You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ. 2,90,396 కోట్లు

తెలంగాణ శాసన సభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న11వ బడ్జెట్ ఇది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?

  3. బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ నామినీ వినేశ్ ఫోగట్

  4. బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ నామినీ సాక్షి మాలిక్

  5. బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ నామినీ నిఖత్ జరీన్

  6. బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ నామినీ పీవీ సింధు

  7. వికారాబాద్‌లో జరిగింది శివుని చుట్టూ చోటు చేసుకున్న ఘర్షణేనా? బీబీసీ కవరేజీలో బయటపడిన ఆశ్చర్యకరమైన విషయాలివే...

  8. బీబీసీ 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ నామినీ మీరాబాయి చాను

  9. అదానీ వ్యవహారంపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే...

    పార్లమెంట్‌లో అదానీపై చర్చ జరగడాన్ని ప్రభుత్వం కోరుకోవడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

    ‘‘పార్లమెంటులో అదానీ గురించి చర్చ జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు మోదీ ప్రయత్నిస్తున్నారు. వారు అలా చేయడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో మీకు తెలుసు. అదానీపై చర్చ జరుగకుండా చేసేందుకు పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

    ‘‘నేను గత రెండు, మూడేళ్లుగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాను. దానిపై చర్చ జరగాలని కోరుతున్నా. లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. భారత్‌లోని మౌలిక సదుపాయాలు కబ్జా అయ్యాయి. వాటిపై చర్చ జరగాలి. అదానీ వెనుక ఉన్న శక్తి గురించి దేశం తెలుసుకోవాలి’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

    అదానీ గ్రూప్ విషయంలో ప్రభుత్వం మౌనం వహించడం అనేది ప్రభుత్వానికి, అదానీకి మధ్య ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఆరోపించింది.

  10. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే

  11. అఫ్గానిస్తాన్: బాలికల విద్య కోసం పోరాడుతున్న ప్రొఫెసర్ అరెస్ట్

  12. డీజిల్ ఇంజిన్‌ను హైడ్రోజన్ ఇంజిన్‌గా మార్చే కొత్త టెక్నాలజీ...

  13. షార్ట్ సెల్లింగ్: కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్

  14. తెలంగాణ బడ్జెట్‌లో ఏ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారంటే...

    2023-24 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 2,90,396 కోట్లతో ఏర్పాటు చేసింది.

    ఈ మొత్తాన్ని ఏయే రంగాలకు ఎంత మొత్తంలో కేటాయించారంటే...

  15. వ్యవసాయ రంగం కేటాయింపులు రూ. 26,831 కోట్లు

    తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పదేళ్లలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం 7,994 కోట్లు ఖర్చు చేశాయని హరీశ్ రావు వెల్లడించారు.

    రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 1,91,612 కోట్లు అంటే 20 రెట్ల నిధులు అధికంగా ఖర్చు చేసినట్లు చెప్పింది.

    ఇతర కేటాయింపులు

    నీటి పారుదల శాఖకు రూ. 26,835 కోట్లు

    విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు

    ఆసరా ఫించన్లు రూ. 12,000 కోట్లు

    దళిత బంధు రూ. 17,700 కోట్లు

    ఎస్సీ ప్రత్యేక నిధి రూ. 15,233 కోట్లు

    బీసీ సంక్షేమం రూ. 6,229 కోట్లు

    మహిళా, శిశు సంక్షేమం రూ. 2,131 కోట్లు

    ఆయిల్ పామ్ సాగుకూ రూ. 1,000 కోట్లు

  16. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే 86 శాతం వృద్ధి

    రాష్ట్రం సాధించిన ఆర్థిక వృద్ధికి మరో కొలమానం తలసరి ఆదాయం అని హరీశ్ రావు చెప్పారు.

    2013-14 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,12,162.

    2022-23 నాటికి రూ. 3,17,1156కు పెరిగింది.

    ఇది జాతీయ సగటు అయిన రూ. 1,70,620 కంటే 86 శాతం ఎక్కువ.

    జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,46,495 ఎక్కువగా ఉంది.

  17. దేశ జనాభాలో రాష్ట్ర వాటా 2.9%, కానీ జీడీపీలోరాష్ట్ర వాటా 4.9%

    దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొన్నదని హారీశ్ రావు చెప్పారు.

    2014-15లో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతంగా ఉండగా, 2020-21 నాటికి ఇది 4.9 శాతానికి పెరిగిందని వెల్లడించారు.

    దేశ జనాభాలో తెలంగాణ వాసులు 2.1 శాతంగా ఉన్నారని, కానీ దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 4.9 శాతం కావడం ఎంతో గర్వకారణమని అన్నారు.

    దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగైన వృద్ధి రేటు సాధిస్తున్నది. వార్షిక వృద్ధి రేటులో తెలంగాణ 3వ స్థానంలో ఉందని చెప్పారు.

  18. తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ. 2,90,396 కోట్లు

    2023-24 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

    కేంద్రం నుంచి మద్దతు దక్కకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.

    ‘‘తెలంగాణ ఆచరిస్తోంది, దేశం అనుసరిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

    తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ. 2.90 లక్షల కోట్లు అని ఆయన ప్రకటించారు. తెలంగాణ రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లుగా, మూలధన వ్యయం రూ. 2,11,685 కోట్లు అని ఆయన చెప్పారు.

  19. తెలంగాణ బడ్జెట్: శాసనసభకు చేరకున్న మంత్రి హరీశ్ రావు

    తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు శాసనసభకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

    ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కానుంది.

    ఈసారి బడ్జెట్ మొత్తం రూ. 3 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

  20. భారతీయ మ్యూజిక్ కంపోజర్‌ రికీ కేజ్‌కు మూడోసారి గ్రామీ అవార్డు

    భారతీయ సంగీత స్వరకర్త రికీ కేజ్ మూడోసారి గ్రామీ అవార్డును గెలుచుకొని చరిత్ర సృష్టించారు.

    ఆయన మ్యూజిక్ ఆల్బమ్ ‘డివైన్ టైడ్స్’కు తాజాగా గ్రామీ అవార్డు లభించింది. దీంతో మూడుసార్లు గ్రామీ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా రికీ ఘనత సాధించాడు.

    ‘బెస్ట్ ఇమ్మెర్సీవ్ ఆడియో ఆల్బమ్’ కేటగిరీలో డ్రమ్మర్ స్టీవార్ట్ కోపెలాండ్‌తో కలిసి ఆయనకు ఈ అవార్డు దక్కింది.

    ఈ అవార్డును భారత్‌కు అంకితం చేస్తున్నానని రికీ కేజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

    రికీ కేజ్ ఇప్పటికే 2015, 2022లో కూడా గ్రామీ అవార్డును గెలుచుకున్నారు.

    అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీ విజేతలను ప్రకటించారు.