You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఫిబ్రవరి 14: ‘కౌ హగ్గింగ్ డే’ పిలుపును ఉపసంహరించుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్

ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీని ‘గోవు ఆలింగన దినం’గా జరుపుకోవాలంటూ ఇచ్చిన పిలుపును ఉపసంహరిస్తున్నట్లు యానిమల్ వెల్‌ఫోర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. తుర్కియే భూకంపం: శిథిలాల కిందనున్న వాలీబాల్ టీమ్ కోసం వెతుకులాట

    సోమవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపాల ధాటికి కుప్పకూలిన హోటల్ కింద చిక్కుకున్న వాలీబాల్ జుట్టులకు చెందిన మూడు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశాయి.

    అదియమాన్‌లోని ఇసియాస్ హోటల్ శిథిలాల కింద నుంచి ఇద్దరు టీచర్లు, ఒక విద్యార్థి మృతదేహాన్ని వెలికితీసినట్టు తుర్కియే నియంత్రిత నార్తరన్ సైప్రస్ అధికారులు చెప్పారు.

    ఈ హోటల్ భవంతి కుప్పకూలిన సమయంలో బాలురు, బాలికల టీమ్‌లతో కలిపి మొత్తంగా 39 మంది సభ్యుల బృందం ఉందని చెప్పారు.

    ఈ భవంతి పరిసరాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఆటగాళ్ల కోసం వెతుకుతున్నారు.

    దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాలో వచ్చిన భూకంపాలతో వేలాది మంది మరణించారు.

    ఫమగుస్తా తుర్కిష్ మారిఫ్ కాలేజీ నుంచి అదియమాన్‌కు ఈ ఆటగాళ్లు వెళ్లారు.

  3. భూకంపంలో శిథిలాల కింద చిక్కుకుంటే.. ప్రాణాలను కాపాడుకోవటం ఎలా

  4. బాల్య వివాహాల పేరుతో వందలాది మంది భర్తల అరెస్ట్.. రోడ్డున పడుతున్న భార్యాపిల్లలు

  5. రిషభ్ పంత్: ఆసుపత్రి నుంచి కోలుకుంటోన్న ఫోటోలను షేర్ చేసిన క్రికెటర్

    భారత క్రికెటర్ రిషభ్ పంత్ తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుపుతూ ఆసుపత్రి నుంచి రెండు ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశారు.

    గత ఏడాది డిసెంబర్ 30న శుక్రవారం తెల్లవారుజామున రిషభ్ పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు పాలయ్యాడు.

    దిల్లీ-డెహ్రడూన్ జాతీయ రహదారిపై అతని కారు డివైడర్‌ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

    కారు ప్రమాదం తర్వాత తొలుత రిషభ్ పంత్‌కి డెహ్రడూన్‌లో చికిత్స అందించి, ఆ తర్వాత ముంబైకి తరలించారు.

  6. అదానీ విషయంలో ప్రధాని మోదీ మౌనం వెనుక ఆంతర్యమేంటి

  7. ‘మేం అధికారంలోకి వస్తే.. నిజాం సాంస్కృతిక చిహ్నాలన్నిటినీ ధ్వంసం చేస్తాం’: బండి సంజయ్

    తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిజాం సాంస్కృతిక చిహ్నాలన్నిటినీ ధ్వంసం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.

    హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మించిన సచివాలయం గుమ్మటాలను కూడా కూలుస్తామని చెప్పారు.

    బండి సంజయ్ శుక్రవారం నాడు హైదరాబాద్‌లో ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ‘‘భారతీయ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా (సచివాలయం గుమ్మటాలకు) తగిన మార్పులు చేస్తాం’’ అని పేర్కొన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ ‘ప్రజా ఘోష – బీజేపీ భరోసా’ పేరుతో ఎన్నికల ప్రచారం చేపట్టింది.

  8. ఫిబ్రవరి 14: ‘కౌ హగ్గింగ్ డే’ పిలుపును ఉపసంహరించుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్

    ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీని ‘గోవు ఆలింగన దినం’గా జరుపుకోవాలంటూ ఇచ్చిన పిలుపును ఉపసంహరిస్తున్నట్లు యానిమల్ వెల్‌ఫోర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

    వాలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14వ తేదీని ‘కౌ హగ్గింగ్ డే’ఈ నెల 6వ తేదీన భారత జంతు సంక్షేమ బోర్డు ఇచ్చిన మార్గదర్శకాలు వివాదాస్పదమయ్యాయి.

    ఈ వినతిని ‘‘కేంద్ర మత్స్య, పశు సంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. ఉపసంహరిస్తున్న’’ట్లు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది.

  9. ఏడాదిన్నర కిందట అడవిలో తప్పిపోయిన పసివాడు.. తిరిగి తల్లి ఒడికి చేరాడు

  10. తుర్కియే-సిరియా భూకంపం: 4 రోజుల తర్వాత శిథిలాల నుంచి తల్లిని, నవజాత శిశువును రక్షించిన సిబ్బంది

    సోమవారం ఉదయం తుర్కియే-సిరియాలను భారీ భూకంపాలు కుదిపేసిన 4 రోజుల తర్వాత శిథిలాల కింద నుంచి నవజాత శిశువును, తల్లిని క్షేమంగా రక్షించారు సహాయక సిబ్బంది.

    అర్థరాత్రి నవజాత శిశువును క్షేమంగా బయటికి తీసినట్లు వీడియో ఫుటేజీలో తెలిసింది. నిజంగా అద్భుతం జరిగిందంటూ అక్కడి స్థానిక మీడియా అభివర్ణిస్తోంది.

    ఈ ప్రకృతి విపత్తు తర్వాత నాలుగు రోజులుగా అక్కడ గడ్డకట్టేంత చలి వాతారణం ఉండటంతో, శిథిలాల కిందనున్న బాధితులను రక్షించే ఆశలు అడియాసలవుతున్నాయి.

    అయినప్పటికీ, తుర్కియే, సిరియాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    సహాయక సిబ్బంది కాపాడిన నవజాత శిశువు యాగిజ్‌ను థెర్మల్ బ్లాంకెట్‌లో చుట్టి, చికిత్స కోసం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

    తల్లిని కూడా స్ట్రెక్చర్‌పై తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియరాలేదు.

    తుర్కియేలో ఫిబ్రవరి 6న తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపంతో ఇప్పటికే 21 వేల మందికి పైగా మరణించారు. రిక్టర్ స్కేల్‌పై 7.8గా ఈ భూకంప తీవ్రత నమోదైంది.

    ఈ భూకంపంతో చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. నివాసం, మంచి నీరు, ఇంధనం, విద్యుత్ ఇలా ఏ సౌకర్యాలు వారికి అందుబాటులో లేవు.

  11. ఈ ‘కిల్లర్’ ఏనుగును జనం ప్రేమిస్తారు, భయపడతారు...

  12. అమిగోస్ సినిమా రివ్యూ: కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం థ్రిల్ ఇచ్చిందా... లేదా ?

  13. అఫ్గానిస్తాన్: క్రీడల్లో పాల్గొనకుండా తాలిబాన్ల నిషేధం... బ్రిటన్ పారిపోయిన ముగ్గురు మహిళలు

  14. బీబీసీని నిషేధించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్

    భారతదేశంలో బీబీసీ, బీబీసీ ఇండియా పని చేయకుండా నిషేధించాలంటూ వేసిన పిల్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

    ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ అనే పేరుతో గుజరాత్ అల్లర్ల మీద బీబీసీ డాక్యుమెంటరీ తీసిన నేపథ్యంలో కొందరు ఈ పిటిషన్ వేశారు.

  15. ఆస్ట్రేలియా: సెక్యూరిటీ కారణాలతో చైనా తయారీ నిఘా కెమెరాలను తొలగించాలని నిర్ణయం

  16. హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది

  17. ఇస్రో: విజయవంతమైన ఎస్ఎస్ఎల్-డీవీ2 రాకెట్ లాంచ్

    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయోగం విజయవంతంగా పూర్తయిందని ఇస్రో తెలిపింది.

    మూడు ఉపగ్రహాలను ఎస్‌ఎస్ఎల్-డీవీ2 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో చీఫ్ తెలిపారు.

    ‘వన్‌వెబ్ ఇండియా’కు చెందిన 236 శాటిలైట్స్‌ను తీసుకెళ్లేందుకు జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ని మార్చిలో ప్రయోగిస్తామని ఆయన వెల్లడించారు.

  18. రామచరిత మానస్: తులసీదాస్ రాసిన ఈ గ్రంథం మహిళలను, దళితులను కించపరుస్తోందా... ఎందుకు వివాదం

  19. తుర్కియే-సిరియా భూకంపంలో 20వేలు దాటిన మృతులు

    తుర్కియే, సిరియా సరిహద్దుల్లో వచ్చిన భూకంపంలో మృతుల సంఖ్య 20 వేలు దాటింది.

    ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ భూకంపం వచ్చి 100 గంటలు దాటుతోంది కాబట్టి బాధితులు బతికి ఉండే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయని నిపుణులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.

    మరొకవైపు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారు తీవ్రమైన చలికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. తిండి, నీటి కోసం అల్లాడిపోతున్నారు.

    తుర్కియేకు 1.78 బిలియన్ డాలర్ల సాయం అందిస్తామని ప్రపంచబ్యాంకు ప్రకటించింది.