You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రిపబ్లిక్ డే: పరేడ్‌లో బీఎస్ఎఫ్ ఒంటెల దళంలో తొలిసారిగా మహిళా జవాన్లు

కర్తవ్య పథ్‌లో జరుగుతున్న 74వ గణతంత్ర వేడుకల్లో మొట్ట మొదటిసారి ఈజిప్ట్ సాయుధ దళాల కంటింజెంట్ కూడా మార్చ్ నిర్వహించింది. ఈ టీమ్‌లో 120 మంది జవాన్లు పాల్గొన్నారు. బీఎస్ఎఫ్ ఒంటెల దళంలో మహిళా జవాన్లు ఆకట్టుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. జెండా ఎగరవేసిన గవర్నర్ బిశ్వభూషణ్

    ఏపీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతకాన్ని ఎగరవేశారు.

    ఈ వేడుకల సందర్భంగా పలు మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు.ఈ శకటాలు ఆకర్షణీయంగా నిలిచాయి.

    ఈ వేడుకల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

    ‘‘స్వ‌తంత్ర భార‌తదేశాన్ని గ‌ణ‌తంత్ర రాజ్యంగా మార్చిన‌ రాజ్యాంగం అమల్లోకి వ‌చ్చి 73 సంవ‌త్స‌రాలు పూర్తైన సంద‌ర్భంగా ఈ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు మ‌న రాజ్యాంగక‌ర్త‌ల‌ను స్మ‌రించుకుంటూ వారి బాటలో న‌డిచి దేశ అభ్యున్న‌తికి కృషి చేద్దాం’’ అని ఏపీ సీఎం ట్వీట్ చేశారు.

  2. తెలంగాణ: రాజ్‌భవన్‌లో జెండా ఆవిష్కరించిన గవర్నర్.. వేడుకలకు హాజరు కాని సీఎం కేసీఆర్

    తెలంగాణలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు.

    జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

    తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు.

    రాజ్‌భవన్‌లో జరిగిన ఈ గణతంత్ర వేడుకలకు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు హాజరు కాలేదు.

  3. దేశవ్యాప్తంగా భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అల్-సిసీ

    ఇవాళ దేశవ్యాప్తంగా భారత 74వ గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి.

    దేశ రాజధాని దిల్లీలోని కర్తవ్య పథ్‌ రిపబ్లిక్ సంబరాలతో కళకళలాడుతోంది. ఈ సందర్భంగా దిల్లీ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత రిపబ్లిక్ డే వేడుకలకు తొలిసారి హాజరవుతున్న ఈజిప్ట్ అధ్యక్షుడు ఈయనే.

    బుధవారం అల్-సిసీ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈజిప్ట్ అధ్యక్షుడు ఈ వేడుకలకు హాజరు కావడం దైపాక్షిక సంబంధాలలో కీలకమైన అంశంగా భావిస్తున్నారు.

  4. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్!

    అందరికీ భారత 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు మీకందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

  5. వాస్కో డి గామా: భారతదేశాన్ని వెతకాలనే కోరిక వెనుక అసలు కారణం ఇదీ...