్టు 15వ తేదీన ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేయటానికి వీలుగా.. మనుషుల మీద ప్రయోగాత్మక పరీక్షలను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన అన్ని రకాల అనుమతులనూ సత్వరం పొందాలని ఆయా సంస్థలకు ఆయన రాసిన లేఖలో నిర్దేశించారు.
ఈ నిర్దేశాలను పాటించకపోతే తీవ్రంగా పరిగణించటం జరుగుతుందని ఆ లేఖ హెచ్చరించింది.
మరోవైపు.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అంతకుముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ‘‘కొవ్యాక్సిన్’ సహా దేశంలో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లలో ఏదన్నా 2021 కంటే ముందు ప్రజా వినియోగానికి అందుబాటులోకి వచ్చే అవకాశం లేద’’ని చెప్తున్న వాక్యాన్ని తొలగించటంతో గందరగోళం తలెత్తింది.
దీంతో తీవ్ర నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఆగస్టు 15 డెడ్‌లైన్ అనేది డ్రామా తప్ప మరేమీ కాదని.. ఇది భారతదేశ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తుందని చాలా మంది విమర్శించారు.
నెల రోజుల్లో ప్రయోగాత్మక పరీక్షలు పూర్తిచేయాలంటూ ఐసీఎంఆర్ అతి తక్కువ గడువు ఇవ్వటం.. అసలు ఎప్పుడూ వినలేదని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పార్థ పి మజుందర్ స్థానిక మీడియాతో పేర్కొన్నారు. ఇలాంటి ఆదేశాలు బయోమెడికల్ పరిశోధనలకు, ఔషధ పరిశ్రమలకు చెడ్డ పేరు తెస్తాయన్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?

ఈ వివాదం ముదరడంతో.. ఆగష్టు 15 అనేది డెడ్‌లైన్ కాదని.. అనవసర అధికారిక జాప్యాన్ని తగ్గించే ప్రయత్నం మాత్రమేనని.. సురక్షితమైన ప్రయోగాత్మక పరీక్షల విషయంలో రాజీపడటానికి ప్రయత్నించలేదని వివరణ ఇచ్చింది.
ఐసీఎంఆర్ మొదట్లో విడుదల చేసిన సమాచారాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారని అజ్ఞాత ఐసీఎంఆర్ అధికారి ఒకరు చెప్పినట్లు మింట్ పత్రిక ఒక కథనంలో ఉటంకించింది.
ఒక వ్యాక్సిన్ తయారు చెయ్యాలంటే దశాబ్దాలు కాకపోయినా కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ, ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు నెలల కాలంలోనే వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తేవాలని ఆశిస్తున్నారు.
సార్స్-కోవ్-2 అని అధికారికంగా పరిగణించే కోవిడ్-19 వ్యాధికి 2021 మధ్య నాటికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. అంటే.. ఈ వైరస్ వ్యాప్తి మొదలైన 12 నుంచి 18 నెలలకు అది అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
అది కూడా సైన్స్ పరంగా ఓ భారీ అద్భుతమే అవుతుంది. తీరా వచ్చిన తర్వాత అది సమర్థంగా పని చేస్తుందనే గ్యారంటీ లేదు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- జపాన్‌లో ఐదు నెలల్లో వేయి లోపే కోవిడ్ మరణాలు... ఏమిటీ రహస్యం?
- చైనా బ్యుబోనిక్ ప్లేగ్: మంగోలియాలో మొదటి కేసు.. అప్రమత్తమైన అధికారులు
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























