లవ్లీనా బోర్గోహైన్‌కు స్వర్ణం.. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్వర్ణం
ప్రపంచ సీనియర్ మహిళల చాంపియన్‌షిప్‌లో బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు. 75 కేజీల విభాగంలో లవ్లీనా వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు.
లైవ్ కవరేజీ
అమెరికా: జర్నలిస్టు మీద ఖలిస్తాన్ మద్దతుదార్ల ‘దాడి’
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో భారత ఎంబసీ వద్ద లలిత్ కే ఝా అనే జర్నలిస్టును ఖలిస్తాన్ మద్దతుదార్లు దూషించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
లలిత్ మీద భౌతిక దాడికి దిగినట్లుగా కూడా పేర్కొంది.
ఈ ఘటనను భారత ఎంబసీ ఖండించింది.
‘‘సీనియర్ జర్నలిస్టు మీద దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. ‘‘ఖలీస్తాన్’’ అని చెప్పుకునేవారి హింసాత్మక, అసాంఘిక ప్రవృత్తిని అవి తెలియజేస్తున్నాయి’’ అని ఎంబసీ ప్రకటనలో పేర్కొంది.
లలిత్ కే ఝా పోస్ట్ చేసిన వీడియోలో ఖలిస్తాన్ జెండాలు పట్టుకుని ఉన్నవారు దూషిస్తూ కనిపించారు. భారతదేశంలోని ప్రభుత్వాన్ని ‘ఫాసిస్ట్’గా వారు అభివర్ణించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇస్రో: 36 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన ‘బాహుబలి’ రాకెట్

ఫొటో సోర్స్, DD National
వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను తీసుకొని ఇస్రోకి చెందిన ఎల్‌వీఎం3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ఆంధ్రప్రదేశ్‌లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9 గంటలకు రాకెట్‌ను లాంచ్ చేశారు.
మొత్తం 72 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో వన్‌వెబ్ ఒప్పందం కుదుర్చుకుంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.