సెమీస్-అర్జెంటీనా vs ఇంగ్లండ్ : ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ నుంచి ఫాక్‌ల్యాండ్స్ యుద్ధం వరకు... రెండు జట్ల మధ్య జరిగిన 5 ఆసక్తికర పోరాటాలు

    • రచయిత, అండీ క్రేయర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ రెండో సెమీ ఫైనల్.. ఇంగ్లండ్ వర్సెస్ అర్జెంటీనా. ఈ పోరు కొన్ని తరాల వరకు గుర్తుండిపోతుంది.

ఈ మ్యాచ్ ప్రాముఖ్యతను వర్ణించడానికి మాటలు సరిపోవు.

లియోనెల్ మెస్సీ తన కెరీర్‌లో తొలిసారి అట్లాంటాలో ఇంగ్లండ్‌తో తలపడనున్నాడు.

ఫిఫా టోర్నీ విజేతగా నిలిచేందుకు ఇంగ్లండ్ 60ఏళ్లుగా ఎదురుచూస్తోంది. దీన్ని అడ్డుకోవాలనేది ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా లక్ష్యం.

ప్రపంచకప్‌లో ఈ రెండు దేశాల జట్లు హోరాహోరీగా పోటీ పడటం1962లో ప్రారంభమైంది.

అప్పటి నుంచి అది అద్భుతమైన గోల్స్, వివాదాలు, రెడ్‌కార్డ్‌లతో నిరంతరం ఫ్యాన్స్‌కు వినోదం పంచుతూ వస్తోంది.

దశాబ్దాల వైరం

ఈ రెండు దేశాల వైరం మైదానానికే పరిమితం కాదు. ముఖ్యంగా 1980ల నాటి ఫాక్‌లాండ్స్ యుద్ధం చుట్టూ అల్లుకున్న రాజకీయ ఉద్రిక్తతలు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను శాసించాయి.

అర్జెంటీనా ఆటగాళ్లు, అభిమానులు ఇప్పటికీ ఫుట్‌బాల్ పాటలలో ఈ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌‌దే పైచేయి అని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ఈ రెండు జట్లు చివరిసారిగా 2002లో జరిగిన ప్రపంచ కప్‌లో తలపడ్డాయి. అందువల్ల రెండు దేశాలలోని యువతలో చాలామందికి ఈ వైరం గుర్తుండకపోవచ్చు.

అందుకే బీబీసీ స్పోర్ట్ ఆరు దశాబ్దాల ఈ క్రీడా వైరుధ్యాలను తిరిగి మీ ముందుకు తీసుకొస్తోంది.

బుధవారం (అమెరికాలో స్థానిక కాలమానం ప్రకారం) జరగబోయే సెమీ ఫైనల్‌తో పోలిస్తే ఈ మ్యాచ్ చాలా ప్రశాంతంగా జరిగింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరంభంలోనే 3-0 ఆధిక్యాన్ని సాధించింది. దానిని అర్జెంటీనా అధిగమించలేకపోయింది. చివరకు ఒక గోల్ చేసింది అర్జెంటీనా.

రెండు జట్లు గ్రూప్ దశను ఒక విజయం, ఒక డ్రా, ఒక ఓటమితో ముగించాయి. అయితే మెరుగైన గోల్ తేడా కారణంగా అర్జెంటీనా కంటే ముందుగా ఇంగ్లండ్‌‌ తదుపరి రౌండ్‌కు చేరుకుంది.

క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రెజిల్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోయింది.

రెండు దేశాల మధ్య ఫుట్‌బాల్ వైరం నిజంగా ముదిరిన క్షణం ఇదేనా?

బహుశా అదే.

ఆ రెండు జట్లు క్వార్టర్-ఫైనల్స్‌లో తలపడ్డాయి. తమకు అన్యాయం జరిగిందని అర్జెంటీనా ఈ రోజూకీ వాదిస్తోంది. ఇంగ్లండ్ ప్లేయర్ జియోఫ్ హర్స్ట్ కొట్టిన గోల్ లైన్ దాటలేదని దాని వల్లే ఇంగ్లండ్ గెలిచిందనేది అర్జెంటీనా వాదన.

అయితే వివాదం అక్కడితో ముగియలేదు. అర్జెంటీనా కెప్టెన్‌ ఆంటోనియో రాటిన్‌కు మ్యాచ్ 33వ నిముషంలో కేవలం మూడు నిమిషాల వ్యవధిలో రెండు తప్పిదాలకు పాల్పడినందుకు రెడ్ కార్డ్ చూపించారు.

మొదటి సంఘటనలో ఇంగ్లండ్ ఆటగాడు బాబీ చార్ల్టన్‌ను కింద పడేశారు. రెండోది జర్మన్ రెఫరీ రుడాల్ఫ్ క్రైట్‌లైన్‌తో తరచూ వాగ్వాదానికి దిగడం.

రాటిన్ మైదానాన్ని విడిచి వెళ్ళడానికి నిరాకరించడంతో మ్యాచ్ సుమారు ఎనిమిది నిమిషాల పాటు నిలిచిపోయింది.

ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకోగా ఇంగ్లండ్ మేనేజర్ ఆల్ఫ్ రామ్సే అర్జెంటీనా జట్టును "యానిమల్స్" అని అభివర్ణించారు.

1966 ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో డిఫెండర్‌గా ఆడిన జార్జ్ కోహెన్ 2009లో 'ది గార్డియన్'కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ మ్యాచ్‌ను గుర్తుచేసుకున్నారు.

"టాకిల్ చేయడం బాగానే ఉంది. అయితే వాళ్లు చర్యలు కొన్ని చాలా నీచంగా ఉన్నాయి. ఉమ్మి వేయడం, మెడ వెనుక జుట్టు లాగడం, చెవులు లాగడం లాంటివి. వాళ్ళు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు. సమస్య ఏమిటంటే తమ ఎత్తుగడలు పనిచేయడం లేదని గ్రహించినప్పుడు, వాళ్లు అంతకు ముందెన్నడూ లేని రీతిలో ప్రవర్తించారు" అని కోహెన్ చెప్పారు.

"వారు ఆడగలిగినంత బాగా ఆడలేదన్నదే చింతించాల్సిన అంశం. మేము ఓడిపోయి ఉండవచ్చు, కానీ వాళ్లు వాళ్ల ఆటఆడి ఉండాల్సింది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లలో రెడ్, ఎల్లో కార్డుల ప్రవేశానికి ఈ మ్యాచ్ మార్గం సుగమం చేసిందనేది ఫ్యాన్స్ అభిప్రాయం. వాటిని తొలిసారి 1970లో మెక్సికోలో జరిగిన ప్రపంచ కప్‌లో ఉపయోగించారు. దీనికి ముందు రిఫరీలు కేవలం మౌఖిక హెచ్చరికలు మాత్రమే జారీ చేసేవారు.

1959 నుంచి 1969 వరకు అర్జెంటీనాకు ప్రాతినిధ్యం వహించి 1962, 1966 ప్రపంచ కప్‌లలో ఆడిన రాటిన్ 89 ఏళ్ల వయసులో 2026 జులై 11న మరణించారు.

'హ్యాండ్ ఆఫ్ గాడ్'.

ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిన ఫాక్‌లాండ్స్ యుద్ధం జరిగిన నాలుగేళ్ల తర్వాత ఈ క్వార్టర్-ఫైనల్ జరిగింది. ఇది కేవలం ఫుట్‌బాల్ పోటీ మాత్రమే కాదు. ఆ సమయంలో రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు కూడా తీవ్రంగా ఉన్నాయి.

అర్జెంటీనా మీడియా, ప్రజలు ఈ మ్యాచ్‌ను యుద్ధంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే మార్గంగా చూశారు. బ్రిటిష్ మీడియా కూడా జాతీయవాద భాషను ఉపయోగించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.

ఆ మ్యాచ్ జరిగినప్పుడు అజ్టెకా స్టేడియంలో ఉన్న బీబీసీ వరల్డ్ సర్వీస్‌కు చెందిన లౌర్డెస్ హెరెడియా ఇలా చెప్పారు.

"ప్రిన్సెస్ అక్కడకు వెళ్లడం మా నాన్నకు అసలు ఇష్టం లేదు. దానివల్ల అర్జెంటీనా, ఇంగ్లండ్ అభిమానుల మధ్య ఉద్రిక్తతలు పెరగొచ్చని ఆయన ఆందోళన చెందారు. కానీ మా అమ్మ ఏమాత్రం సంకోచించలేదు. ఎందుకంటే అది జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అవకాశం"

ఈ మ్యాచ్ ఆ కాలంలోని ఏ ఇంగ్లి‌ష్ ఫుట్‌బాల్ అభిమాని కూడా ఎప్పటికీ మరచిపోలేని క్షణాన్ని అందించింది. డీగో మారడోనా అద్భుతమైన ఆట అర్జెంటీనాకు ఆధిక్యాన్ని ఇచ్చింది.

అది ఆయన పాదాలతో కాదు, ఆయన చేతులతో.

అర్జెంటీనా 10 నెంబర్ జెర్సీ వేసుకున్న మారడోనా, ఇంగ్లండ్ గోల్ కీపర్ పీటర్ షిల్టన్‌తో పాటు గెంతి బంతిని అందుకుని, ఎవరికీ తెలియకుండా ఖాళీగా ఉన్న గోల్‌లోకి దాన్ని నెట్టాడు.

ఆ సమయలో వీడియో అసిస్టెంట్ రిఫరీ ఉంటే బావుండేది!

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ చరిత్రలోనే బహుశా అత్యంత అద్భుతమైన గోల్‌ను మారడోనా జట్టు సాధించిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఆయన ఇంగ్లండ్ జట్టులో సగం మందిని డ్రిబ్లింగ్ చేసుకుంటూ దాటి షిల్టన్‌ను అధిగమించి బంతిని నెట్‌లోకి పంపి అర్జెంటీనా ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు.

"నేను అర్జెంటీనాలో నివసించేటప్పుడు ప్రజలు తరచుగా 'హ్యాండ్ ఆఫ్ గాడ్' గురించి మాట్లాడేవారు. మొదటి గోల్ గురించి మాట్లాడటం అంటే రెండో గోల్ ఎంత అద్భుతమైనదో మర్చిపోవడమే. అసలు అది నమ్మశక్యం కానిది" అని హెరెడియా అన్నారు.

ఇంగ్లండ్ స్టార్ గ్యారీ లినెకర్ చివరికి ఒక గోల్ చేసినప్పటికీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. వివాదాస్పద పరిస్థితులలో ఇంగ్లండ్ ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది.

మారడోనా 2005లో క్షమాపణ చెప్పారు. కానీ షిల్టన్ ఆయన క్షమాపణను అంగీకరించేందుకు నిరాకరించారు.

ఇంగ్లండ్‌ను ఓడించడంతో పాటు ఫైనల్‌లో పశ్చిమ జర్మనీని ఓడించి అర్జెంటీనా ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

డేవిడ్ బెక్‌హామ్ ఎప్పటికీ మర్చిపోలేని మ్యాచ్ ఇది.

అర్జెంటీనా ఆటగాడు డియాగో సిమియోన్‌ను బెక్‌హామ్ తన్నడంతో ఆయనకు రెడ్‌కార్డు వచ్చింది. అందుకే ఈ మ్యాచ్ బెక్‌హామ్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

అంతకుముందు గాబ్రియేల్ బాటిస్టుటా, అలాన్ షియరర్ పెనాల్టీల ద్వారా గోల్స్ సాధించారు.

ఆ తర్వాత మైఖేల్ ఓవెన్ ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన గోల్స్‌లో ఒకటి సాధించి ఇంగ్లండ్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించాడు.

అర్జెంటీనా రక్షణ వలయాన్ని ఛేదించుకుని ఓవెన్ అద్భుతమైన వ్యక్తిగత గోల్ సాధించాడు. కానీ విరామానికి కొద్దిసేపటి ముందు, జావియర్ జానెట్టి చాకచక్యంగా ఫ్రీ-కిక్‌తో స్కోరును సమం చేశాడు.

బెక్‌హామ్‌కు రెడ్‌కార్డ్ వచ్చిన తర్వాత కూడా ఇంగ్లండ్ ధైర్యంగా మ్యాచ్‌ను కొనసాగించింది. 81వ నిమిషంలో సోల్ క్యాంప్‌బెల్ హెడర్‌ షాట్‌ను పుష్ చేశారని తిరస్కరించారు. అయినప్పటికీ తాము గెలిచినట్లేనని ఇంగ్లండ్ ఆటగాళ్లు భావించారు.

మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. డేవిడ్ బాటీ, పాల్ ఇన్స్ తమ పెనాల్టీల కిక్‌లలో ఫెయిల్ కావడంతో అర్జెంటీనా గెలిచింది. అయితే, వారు తదుపరి రౌండ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయారు.

ఈ వైరానికి మరింత ఆజ్యం పోస్తూ, ఒక సంవత్సరం తర్వాత సిమియోన్ "రిఫరీలు మా ఉచ్చులో పడ్డారని నేను చెబుతాను" అని అన్నారు.

ఈ మ్యాచ్ బెక్‌హామ్ పునరాగమనంగా గుర్తుండిపోతుంది.

ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బెక్‌హామ్, అర్జెంటీనా ఆటగాడు మౌరిసియో పొచెట్టినో చేతిలో మైఖేల్ ఓవెన్ కిందపడటంతో లభించిన పెనాల్టీ కిక్ ద్వారా మ్యాచ్‌లో ఏకైక గోల్ సాధించాడు.

గ్రూప్ దశలోని మొదటి మ్యాచ్‌లో స్వీడన్‌తో డ్రా చేసుకున్న తర్వాత ఇంగ్లండ్‌కు ఈ విజయం కీలకంగా నిలిచింది.

తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో నైజీరియాతో గోల్ రహిత డ్రాతో ఇంగ్లండ్ తదుపరి రౌండ్‌కు చేరుకుంది.

స్వీడన్‌తో 1–1 గోల్స్‌తో డ్రా చేసుకున్న అర్జెంటీనా 1962 తర్వాత తొలిసారి నాకౌట్ దశకు ముందే నిష్క్రమించింది.

ఇంగ్లండ్ డెన్మార్క్‌ను ఓడించింది, కానీ క్వార్టర్-ఫైనల్స్‌లో బ్రెజిల్ చేతిలో రొనాల్డిన్హో కొట్టిన వీరోచిత ఫ్రీ-కిక్ గోల్ కారణంగా నిష్క్రమించింది.

"జపాన్‌లో జరిగిన 2002 ప్రపంచ కప్ సమయంలో బెక్‌హామ్, ఇంగ్లండ్ జట్టు పుంజుకోవడానికిి సప్పోరో డోమ్ సాక్ష్యంగా నిలిచింది" అని బీబీసీ స్పోర్ట్ కరస్పాండెంట్ ఫిల్ మెక్‌నల్టీ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)