మార్చిలో సిద్ధం కానున్న భారత మొదటి 22 స్మార్ట్ నగరాలు
కొన్ని సంవత్సరాలుగా చర్చల్లో నిలిచిన స్మార్ట్ సిటీ పథకం ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంది.
భారత్‌లోని మొదటి 22 స్మార్ట్ నగరాలు వచ్చే నెలలో అంటే మార్చిలో సిద్ధం కానున్నాయని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
మొత్తం 7,804 ప్రాజెక్టుల్లో 5246 ప్రాజెక్టులు పూర్తయ్యాయని ఫిబ్రవరి 6న పార్లమెంట్‌లో ప్రభుత్వం వెల్లడించింది.
ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి దాదాపు 98 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రకటించింది.
స్మార్ట్ నగరాల జాబితా: భోపాల్, ఇండోర్, ఆగ్రా, వారణాసి, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్, రాంచీ, సాలెమ్, సూరత్, ఉదయ్‌పూర్, విశాఖపట్నం, అహ్మదాబాద్, కాకినాడ, పుణే, వెల్లూర్, పీంపరీ, మధురై, అమరావతి, తిరుచిరాపల్లి, తంజావూరు.
2015లో కేంద్ర ప్రభుత్వం, ‘స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్’ను ప్రవేశపెట్టింది. స్మార్ట్ సిటీ అనే పదానికి ఎలాంటి నిర్దిష్ట నిర్వచనం లేదని పేర్కొంది. కానీ, ఎంపిక చేసిన 100 నగరాల్లోని ప్రజలు జీవనాన్ని మెరుగుపరిచేందుకు నిధులు అందజేస్తామని హామీ ఇచ్చింది.