అఫ్గానిస్తాన్‌లో మా విమానం కూలడం నిజమే: అమెరికా సైన్యం

ఫొటో సోర్స్, Reuters
అఫ్గానిస్తాన్ తూర్పు ప్రాంతంలో సోమవారం తమ విమానమొకటి కూలిపోయిందని అమెరికా సైన్యం ధ్రువీకరించింది.
విమానం కూలిపోవడానికి కారణాలను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నామని, ప్రత్యర్థుల దాడి వల్లే ఇది కూలిపోయిందనే సూచనలేవీ లేవని సైన్యాధికారి కల్నల్ సోనీ లెగెట్ స్పష్టం చేశారు.
తాలిబన్ల ప్రాబల్యంగా బాగా ఉన్న ఘజనీ రాష్ట్రంలోని దెహ్ యాక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అప్పుడు విమానంలో ఎంత మంది ఉన్నారనేది స్పష్టం కాలేదు.


మరో విమానం కూలిపోయిందన్న తాలిబన్ల వాదనను కల్నల్ లెగెట్ తోసిపుచ్చారు.
అమెరికా వైమానిక దళం ముద్రలున్న కాలిపోయిన విమానం దృశ్యాలతో కూడిన వీడియోను తాలిబన్లు సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఎంత మేరకు నిజమనేది నిర్ధరణ కాలేదు. వీడియోను బట్టి చూస్తే ఈ విమానం బాంబార్డియర్ ఈ-11ఏ విమానం. ఈ తరహా విమానాలను అమెరికా వైమానికదళం అఫ్గానిస్థాన్‌లో ఎలక్ట్రానిక్ నిఘా కోసం ఉపయోగిస్తుంది.
అఫ్గాన్ అధికారులు తొలుత ఇది అఫ్గానిస్తాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'ఏరియానా అఫ్గాన్ ఎయిర్‌లైన్స్' విమానమని చెప్పారు. విమానయాన సంస్థ వెంటనే స్పందించి, ఇది తమ విమానం కాదని, తమ విమానమేదీ కూలిపోలేదని ప్రకటించింది.

అఫ్గానిస్తాన్‌లో హెలికాప్టర్లకు ప్రమాదాల ముప్పు ఎక్కువని, అయితే ఈ తరహా విమానం కూలిపోవడం అరుదేనని బీబీసీ రక్షణ ప్రతినిధి జొనాథన్ మార్కస్ చెప్పారు. ఎక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాలను కూల్చేయగల క్షిపణి వ్యవస్థ తాలిబన్లకు లేదన్నారు.
ఈ-11ఏ విమానాలు అమెరికా వైమానిక దళంలో నాలుగే ఉన్నాయని, ఇప్పుడు కూలిపోయినది వాటిలో ఒకటని ఆయన తెలిపారు.
మార్కస్ విశ్లేషణ ప్రకారం- ఈ విమానాలు ఎక్కువ ఎత్తులో ఎగురుతూ సువిశాల ప్రాంతంపై నిఘా పెడతాయి. ఇందులో చాలా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి.
వైమానిక దళాలు, పదాతి దళాల మధ్య; క్లిష్టమైన భౌగోళిక ప్రాంతంలో వాడే భిన్న రకాల విమానాల మధ్య మెరుగైన సమాచార వినిమయం, ఇతర అవసరాల కోసం ఈ విమానాలను వినియోగిస్తారు. ఈ విమానం ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా లేని గదిలో వైఫై పరిధిని పెంచడానికి ఉపయోగించే పరికరం లాంటిది.
అఫ్గానినిస్తాన్ పర్వత ప్రాంతం ఆధునిక సైనిక కమ్యూనికేషన్లకు చాలా సమస్యాత్మకమైనది. అక్కడ అమెరికా పోరాటంలో ఈ విమానం ముఖ్య పాత్ర పోషించింది.

ఇవి కూడా చదవండి:
- తాలిబన్ల వద్ద బందీలైన ప్రొఫెసర్ల విడుదలకు మిలిటెంట్లను విడిచిపెట్టనున్న అఫ్గానిస్తాన్
- పైలట్లకు ఇంగ్లిష్ రాకపోవడమే విమాన ప్రమాదాలకు కారణమా?
- ప్రపంచవ్యాప్తంగా 737 మాక్స్ 8 విమానాలను నిలిపేసిన బోయింగ్
- సరికొత్త విమానం ఎందుకు కూలిపోయింది?
- బోయింగ్ 737 మాక్స్ 8 విమానం ఏంటి? ఈ విమానాలు ఎందుకు కూలిపోతున్నాయి?
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- మయన్మార్: ముందు చక్రాలు లేకున్నా క్షేమంగా విమాన ల్యాండింగ్
- ట్విన్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్: ఒకేచోట చేరిన 14 వేల కవలలు
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- అమిత్ షా ర్యాలీలో CAA వ్యతిరేక బ్యానర్ పట్టుకున్న అమ్మాయి ఏమన్నారు...
- జేఎన్‌యూలో దాడి నిందితుల్లో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్
- భారత్‌లో ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు అయిదేళ్లలోపే చనిపోతున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























