You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రిపబ్లిక్ డే: పరేడ్‌లో బీఎస్ఎఫ్ ఒంటెల దళంలో తొలిసారిగా మహిళా జవాన్లు

కర్తవ్య పథ్‌లో జరుగుతున్న 74వ గణతంత్ర వేడుకల్లో మొట్ట మొదటిసారి ఈజిప్ట్ సాయుధ దళాల కంటింజెంట్ కూడా మార్చ్ నిర్వహించింది. ఈ టీమ్‌లో 120 మంది జవాన్లు పాల్గొన్నారు. బీఎస్ఎఫ్ ఒంటెల దళంలో మహిళా జవాన్లు ఆకట్టుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. శబరిమల: అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళల పరిస్థితి ఇప్పుడెలా ఉంది?

  2. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  3. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్న అదానీ గ్రూప్

    హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు అదానీ గ్రూప్ గురువారం తెలిపింది.

    హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2023 జనవరి 24న ప్రచురించిన నివేదిక "ద్వేషపూరితమైనది", "తప్పుడు సమాచారమని" అదానీ గ్రూపు పేర్కొంది. ఇది అదానీ గ్రూపు, వాటాదారులు, పెట్టుబడిరాలుపై ప్రతికూల ప్రభావం చూపించదని పేర్కొంది.

    బుధవారం ఈ నివేదిక బయటికొచ్చిన తరువాత అదానీ గ్రూపు దాని మార్కెట్ విలువలో సుమారు 11 బిలియన్ డాలర్లు కోల్పోయింది.

    హిండెన్‌బర్గ్ రిసెర్చ్ "షార్ట్ సెల్లింగ్"పై దృష్టి పెట్టే పెట్టుబడి పరిశోధన సంస్థ.

    అదానీ సమూహం "కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద మోసానికి పాల్పడిందని" హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో ఆరోపించింది.

    కొద్ది రోజుల్లో అదానీ గ్రూపు షేర్లు పబ్లిక్‌కు అమ్మేందుకు సిద్ధపడుతుండగా ఈనివేదిక వెలువడింది.

    ఈ నివేదిక, ఆఫ్ షోర్ టాక్స్ హెవెన్‌లైన మారిషస్, కరీబియన్ వంటి దేశాలలో అదానీ గ్రూపు కంపెనీల యాజమాన్యంపై ప్రశ్నలు లేవనెత్తింది.

    అదానీ గ్రూపుకు "గణనీయమైన అప్పులు" ఉన్నాయని, ఇది మొత్తం గ్రూపును "ప్రమాదకర స్థితిలోకి నెడుతుందని" పేర్కొంది.

    కాగా, హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు వ్యతిరేకంగా అమెరికా, భారత్‌లలో తీసుకోగలిగిన "శిక్షల గురించి" పరిశీలిస్తున్నట్టు గురువారం అదానీ గ్రూపు తెలిపింది.

    తమ సంస్థ ఎప్పుడూ "చట్టబద్ధంగానే వ్యవహరించిందని" పేర్కొంది.

    "ఈ నివేదిక భారత స్టాక్ మార్కెట్లలలో కలిగించిన అలజడి ఆందోళనకరమని, భారత పౌరులకు అనవసర చింత కలిగించిందని" అదానీ లీగల్ టీం హెడ్ జతిన్ జలంద్‌వాలా అన్నారు.

    "ఆ నివేదిక, అందులో పేర్కొన్న నిరాధారమైన విషయాలు అదానీ గ్రూపు షేర్ల విలువను పడగొట్టే ప్రయత్నమన్నది స్పష్టం. అదానీ షేర్లు పడిపోతే హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు ప్రయోజనం చేకూరుతుంది" అని ఆయన అన్నారు.

  4. క్రికెట్: 30ఏళ్ల కిందట సరిగ్గా ఈ రోజే టెస్టుల చరిత్రలో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ ఇది

  5. పంచాయతీరాజ్ ఏఈ పై వాటర్ బాటిల్ విసిరిన మానకొండూరు ఎంపీపీ భర్త

    కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎంపీపీ కార్యాలయంలో గురువారం ఎంపీపీ సులోచన ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌లో ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ తిరుపతి మీదకు వాటర్ బాటిల్ విసిరికొట్టిన ఘటన వైరల్‌గా మారింది.

    వెల్ది గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భూమి పూజ సమయం నిర్ణయించే విషయంలో ఏఈ పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

    ఉదయం గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం కార్యాలయంలో ఎంపీపీ సులోచన చాంబర్‌లో ఎంపీపీ ముందే ఈ ఘటన జరిగింది.

    గదిలో ఉన్న మిగతా ప్రజాప్రతినిధులు,అధికారులు గొడవ కలిసి సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.

    శిథిలావస్థకు చేరిన వెల్ది పీహెచ్‌సీకి నూతన భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయి. నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగాల్సి ఉంది.

    భార్య స్థానంలో భర్త పెద్దరికం చెలాయించడం, ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించిన ఎంపీపీ భర్త శ్రీనివాస్ రెడ్డి తీరుపై విమర్శలు వస్తున్నాయి.

    ఈ ఘటన పై ఏఈ తిరుపతి మాట్లాడుతూ, ఎమ్మెల్యేను సంప్రదించాక సమయం నిర్ణయిస్తామని చెప్పానని అన్నారు. మిగితా ఘటన పై స్పందించేందుకు నిరాకరించారు.

    ఈ ఘటనపై ఎంపీపీ సులోచన బీబీసీతో మాట్లాడారు.

    "11 గ్రామాలకు సేవలందించే వెల్ది ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నిర్మాణానికి కోటిన్నర నిధులు తెచ్చాం. అది మా ఎన్నికల హామీ. కొత్త బిల్డింగ్ శంకుస్థాపనకు ఏఈ తిరుపతి సహకరించకపోగా నిర్లక్ష్యం ప్రదర్శించాడు. ప్రజలకు మేం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నా భర్త బాటిల్ విసిరిన ఘటనలో అది మా ఆవేదనే తప్ప ఇంకోటి కాదు" అన్నారామె.

  6. జపాన్ సముద్రంలో మునిగిన కార్గో షిప్.. ఎనిమిది మంది మృతి

    జపాన్, సౌత్ కొరియా మధ్య సముద్రంలో కార్గో షిప్ మునిగిపోవడంతో ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో చైనా పౌరులు కూడా ఉన్నారని ఆ దేశ అధికారులు వెల్లడించారు.

    జిన్ తియాన్ అనే నౌక బుధవారం సముద్రంలో మునిగిపోయింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్ట్ గార్డ్, ప్రైవేట్ షిప్‌లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

    ఇప్పటివరకు ఐదుగురిని రక్షించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

    ఈ ఓడలో 22 మంది సిబ్బంది ఉన్నారు. జపాన్‌లోని డాంగో ద్వీపానికి సుమారు ఒక కిలోమీటరు దూరం నుంచీ ఓడ సిబ్బంది ఒత్తిడి సంకేతాలను పంపడం ప్రారంభించారు.

    మృతుల్లో ఆరుగురు చైనా పౌరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, మృతుల సంఖ్యను జపాన్ ఇంకా ధృవీకరించలేదు.

  7. రిపబ్లిక్ డే: పరేడ్‌లో కోనసీమ ప్రభల తీర్థం... మోదీ మెచ్చుకున్న దాని చరిత్ర ఏంటి

  8. జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులను విడిచిపెట్టిన పోలీసులు

    జామియా మిలియా యూనివర్సిటీ నుంచి అదుపులోకి తీసుకున్న విద్యార్థులను గురువారం విడిచిపెట్టారు.

    జనవరి 25 బుధవారం నాడు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో 'బీబీసీ డాక్యుమెంటరీ: ది మోదీ క్వశ్చన్' ప్రదర్శించేందుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ప్రయత్నించారు.

    అయితే, డాక్యుమంటరీ స్క్రీనింగ్‌ను అడ్డుకున్నారు. మధ్యహ్నం నుంచే యూనివర్సిటీ బయట భారీగా పోలీసులను మోహరించారు.

    ఈ సందర్భంగా కొందరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    "సాయంత్రం 6.00 గంటలకు డాక్యుమెంటరీ ప్రదర్శన ప్లాన్ చేస్తే, మధ్యహ్నం ఒంటి గంటకే ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని తరువాత విద్యార్థులు నిరసన చేశారు. నాలుగు గంటలకు నిరసన చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరో ఏడుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు" అని జామియా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ విభాగం కార్యదర్శి అజీజ్ బీబీసీతో చెప్పారు.

    అదుపులోకి తీసుకున్నవారిలో ఒక అమ్మాయిని నిన్ననే విడిచిపెట్టారు.

  9. గూగుల్: ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా... అయితే వచ్చే మార్పులివే

  10. భారత్, పాకిస్తాన్ ఒక దశలో అణుయుద్ధానికి దిగాలనుకున్నాయా...

  11. హంట్ రివ్యూ: ‘ఓర్ని అంత జరిగిందా’ అనిపించే ట్విస్ట్... దాన్నే నమ్ముకున్న సుధీర్ బాబు

  12. 'నాగేశ్వరరావు నాకు బాబాయే.. ఆయన పట్ల ప్రేమ నా గుండెల్లో ఉంది' - బాలకృష్ణ

    బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో "అక్కినేని తొక్కినేని" అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బాలకృష్ణ స్పందించారు.

    హిందూపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు పట్ల ప్రేమ తన గుండెల్లో ఉంటుందని, బయట జరిగే విషయాలు తాను పట్టించుకోనని అన్నారు.

    "నాగేశ్వరరావు నాకు బాబాయే. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా ఉండేవారు. నన్ను ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన పట్ల ప్రేమ నా గుండెల్లో ఉంది. కొన్నిచోట్ల ఎన్టీఆర్‌ను ఎన్టీవోడు అని, నాగేశ్వరరావుని నాగ్గాడు అని అంటారు. నన్ను కూడా ఏదో అంటుంటారు. అదంతా వారి అభిమానం, ప్రేమ. అంతమాత్రాన చులకన చేసినట్టు కాదు" అన్నారు బాలకృష్ణ.

  13. గుజరాత్: వృద్ధాశ్రమం నడపడమే కాదు, ఆమె వారిని తల్లిలా, చెల్లిలా చూసుకుంటారు

  14. వరుసగా రెండోసారి ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా బాబర్ ఆజమ్

    వరుసగా రెండోసారి ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా బాబర్ ఆజమ్ నిలిచాడు.

    బాబర్ ఆజమ్ పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ కెప్టెన్.

    ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) 2022 ఏడాదికి చెందిన అవార్డులను ప్రకటించింది.

    ఇప్పటి వరకు వన్డే, టీ20 ఫార్మాట్‌లో ఉత్తమమైన మహిళల, పురుషుల టీమ్‌లను మాత్రమే ఐసీసీ ప్రకటించింది.

    మహమ్మద్ సిరాజ్‌ని ‘బెస్ట్ వన్డే బౌలర్‌’గా ఐసీసీ గౌరవించింది.

    టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది.

  15. రిపబ్లిక్ డే: ఈజిప్ట్‌కు భారత్ రహస్య సహకారం అందించిందా? రెండు దేశాల సంబంధాలు ఇప్పుడెలా ఉన్నాయి?

  16. బీఎస్ఎఫ్ ఒంటెల దళంపై తొలిసారి మహిళలు

    సరిహద్దు భద్రతా దళానికి(బీఎస్ఎఫ్) చెందిన ఒంటెల దళంపై తొలిసారి ఈ ఏడాది మహిళలు కనిపించారు. కర్తవ్య పథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో మహిళా కంటింజెంట్ పాల్గొంది.

    సాయుధ దళాలకు చెందిన 16వ కంటింజెంట్‌గా వీరు మార్చ్ నిర్వహించారు.

    పలు రంగాల్లో మహిళా సాధికారిత ప్రతిబింబించేలా ఈ దళంలో తొలిసారి మహిళల్ని భాగస్వాములు చేశారు.

  17. ప్రగతి భవన్‌లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్

    ప్రగతి భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు పాల్గొని, జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.

    జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

    జాతీయ పతకావిష్కరణ తర్వాత సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో అమర జవానుల స్మారక స్థూపం వద్దకు వెళ్లి జ్యోతి ప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు.

    ఈ సందర్భంగా దేశం కోసం అమర జవానుల త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

  18. రిపబ్లిక్ డే వేడుకలలో ఆకట్టుకున్న ఏపీ శకటం

    రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.

    ఆంధ్రప్రదేశ్, అస్సాం, లద్దాఖ్, త్రిపుర, జార్ఖాండ్, అరుణాచల్‌ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, గుజరాత్ రాష్ట్రాలు కర్తవ్య పథ్‌లో తమ శకటాలను ప్రదర్శించాయి.

    ఆంధ్రప్రదేశ్ ప్రదర్శించిన శకటం థీమ్ ప్రభల తీర్థం.

    లద్దాఖ్ తన శకటాన్ని ప్రకృతితో ఉన్న సామరస్యపు సంబంధాన్ని తెలియజేస్తూ ప్రదర్శించింది.

    ఇలా ప్రతి రాష్ట్రం తమ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా శకటాలను ప్రదర్శించాయి.

  19. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేక దళాలు.. కంటింజెంట్ కమాండర్‌గా సింధు రెడ్డి

    ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన గరుడ్ స్పెషల్ ఫోర్సెస్ తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగంగా కర్తవ్య పథ్‌లో మార్చ్ నిర్వహించాయి.

    ఈ ఫోర్సెస్‌కు కంటింజెంట్ కమాండర్‌గా స్క్వాడ్రన్ లీడర్ సింధు రెడ్డి నిర్వహించారు.

    తన ప్రత్యేక దళాలను, మేడిన్ ఇండియా క్షిపణి టెక్నాలజీని ఈ సందర్భంగా భారత్ ప్రదర్శించింది.

    144 సభ్యుల ఐఏఎఫ్ కంటింజెంట్‌లో ఒకే ఒక్క లేడీ ఆఫీసర్‌గా సింధు ఉన్నారు.

    ఐఏఎఫ్ హెలికాప్టర్ పైలట్‌గా సింధు పనిచేస్తున్నారు.

    తొలిసారి మార్చ్ నిర్వహించిన ఈజిప్ట్ కంటింజెంట్‌

    కర్తవ్య పథ్‌లో జరుగుతున్న 74వ గణతంత్ర వేడుకల్లో మొట్ట మొదటిసారి ఈజిప్ట్ సాయుధ దళాల కంటింజెంట్ కూడా మార్చ్ నిర్వహించింది. ఈ టీమ్‌లో 120 మంది జవాన్లు పాల్గొన్నారు.

    ఈ పరేడ్‌ను వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసీ తిలకించారు.

  20. కర్తవ్య పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన మోదీ

    దిల్లీలో కర్తవ్య పథ్‌లో గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.

    అనంతరం సైనిక దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

    ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసీ కర్తవ్య పథ్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    ఈజిప్ట్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ దగ్గరుండి ఆహ్వానం పలికారు.

    వేడుకల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.