You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముంబయి ఎంటీఎన్ఎల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, చిక్కుకున్న 100 మంది
ముంబయిలోని ఎంటీఎన్ఎల్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 100 మంది భవనం పైభాగంలో చిక్కుకున్నారు.
ఇప్పటి వరకూ 60 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఇంకా 30 నుంచి 35 మంది భవనంలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
సహాయక చర్యల్లో పాల్గొంటున్న అగ్నిమాపక శాఖ ఉద్యోగి ఒకరికి ఊపిరాడక ఇబ్బంది పడటంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
బాంద్రా ప్రాంతంలో ఉన్న టెలీఫోన్ ఎక్స్ఛేంజ్ భవనంలోని నాలుగో అంతస్తులో సోమవారం మధ్నాహ్నం మంటలు చెలరేగాయి. ఇది లెవల్ 4 ప్రమాదమని అధికారులు తెలిపారు.
భవనంలో చిక్కుకున్న ప్రజలను బయటకు పంపిస్తున్నారు.
ఘటనా స్థలికి 14 ఫైర్ ఇంజన్‌లు చేరుకుని, మంటలను అదుపుచేసే పనిలో ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బందికి 3 గంటలు పట్టిందని అధికారులు తెలిపారు.
9 అంతస్తుల ఈ భవనంలోని మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్లలో విద్యుత్ పరికరాలు, వైరింగ్, ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలు ఈ మంటల్లో ఆహుతయ్యాయి.
ఇంతవరకూ ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మధ్యాహ్నం 3.09 గంటలకు తమకు ప్రమాదానికి సంబంధించిన ఫోన్ వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి.
- చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం
- కర్ణాటక సంక్షోభం: క్లైమాక్స్‌కు చేరుకున్న రాజకీయ చదరంగంలో ఎవరి పాత్ర ఏమిటి?
- మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్లిన ఆ అమ్మాయి ఏమైంది.. 36 ఏళ్లుగా వీడని చిక్కుముడి
- మెట్రో స్టేషన్లో మూకదాడి.. 45 మందికి తీవ్ర గాయాలు
- డి.రాజా: 95 ఏళ్ల సీపీఐ చరిత్రలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి దళితుడు
- అంబటి రాయుడు, అతడి '3డీ' ట్వీట్‌పై ఎమ్మెస్కే ప్రసాద్ ఏమన్నారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)