మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు మరో స్వర్ణం - స్వీటీ బూరాకు గోల్డ్ మెడల్
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం 81 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో స్వీటీ బూరా గెలుపొంది పసిడి కలను నెరవేర్చుకున్నారు. హరియాణాకు చెందిన 30 ఏళ్ల స్వీటీ ఫైనల్‌లో చైనాకు చెందిన లీనా వాంగ్‌పై గెలుపొంది స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు.
లైవ్ కవరేజీ
అమెరికా: జర్నలిస్టు మీద ఖలిస్తాన్ మద్దతుదార్ల ‘దాడి’
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో భారత ఎంబసీ వద్ద లలిత్ కే ఝా అనే జర్నలిస్టును ఖలిస్తాన్ మద్దతుదార్లు దూషించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
లలిత్ మీద భౌతిక దాడికి దిగినట్లుగా కూడా పేర్కొంది.
ఈ ఘటనను భారత ఎంబసీ ఖండించింది.
‘‘సీనియర్ జర్నలిస్టు మీద దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. ‘‘ఖలీస్తాన్’’ అని చెప్పుకునేవారి హింసాత్మక, అసాంఘిక ప్రవృత్తిని అవి తెలియజేస్తున్నాయి’’ అని ఎంబసీ ప్రకటనలో పేర్కొంది.
లలిత్ కే ఝా పోస్ట్ చేసిన వీడియోలో ఖలిస్తాన్ జెండాలు పట్టుకుని ఉన్నవారు దూషిస్తూ కనిపించారు. భారతదేశంలోని ప్రభుత్వాన్ని ‘ఫాసిస్ట్’గా వారు అభివర్ణించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇస్రో: 36 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన ‘బాహుబలి’ రాకెట్

ఫొటో సోర్స్, DD National
వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను తీసుకొని ఇస్రోకి చెందిన ఎల్‌వీఎం3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ఆంధ్రప్రదేశ్‌లోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9 గంటలకు రాకెట్‌ను లాంచ్ చేశారు.
మొత్తం 72 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో వన్‌వెబ్ ఒప్పందం కుదుర్చుకుంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
లవ్లీనా బోర్గోహైన్‌కు స్వర్ణం.. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్వర్ణం
‘రామ్‌జీ నగర్ గ్యాంగ్’: లాయర్లను పెట్టుకుని మరీ దొంగతనాలు చేసే ముఠా కథ
రాహుల్ గాంధీ: రాజకీయ చదరంగంలో పోరాడుతున్న అయిదో తరం ‘యోధుడు’
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు తాజా వార్తలతో మళ్లీ కలుసుకుందాం.
బ్రేకింగ్ న్యూస్, స్వీటీ బూరాకు గోల్డ్ మెడల్: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 81 కేజీల విభాగంలో స్వర్ణం

ఫొటో సోర్స్, bfi
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో స్వర్ణ పతకం సాధించింది.
స్వీటీ బూరా రెండోసారి వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పతకం సాధించారు.
ఇంతకుముందు రజతం గెలుచుకున్న ఆమె తాజా పోటీలలో స్వర్ణం సాధించారు.
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం 81 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో స్వీటీ బూరా గెలుపొంది పసిడి కలను నెరవేర్చుకున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుపొందిన స్వీటీ బూరా ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగారు.
హరియాణాకు చెందిన 30 ఏళ్ల స్వీటీ ఫైనల్ మ్యచ్‌లో చైనాకు చెందిన లీనా వాంగ్‌పై గెలుపొంది స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు.
81 కేజీల విభాగంలో వరల్డ్ చాంపియన్‌గా అవతరించారు.

ఫొటో సోర్స్, instagram/saweetyboora
వర్షం వస్తే బస్సు కూడా రాని ఊరు నుంచి వరల్డ్ చాంపియన్‌గా
ISWOTY: నీతూ ఘంఘాస్‌కు ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం.. 48 కేజీల విభాగంలో మంగోలియన్ బాక్సర్‌పై విజయం

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ నీతూ ఘంఘాస్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
48 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో భారత్‌కు చెందిన నీతూ 5-0తో లుత్సయ్‌ఖాన్ (మంగోలియా)పై 5-0 తేడాతో విజయాన్ని అందుకున్నారు.
సీనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరిన 22 ఏళ్ల నీతూ, తొలి ప్రయత్నంలోనే చాంపియన్‌గా అవతరించారు.
హరియాణాకు చెందిన నీతూ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గారు.
2017, 2018 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లలోనూ విజేతగా నిలిచి స్వర్ణాలను సొంతం చేసుకున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హైదరాబాద్‌లో సైనైడ్ తీసుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాదులోని కుషాయిగూడ పరిధిలోని కందిగూడ వద్ద ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
సైనైడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుషాయిగూడ పోలీసులు చెప్పారు.
కందిగూడలోని క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న గాదే సతీష్(39), గాదే వేద(35), గాదే నిషికేత్(9), గాదే నిహాల్(5) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా పిల్లలు అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతుండడంతో చూసి తట్టుకోలేక పిల్లలు సహా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.
దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్: స్వర్ణ పతకం కోసం పోరాడుతున్న ఈ నలుగురు భారత బాక్సర్ల కథేంటి?
డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయినట్లు నకిలీ ఫోటోలు, ఇవి ఏఐ జనరేటెడ్ చిత్రాలని గుర్తించడమెలా?
మహిళలకు సౌకర్యంగా ఉండే స్పేస్ సూట్, అసలు వ్యోమగాములు అంతరిక్షంలో ఏం తింటారు
అమెరికా: 'కుల వివక్ష'పై కాలిఫోర్నియా సెనేట్‌లో బిల్లు
రాహుల్ గాంధీ: ‘‘అదానీ మీద మళ్లీ నేను ఏం మాట్లాడతానోనని మోదీ భయపడ్డారు’’
రాహుల్ గాంధీ అనర్హత: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన నేపథ్యంలో దేశవవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగారు.
కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. వాయనాడ్ నుంచే లోక్‌సభకు ఎంపీగా రాహుల్ గాంధీ గెలిచారు.
దిల్లీ-చంఢీగర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను చంఢీగర్ రైల్వేస్టేషన్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిలిపివేశారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగంణలో నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పగలు క్లర్క్... రాత్రి ఆటో డ్రైవర్... ఆదివారం బట్టల వ్యాపారి... ఒక వ్యక్తి మూడు పనులు
ప్రజాప్రతినిధుల చట్టం మీద సుప్రీం కోర్టులో పిటిషన్

ఫొటో సోర్స్, ANI
కేసుల్లో దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులు ఆటోమేటిక్‌గా అసెంబ్లీ లేదా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోవడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ బద్ధతను ఆ పిటిషన్ ప్రశ్నించింది. రాజ్యాంగ నియమాలకు సెక్షన్ 8(3)ను విరుద్ధమని ప్రకటించాల్సిందిగా కోర్టును పిటిషనర్ కోరారు.
సూరత్‌లోని కోర్టు రాహుల్ గాంధీని ఒక కేసులో దోషిగా తేల్చడంతో ప్రజాప్రతినిధుల చట్టం సెక్షన్ 8(3) కింద ఆయన లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇంటెల్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకుడు గోర్డాన్ మూర్ మరణం

ఫొటో సోర్స్, Intel
ఇంటెల్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకుడు గోర్డాన్ మూర్ మరణించారు.
94ఏళ్ల మూర్ హవాయిలోని తన ఇంట్లో శుక్రవారం ప్రశాంతంగా కనుమూసినట్లు ఇంటెల్ సంస్థ ప్రకటించింది.
50లలో సెమీకండక్టర్ల మీద పని చేయడం ప్రారంభించారు మూర్. 1968లో రాబర్ట్ నాయిస్‌తో కలిసి ఇంటెల్ సంస్థను స్థాపించారు.
ప్రతి సంవతర్సం కంప్యూటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యం రెట్టింపు అవుతుందంటూ ఆయన చెప్పిన సిద్ధాంతం ‘‘మూర్స్ లా’’గా పేరుగాంచింది.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి వాళ్లు మూర్ మరణానికి విచారం వ్యక్తం చేశారు.