తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు... హరియాణాలోని అసోటీ వద్ద ప్రమాదం

ప్రచురణ

హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్తోన్న తెలంగాణ ఎక్స్ ప్రెస్ (12723)లో ఈరోజు ఉదయం గం7.43కు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

రైలులోని రెండు బోగీలలో మంటలు చెలరేగాయి. హరియాణాలోని అసోటీ స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు ఉత్తర రైల్వే అధికారులు తెలిపారు.

''ఉదయం గం 7.43కు రెండు బోగీలలో మంటలు చెలరేగాయి. వాటిని రైలు నుంచి వేరు చేశాం'' అని ఉత్తర రైల్వే అధికారి దీపక్ కుమార్ వెల్లడించారు.

తొమ్మిదవ పెట్టె వెనకవైపు చక్రాల నుంచి పొగ, మంటలు రావడంతో అసోటీ- బల్లాబ్ఘర్ స్టేషన్ల మధ్య రైలు ఆపినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి రాకేశ్ బీబీసీకి చెప్పారు.

ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయనీ, ప్రయాణికులెవరికీ ఏ హానీ జరగలేదని తెలిపారు.

ఘటన జరిగిన పెట్టెల్లోని ప్రయాణికులను వేరే పెట్టెల్లోకి మార్చినట్టు చెప్పారు.

ఘటనపై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉందని ఆయన అన్నారు. రెండు కోచ్ లలో సమస్య వచ్చినట్టు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)