నరేంద్రమోదీ: ''పేదలు, మహిళలు, కూలీలకు రూ. 53,000 కోట్లు అందించాం''

ఫొటో సోర్స్, ANI
లాక్‌డౌన్ కాలంలో పేదలు, వలస కార్మికులకు రూ. 53,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు.
అవి కాకుండా.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 74 కోట్ల మంది లబ్ధిదారులకు వారి ఇళ్లకే ఉచిత రేషన్ అందించామని, అదనంగా వలస కూలీలకు కూడా ఉచిత రేషన్ అందిస్తున్నామని తెలిపారు.
ఆర్థిక సాయం ద్వారా మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, కూలీలు అందరికీ లబ్ధి చేకూరిందన్నారు. అలాగే.. లాక్‌డౌన్‌లో ఎనిమిది కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్లు పేదల ఇళ్లకు అందించామని చెప్పారు.
ప్రైవేటు రంగంలోని 50 లక్షల మంది ఉద్యోగులకు 24 శాతం ఈపీఎఫ్ వాటాను - సుమారు రూ. 800 కోట్లు - ప్రభుత్వమే జమచేసిందన్నారు.
''కరోనాకు వ్యతిరేకంగా ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయటం మా అత్యున్నత ప్రాధాన్యాల్లో ఒకటి. ఇందుకోసం ప్రభుత్వం తక్షణ నిర్ణయాలు తీసుకుంది. దేశానికి దీర్ఘ కాలంలో దోహదపడే నిర్ణయాలను మనం తీసుకోవాల్సి ఉంది'' అని మోదీ పేర్కొన్నారు.
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) 125వ వార్షిక సదస్సునుద్దేశించి ప్రధాని 'ఆన్‌లైన్'లో ప్రసంగించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''నేడు ఒకవైపు మన సహ దేశస్తుల ప్రాణాలను కాపాడాల్సి ఉంది. మరోవైపు మన దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సీఐఐ 'గెటింగ్ గ్రోత్ బ్యాక్' (వృద్ధిని పునరుద్ధరించటం) అనే అంశంపై చర్చ మొదలుపెట్టింది. అందుకు భారత పరిశ్రామిక రంగానికి చెందిన వారందరికీ నేను అభినందనలు చెప్తున్నా. అవును, మనం మన అభివృద్ధిని కచ్చితంగా తిరిగి పొందుతామని నేను అంటాను'' అని ఉద్ఘాటించారు.
ఇప్పుడు ప్రభుత్వం ముందుకు సాగుతున్న దిశలో.. మైనింగ్, ఇంధనం, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం - అన్ని రంగాల్లోనూ దేశ యువతకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయని మోదీ పేర్కొన్నారు.
''భారతదేశ అభివృద్ధిని వేగవంతం చేసి, స్వయంసమృద్ధి సాధించటానికి.. ఇంటర్నెట్, ఇన్‌క్లూషన్, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్నొవేషన్ - ఈ ఐదు అంశాలు కీలకం. ఇటీవల మేం తీసుకున్న నిర్ణయాల్లో వీటి గురించి మీకు తెలుస్తుంది. దేశానికి ఇప్పుడు ప్రపంచం కోసం తయారు చేసిన 'మేడిన్ ఇండియా' ఉత్పత్తులు అవసరం'' అని చెప్పారు.
ప్రపంచం ఒక విశ్వసనీయ, ఆధారపడదగ్గ భాగస్వామి కోసం చూస్తోంది. ఆ సామర్థ్యం, బలం, అవకాశం ఇండియాకు ఉంది. ప్రపంచ పంపిణీ గొలుసు (గ్లోబల్ సప్లై చైన్)లో భారత వాటాను బలోపేతం చేసే దృఢమైన స్థానిక పంపిణీ గొలుసును సృష్టించటానికి మనం ఇప్పుడు పెట్టుబడులి'' అని ప్రధాని పేర్కొన్నారు.
కరోనా అనంతర కాలంలోని ఈ ఉద్యమంలో సీఐఐ వంటి పెద్ద సంస్థ కొత్త పాత్ర పోషించటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ''దేశ గమనాన్ని మార్చివేసే వ్యవస్థాగత సంస్కరణలు చేపడతాం. మనమందరం కలిసి స్వయంసమృద్ధ భారత్‌ను నిర్మిస్తాం'' అని ధీమా వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- వలస కూలీలకు సహనం లేదు - కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమర్
- చదరంగం, రాజకీయ చదరంగం రెండూ ఇష్టమే ఆయనకు
- ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని రాసిన లేఖలో ఏముంది
- మోదీ 2.0: ఏడాది పాలనలో కనిపించిన ధోరణులు ఇవీ...
- ప్రధాని మోదీ ఏడాది కిందట కాళ్లు కడిగిన పారిశుద్ధ్య మహిళలు ఈ లాక్‌డౌన్ కాలంలో ఎలా ఉన్నారు
- అమెరికా: ‘అల్లర్లను అణచివేయటానికి సైన్యాన్ని పంపిస్తున్నా’ - ట్రంప్ ప్రకటన
- తెలంగాణ అవతరణ దినోత్సవం: విలీనం నుంచి విభజన దాకా..
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- భారత్‌లో పరిస్థితులు చేయిదాటిపోతాయా? ‘కళ్లకు గంతలు కట్టుకుని’ యుద్ధం చేయగలమా?
- కరోనావైరస్: మాస్కులు ఎక్కువ సేపు ధరిస్తే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందా.. శాఖాహారం తింటే వైరస్‌ను అడ్డుకోవచ్చా
- కరోనావైరస్ సంక్షోభానికి మేధావులు చూపిస్తున్న 7 పరిష్కారాలు 'మిషన్ జైహింద్'
- హైదరాబాద్: నిజాం పాలకుల క్వారంటైన్ హాస్పిటల్... ఇప్పుడు కోరంటి దవాఖానా
- కరోనావైరస్: ఈ మహమ్మారి మగవారినే ఎక్కువగా టార్గెట్ చేసిందా... మహిళల పట్ల పక్షపాతం చూపిస్తోందా
- భారత్‌లో కేసులు పెరుగుతున్నా లాక్‌డౌన్‌ను ఎందుకు సడలిస్తున్నారు
- జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడానికి ముందు ఆఖరి 30 నిమిషాల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























