పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఏపీపీ వార్తా సంస్థ చెప్పిన దాని ప్రకారం ఇమ్రాన్ ఖాన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు గురువారం తిరస్కరించింది.
గతేడాది ఇస్లామాబాద్‌లోని సంగజానీ పోలీస్ స్టేషన్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారంటూ ఆయా సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉగ్రవాద నిరోధక కోర్టు తిరస్కరించడంతో లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇమ్రాన్‌ఖాన్ న్యాయవ్యవస్థను అపహస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని పాకిస్తాన్ హోంమంత్రి రాణా సనావుల్లా ఖాన్ విమర్శించారు.
ఇమ్రాన్‌ఖాన్‌ను తక్షణమే అరెస్టు చేయాల్సిందిగా కోరతానని కూడా ఆయన అన్నారు.