తుర్కియేకు బయల్దేరిన ఆగ్రా ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ వైద్య బృందం
భూకంపం కారణంగా తుర్కియే,సిరియాలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తీవ్ర స్థాయిలో సంభవించిన భూకంపంతో అక్కడ వేల మంది మృత్యువాత పడ్డారు.
ప్రకృతి విలయం బారిన పడిన తుర్కియేకు సహాయం చేయడం కోసం ఆగ్రాలోని ఆర్మీ ఫీల్డ్ ఆసుపత్రి నుంచి 86 మంది వైద్యుల బృందం అక్కడికి బయల్దేరినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
ఈ బృందంలో పలువురు వైద్య నిపుణులు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన వారికి ఈ బృందం, చికిత్స అందించనుంది.
ఇదే కాకుండా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని కూడా భారత్ పంపింది.