తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు... హరియాణాలోని అసోటీ వద్ద ప్రమాదం

ఫొటో సోర్స్, UGC
హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్తోన్న తెలంగాణ ఎక్స్ ప్రెస్ (12723)లో ఈరోజు ఉదయం గం7.43కు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
రైలులోని రెండు బోగీలలో మంటలు చెలరేగాయి. హరియాణాలోని అసోటీ స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు ఉత్తర రైల్వే అధికారులు తెలిపారు.
''ఉదయం గం 7.43కు రెండు బోగీలలో మంటలు చెలరేగాయి. వాటిని రైలు నుంచి వేరు చేశాం'' అని ఉత్తర రైల్వే అధికారి దీపక్ కుమార్ వెల్లడించారు.
తొమ్మిదవ పెట్టె వెనకవైపు చక్రాల నుంచి పొగ, మంటలు రావడంతో అసోటీ- బల్లాబ్ఘర్ స్టేషన్ల మధ్య రైలు ఆపినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి రాకేశ్ బీబీసీకి చెప్పారు.
ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయనీ, ప్రయాణికులెవరికీ ఏ హానీ జరగలేదని తెలిపారు.
ఘటన జరిగిన పెట్టెల్లోని ప్రయాణికులను వేరే పెట్టెల్లోకి మార్చినట్టు చెప్పారు.
ఘటనపై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉందని ఆయన అన్నారు. రెండు కోచ్ లలో సమస్య వచ్చినట్టు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
- భారత 'రూపాయి' విలువ బంగ్లాదేశ్ 'టకా' కంటే తగ్గిందా? - Fact Check
- ‘మా నాన్న ఒక గ్యాంగ్స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- రాజధాని నిర్మాణానికి 2.3 లక్షల కోట్లు... కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన దేశాధ్యక్షుడు
- భారతదేశంలో జన్మించిన పాకిస్తాన్ 'ప్రథమ మహిళ' రానా లియాకత్ అలీ
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో... ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- 1.. 2.. 3.. సంగతి సరే.. అసలు సున్నా ఎలా పుట్టింది? దీన్ని భారతీయులు ఎలా కనిపెట్టారు?
- గుండెజబ్బు నివారణకు నాలుగు ఔషధాలున్న ఒకే మాత్ర
- డార్జీలింగ్ టీ పొడి: కిలో లక్షా 30 వేలు.. ఈ తేయాకును పౌర్ణమి వెలుగులోనే కోస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























