తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు 20 వేల మంది అధికారులతో మెగా వీడియో కాన్ఫరెన్స్ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, FB/Telangana CMO
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు రాష్ట్రంలోని దాదాపు 20 వేల మంది అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారని నమస్తే తెలంగాణ ఒక వార్తను ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం, పరిపాలనావ్యవస్థకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమస్త అధికార యంత్రాంగంతో ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించడం ఇదే తొలిసారి.
మొత్తం 32 జిల్లా కలెక్టరేట్లతోపాటు మొత్తం 600 కేంద్రాల నుంచి ఒకేసారి అందరు అధికారులు, సిబ్బంది దాదాపు 20 వేలమంది ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనబోతున్నారని ఇందులో రాశారు..
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌నుంచి జరిగే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలను సాగుచేయాల్సిన అవసరం, చేసే విధానంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశంచేస్తారని నమస్తే తెలంగాణ చెప్పింది.
గ్రామీణస్థాయిలో పరిస్థితులపై అధికారులు ఇచ్చే సమాచారం ఆధారంగా సీఎం కేసీఆర్‌తగిన సూచనలు చేస్తారని రాసింది.
సాగునీటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం, మిషన్‌కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత కార్యక్రమాల ద్వారా తెలంగాణ బీడు భూములను సాగులోకి తీసుకొచ్చారు.
రాష్ట్రంలో సాగు చేస్తున్న ఏ భూమిలో ఏ పంట పండించాలన్న దానిపై సీఎం కేసీఆర్‌ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో విస్తృతంగా చర్చిస్తారని నమస్తే తెలంగాణ వివరించింది. .

రైతు భరోసా జమ నేడే
ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్సార్‌రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం ద్వారా అన్నదాతల ఖాతాలకు నగదు జమ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవుతుందని సాక్షి తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో నగదు బదిలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తాడేపల్లిలోని తన క్యాంప్‌కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డినగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పత్రికలో రాశారు.
రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రూ.2800 కోట్లు జమచేస్తారు. సీఎం వైఎస్‌జగన్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులు, అర్హులైన కౌలుదార్లు, సాగుదార్లకు నగదు జమ చేయడం ఇది రెండోసారి.
ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.13,500 చొప్పున వరుసగా రైతులకు రెండో ఏడాది అందిస్తున్నారని పత్రికలో చెప్పారు.
ఈసారి దాదాపు 49,43,590కి పైగా రైతు కుటుంబాలకు తొలివిడతగా నేడు రూ.2,800 కోట్ల మొత్తం వారి ఖాతాల్లో జమ కానుందని తెలిపారు.
కాగా, తొలివిడత కిందే గత నెలలో రూ.2 వేల చొప్పున ప్రభుత్వం రూ. 875 కోట్లు జమ చేసిందని, గత ఏడాది కన్నా ఈసారి లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 2.74 లక్షలు అధికం అని సాక్షి వివరించింది..

ఏపీ సిటీ బస్సుల్లో వరుసకు ఇద్దరే
లాక్ డౌన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మొదలయ్యే ఆర్టీసీ బస్సుల్ల ఇక ఒక వరుసలో ఇద్దరు ప్రయాణికులే కూర్చోవాల్సి ఉంటుందని ఈనాడు కథనం చెప్పింది.
కిటికీలకు రెండు వైపులా ఒక్కొక్కరే కూర్చుంటారు. వారి పక్కన ఉండే సీట్లు ఖాళీగా ఉంచి, ఎవరూ కూచోకుండా మార్కింగ్ చేస్తారని రాసింది.
ఇలా వివిధ బస్సుల్లో మార్పులు చేయాలంటూ అన్ని డిపోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు పంపించారు.
ఒక డిపోలో 30 సూపర్ లగ్జరీ బస్సులు ఉంటే వాటిలో పది బస్సుల్లో మార్పులు చేసి నడపాల్సి ఉంటుంది.
వీటిలో ప్రస్తుతం ఉన్న సీట్లు తొలగించి. కాలం చెల్లిన పాత బస్సుల్లో సీట్లు ఉపయోగించాలని ఆదేశించినట్లు ఈనాడులో చెప్పారు.
ఒక వరుసలో ఒక్కో సీటు చొప్పున మూడు వేర్వేరుగా ఏర్పాటు చేయాలి. పాతవి లేకపోతే ప్రస్తుత బస్సుల్లో కిటికీకి ఆనుకుని ఉండే సీట్లు అలాగే ఉంచి. వాటి పక్కన ఉన్నవి తొలగించాలి.
మధ్యలో ప్రయాణికులు నడిచివెళ్లే మార్గంలో కొత్తగా ఒక సీటు ఏర్పాటు చేయాలి. ఏసీ బస్సుల్లో సగం సీట్లనే ప్రయాణికులకు కేటాయించనున్నారు.
ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగులో మార్పు చేయకపోయినప్పటికీ ప్రయాణికులు కూర్చునే సీట్ల మధ్య ఖాళీ ఉంచుతారని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, getty images
జూన్ 30 వరకు రైళ్ల టికెట్లు రద్దు!
దేశవ్యాప్తంగా జూన్30వరకు బుక్‌చేసుకున్న రెగ్యులర్‌రైళ్ల టికెట్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ చెప్పిందని ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికలూ రాశాయి.
రద్దు చేసిన టికెట్ల సొమ్మును ప్రయాణికులకు పూర్తిగా వాపసు ఇస్తామని రైల్వే చెప్పింది. అంటే జూన్30 వరకు సాధారణ ప్రయాణికుల రైలు సర్వీసులు ప్రారంభం కావన్నమాట.
అయితే వలస కూలీల కోసం నడుపుతున్న శ్రామిక్‌రైళ్లు, 12 నుంచి కొన్ని మార్గాల్లో నడుపుతున్న ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయని రైల్వే ప్రకటించినట్లు కథనంలో రాశారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ మెయిల్/ ఎక్స్‌ప్రెస్‌సహా రెగ్యులర్‌ప్రయాణికుల రైళ్లు, ప్యాసింజర్, సబర్బన్‌సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ గురువారం వెల్లడించింది.
ఏప్రిల్14లోపు బుక్‌చేసుకున్న టికెట్లన్నీ రద్దు చేసినట్లు తెలిపింది.
మార్చి 21 తర్వాత రద్దు చేసిన రైళ్లలో రిజర్వేషన్‌చేసిన వారికి ప్రయాణ తేదీ నుంచి 6 నెలల్లోపు స్టేషన్లలోని కౌంటర్ల వద్ద రిఫండ్‌చేస్తామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్‌చెప్పారని ఆంధ్రజ్యోతిలో తెలిపారు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్‌యాప్‌ద్వారా రిజర్వేషన్‌చేసుకున్న వారికి రిఫండ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందని ఆయన తెలిపారు.
ఈ నెల 12 నుంచి పునరుద్ధరించిన ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం పరిమిత సంఖ్యతో వెయిటింగ్‌లిస్ట్‌టికెట్లను కూడా జారీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిందని కథనంలో వివరించారు.
అయితే ఈ రైళ్లలో రిజర్వేషన్‌ఎగైనెస్ట్‌క్యాన్సిలేషన్(ఆర్‌ఏసీ) కేటగిరీ మాత్రం ఉండదు. 22 నుంచి నడిచే ప్రత్యేక రైళ్లలో ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. వీటికి 15 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌చేసుకోవచ్చని ఆంధ్రజ్యోతి కథనం చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- కరోనా లాక్డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా?
- అమెరికాలో ఓ ఆడపులికి కరోనావైరస్
- కరోనావైరస్: కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం విధించిన చైనా నగరం
- రిహార్సల్స్ చేయిస్తున్న ట్రైయినర్‌ను చంపేసిన సర్కస్ పులులు
- అడవిని కాపాడే ఉద్యోగులకు ఆయుధాలెందుకు లేవు
- ట్రావెల్ ఫొటో పోటీలు 2019: చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు... విజేతలు వీరే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























