హాకీ వరల్డ్ కప్: తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ మీద భారత్ గెలుపు

బిర్సా ముండా స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-0 స్కోరుతో స్పెయిన్‌ను ఓడించింది.

లైవ్ కవరేజీ

  1. మహారాష్ట్ర: షిర్డీ వెళుతున్న బస్సును ఢీకొన్న లారీ, 10మంది మృతి

    నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    ఫొటో సోర్స్, UGC

    మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్-షిర్డీ హైవేపై పాథారే గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    సాయిబాబా భక్తులతో వెళుతున్న బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని నాసిక్ పోలీసులు తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    ఫొటో సోర్స్, UGC

    ఈ ప్రైవేటు లగ్జరీ బస్సులో 50మంది ప్రయాణిస్తున్నారు. అంబర్ నాథ్ ప్రాంతం నుంచి షిర్డీ సాయిబాబా భక్తులు 15 బస్సుల్లో షిర్డీ బయలుదేరారు. ప్రమాదానికి గురైన బస్సు ఆ బస్సుల్లో ఒకటి.

    నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    ఫొటో సోర్స్, UGC

    భారీ లోడుతో వస్తున్న లారీ, బస్సును బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.

    సింగిల్ లైన్ రోడ్డు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

  2. ఎంవీ గంగా విలాస్: ‘అతి పెద్ద’ రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించనున్న మోదీ

    ఎంవీ గంగా విలాస్

    ఫొటో సోర్స్, Facebook/PIB

    ప్రపంచంలోనే ‘అతి పెద్ద’ రివర్ క్రూయిజ్‌గా చెబుతున్న ఎంవీ గంగా విలాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు.

    గంగా నదిలో సాగే గంగా విలాస్ సుమారు 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. భారత్‌లోని అయిదు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌కు సైతం ఈ షిప్ వెళ్తుంది.

    వారణాసి, సార్నాథ్, సుందర్బన్స్, కజిరంగ నేషనల్ పార్క్ వంటి ప్రాంతాలను ఈ ప్రయాణంలో చూడొచ్చు.

    ఈ ట్రిప్‌ పూర్తి చేయడానికి 51 రోజులు పడుతుంది. 62.5 మీటర్ల పొడవు, 12.8 మీటర్ల వెడల్పు ఉండే ఈ షిప్‌లో మూడు డెక్‌లు ఉంటాయి. 36 మంది ఇందులో ప్రయాణించొచ్చు.

  3. హలో ఆల్, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.